Feb 23, 2016

చదివి వినిపిస్తుంది
చేతిలో ఫోన్‌ ఉన్నప్పుడు అన్నీ చూస్తాం... వెంటనే స్పందిస్తాం. కానీ, ప్రయాణాల్లో ఉన్నప్పుడైతే! అంటే... కారు లేదా బైక్‌ నడుపుతున్నప్పుడు మాటేంటి? ఫోన్‌కి వచ్చిన ముఖ్యమైన మెసేజ్‌లు, నోటిఫికేషన్స్‌ చూడాలంటే ఎలా? ఏముందీ... ఫోనే చదివి వినిపిస్తుంది. ఎలా సాధ్యం అంటే... అందుకు తగిన ఆప్స్‌ గూగుల్‌ ప్లేలో సిద్ధంగా ఉన్నాయి. ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చాలు. మీరు ఎంపిక చేసిన వాటి నుంచి వచ్చే మెసేజ్‌లు, నోటిఫికేషన్స్‌ని ఫోనే చదివి వినిపిస్తుంది. ఫోన్‌ రింగ్‌ అవుతున్నప్పుడే ఫోన్‌ చేస్తున్న వ్యక్తి పేరుని పలుకుతుంది. ఎవరైనా మిస్డ్‌కాల్‌ చేస్తే ఆ వ్యక్తి ఎవరో కూడా చెబుతుంది. ఫోన్‌ నెంబర్‌కి వచ్చే టెక్స్ట్‌ మెసేజ్‌లను చదివి వినిపిస్తుంది. కావాలంటే Voice Notification: Shouter ఆప్‌ని ప్రయత్నించండి. ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత ఆప్‌ సేవల్ని ‘ఎనేబుల్‌’ చేయాలి. ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసిన ఏయే ఆప్స్‌ నుంచి వచ్చే నోటిఫికేషన్స్‌ని చదివి వినిపించాలనేది కూడా మీరే నిర్ణయించొచ్చు. అందుకు Select apps విభాగం ఉంది. అన్ని వేళల్లో కాకుండా మీరు నిర్ణయించిన సమయంలోనే చదివి వినిపించేలా షెడ్యూల్‌ చేయవచ్చు. ముఖ్యమైన సర్వీసుల నుంచి వచ్చే నోటిఫికేషన్స్‌ని రెండు సార్లు చదివేలా ఆప్షన్‌ని సెట్‌ చేసుకునే వీలుంది. ఆప్‌ని వాడి చూద్దాం అనుకుంటే https://goo.gl/8RVYNN లింక్‌లోకి వెళ్లండి.
* ఇలాంటిదే మరోటి ప్రయత్నిద్దాం అనుకుంటే ReadItToMe ఉంది. చదివితే వినడం ఒక్కటే కాదు. మాట్లాడుతూనే (వాయిస్‌ రిప్లె) మీ స్పందన తెలపొచ్చు. డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/HHxWix

0 comments:

Post a Comment