రోజూ వాల్‌పై ఎన్నో పోస్టింగ్స్ చూస్తుంటాం. లైక్‌లు కొడుతుంటాం...
కామెంట్ చేస్తాం... ఇలా ఎఫ్‌బీలో రోజూ చాలానే చేస్తుంటాం. మరి, మీకు
ఎప్పుడైనా మొత్తం ఫేస్‌బుక్ యాక్టివిటీని చూద్దాం అనిపించిందా? అయితే,
ముందుగా ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అవ్వండి. తర్వాత
www.facebook.com/me/allactivity యూఆర్‌ఎల్ లింక్‌ని అడ్రస్‌బార్‌లపై
టైప్ చేసి ఎంటర్ నొక్కండి. మొత్తం సెర్చ్ హిస్టరీ అంతా క్షణాల్లో ముందు
ప్రత్యక్షమవుతుంది. ఇక మీరు స్క్రోల్ చేస్తూ చూడడమే! ఒకవేళ మీరు పోస్ట్
చేసినవి మాత్రమే కావాలనుకుంటే? అందుకో సెర్చ్‌వర్డ్ ఉంది. ఫేస్‌బుక్
హోంలోని సెర్చ్‌లో posts by me టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
0 comments:
Post a Comment