Mar 21, 2016

pdf ఫైల్స్ చదివి వినిపించాబడలా?


Image result for adobe readerఇంగ్లీష్‌లో ఉన్న పీడీఎఫ్ ఫైల్‌ని మనం చదవకుండా ఎంచక్కా ఎవరైనా వినిపిస్తే బాగుండు కదా! అవును.. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న ఫైల్స్‌ని ఎలాంటి యాప్ గానీ, టూల్ గానీ ఇన్‌స్టాల్ చేయకుండానే వినొచ్చు. పీడీఎఫ్ ఫైల్‌ను అడోబ్ అక్రోబాట్ రీడర్‌లో ఉండే ఆప్షన్స్ ద్వారా సులువుగా పీడీఎఫ్‌ను వినేయొచ్చు.

* పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత..ఇప్పుడు మెనూ బార్‌లోని వ్యూ (view)ఆప్షన్‌లో  కింద వున్న రీడ్ అవుట్ లౌడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అందులో యాక్టీవ్ రీడవుట్ లోడ్ క్లిక్ చేసి రీడ్ ఆప్షన్‌ని యాక్టివేట్ చేయండి. అంతే... ఇంగ్లీష్‌లో ఉన్న పీడీఎఫ్ ఫైల్ ఆడియో రూపంలో వినిపిస్తుంది.
* ఓపెన్ చేసిన పేజీని మాత్రమే వినాలనుకుంటే రీడ్ దిస్ పేజి ఓన్లీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
* డాక్యుమెంట్ మొత్తం వినాలనుకుంటే... రీడ్ టు ఎండ్ ఆఫ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
* ఎవరూ వినకుండా ఓపికతో చదువుకోవాలనుకుంటే... డీయాక్టివేట్ రీడ్ అవుట్ లౌడ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

BY

tanugula rakesh

thanugularakesh@gmail.com

 

1 comment: