Feb 5, 2016

ఒత్తిడి దూరం
చదువు... ఉద్యోగం... వ్యాపారం... ఏ రంగంలోనైనా రోజూ ఉరుకులు పరుగులే. రోజుకి 24 గంటలు కంటే ఎక్కువ ఉంటే బాగుంటుందని అనుకునేవారూ లేకపోలేదు. ఇంతటి బిజీ బిజీ కార్యాచరణతో ఒత్తిడిని ఎదుర్కోవడం అనివార్యం. అందుకే స్మార్ట్‌ మొబైల్‌ని తీయండి. కాసేపు మనసుని ప్రశాంతంగా ఉంచేందుకు Calm ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేయండి. ఆప్‌లో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకుని రోజులో కొంత సమయం ప్రశాంత జీవనం కోసం సాధన చేయవచ్చు. అందుకు Meditate విభాగంలో కొన్ని ఉచిత కోర్సులు (7 Days of Calm, Body Scan, Calm...) ఉన్నాయి. మీకు అనువైన సమయంలో రోజూ సాధన చేయవచ్చు. క్యాలెండర్‌తో విభాగాల వారీగా మీరు చేస్తున్న సాధనని ట్రాక్‌ చేసి చూడొచ్చు. Scenes మెనూలోకి వెళ్లి యానిమేషన్‌ గ్రాఫిక్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌లను మార్చుకోవచ్చు.

BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

0 comments:

Post a Comment