కిక్ ఇచ్చేక్రోమ్ ఆప్స్!
అన్నీ ఆప్స్‌తోనే! ఒక మొబైల్‌లోనేనా? డెస్క్‌టాప్‌పైనా సందడి చేస్తున్నాయి! క్రోమ్ వాడితే వాటిపై ఓ కన్నేయండి!
వెబ్
సర్వీసు... యుటిలిటీ టూల్... గేమ్... ఇలా ఏదైనా ఆప్‌గా
రూపొందుతున్నాయి. అందుకే ఒక్క మొబైల్, ట్యాబ్‌ల్లోనే కాకుండా
డెస్క్‌టాప్‌పైనా ఆప్స్ తెగ సందడి చేస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌లు
ఉన్నాయిగా? ఇంకా ఆప్స్ ఏంటి? అనేగా సందేహం. సాఫ్ట్‌వేర్‌లు సిస్టంలో
ఇన్‌స్టాల్ చేస్తేగానీ రన్ అవ్వవు. అదే ఆప్స్ అయితే మీరు వాడుతున్న
బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్ చేస్తే చాలు. ఒక్క క్లిక్కుతో ఓపెన్ చేసి
వాడుకోవచ్చు. బ్రౌజర్ వేదిక అంటున్నారు. అంటే... నెట్ కనెక్షన్ ఎప్పుడూ
ఉండాలేమో? అనుకునేరు. ఏం అక్కర్లేదు. ఫోన్‌లో మాదిరిగానే ఒక్కసారి
ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు. ఆఫ్‌లైన్‌లో ఆప్‌ని హాయిగా వాడుకోవచ్చు.
మరెందుకు ఆలస్యం... అవేంటో చూద్దాం!
పీడీఎఫ్‌లకు ప్రత్యేకం
ఇంట్లోనో...
ఆఫీస్‌లో... సిస్టం వాడుతుంటారు. ఏదో ఒక అవసరం మేరకు పీడీఎఫ్ ఫైల్స్‌ని
యాక్సెస్ చేస్తుంటారు. వాడుతున్న సిస్టంలో అడోబ్ రీడర్ ఉంటే సరి.
లేకుంటే పీడీఎఫ్ ఫైల్స్‌ని ఓపెన్ చేసి చూడడం ఎలా? అందుకు క్రోమ్ ఆప్
ఒకటి ఉంది. అదే PDF Viewer. దీన్ని బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్ చేస్తే చాలు.
సిస్టంలోని క్రోమ్ ఆప్స్ జాబితాలోకి ఐకాన్ రూపంలో చేరిపోతుంది. ఇక
ఎప్పుడైనా సిస్టంలోని సాఫ్ట్‌వేర్ మాదిరిగానే దీన్ని వాడుకోవచ్చు. ఆప్‌ని
సెలెక్ట్ చేస్తే చిన్న విండో వస్తుంది. దాంట్లోని ఫోల్డర్ గుర్తుపై
క్లిక్ చేసి సిస్టంలోని పీడీఎఫ్ ఫైల్స్‌ని ఓపెన్ చేయవచ్చు. విండోలో
వచ్చే టూల్‌బార్‌తో పీడీఎఫ్ ఫైల్‌ని కావాల్సినట్టుగా చూడొచ్చు. ఆప్‌ని
ప్రయత్నిద్దాం అనుకుంటే http://goo.gl/bDkKLG లింక్‌ని చూడండి.
కంటికి రక్షణ
ఎప్పుడూ
సిస్టంపైనే పనా? పనిలో నిమగ్నమైపోయి కళ్లు ఒత్తిడి లోనయ్యేలా బ్రేక్
తీసుకోకుండా పని చేస్తున్నారా? అయితే, బ్రేక్ తీసుకునేందుకు అనువైన Eye
Care ఆప్‌ని ప్రయత్నించండి. ఇన్‌స్టాల్ చేయగానే ఆప్స్ జాబితాలోకి
చేరిపోతుంది. క్లిక్ చేసి మీరెంత సమయం పని చేయాలి? ఎన్ని నిమిషాలు బ్రేక్
తీసుకోవాలనేది నిర్ణయించుకుని సెట్‌అప్ చేయాలి. డీఫాల్ట్‌గా కొన్ని
ఫార్మెట్‌లు ఉన్నాయి. వాటిల్లో 20 నిమిషాలు పని చేసి ఒక నిమిషం విరామం
తీసుకోవచ్చు. లేదంటే... 30 నిమిషాలు పని చేసి మూడు నిమిషాలు విరామం
తీసుకోవచ్చు. ఒకవేళ మీరే పని, విరామ సమయాన్ని సెట్‌అప్ చేసుకోవాలంటే?
Custom మెనూలోకి వెళ్లాలి. మధ్యలో టైమర్‌ని మార్చుకోవాలంటే సెట్టింగ్స్
గుర్తుపై క్లిక్ చేయాలి. ఆప్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు http://goo.gl/ghOizz లింక్‌లోకి వెళ్లండి.
ఇలా భద్రం
నెట్టింట్లో
ఏవేవో పనులు. కొన్నింటిని యాక్సెస్ చేయాలంటే కచ్చితంగా
సభ్యులవ్వాల్సిందే. అలా రిజిస్టరైన వాటికి సంబంధించిన లాగిన్ వివరాల్ని
గుర్తుంచుకోవాల్సిందే. మరి, ఎన్నని గుర్తుంచుకుంటారు. మర్చిపోయిన ప్రతిసారీ
తిరిగి లాగిన్ వివరాల్ని పొందడం మరో ప్రక్రియ. దీంతో సమయం వృథా. అందుకే
మీరు వాడే అన్ని ఆన్‌లైన్ ఎకౌంట్‌ల యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ వివరాల్ని
సిస్టంలోనే భద్రం చేసుకుంటే? దానికేం అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అక్కర్లేదు.
సింపుల్‌గా PASSWORDS క్రోమ్‌ని ఆప్‌ని వాడుకోవచ్చు. వాడడం కూడా చాలా
సులుభం. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత రన్ చేయగానే Master Password, Master
PIN నెంబర్లు అడుగుతుంది. వాటిని క్రియేట్ చేసిన తర్వాత Site Name, User
Name, Password వివరాలతో డేటాబేస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. మొత్తం వెబ్
సర్వీసుల లాగిన్ తాళాల్ని జాబితాగా పెట్టుకున్నాక Save Data బాక్స్‌పై
క్లిక్ చేయాలి. ఇక మీరు ఏదైనా సర్వీసు పాస్‌వర్డ్ లేదా యూజర్‌నేమ్
మర్చిపోతే మాస్టర్ పాస్‌వర్డ్, పిన్ నెంబర్లు ఎంటర్ చేసి డేటాబేస్‌ని
ఓపెన్ చేసి చూడొచ్చు. వాడదాం అనుకుంటే http://goo.gl/qInvoF లింక్‌ని చూడండి.
ఏవైనా ప్లే అవుతాయి!
పాటలు
వినేందుకు ఎంపీ3 ప్లేయర్ ఏది వాడుతున్నారు? పీసీ యూజర్లు అందరూ Winamp
అనే చెబుతారు. సిస్టంలో ఉన్న పాటల్ని ప్లే చేసుకునేందుకు ఇది అనువైనదే.
కానీ, మీరు క్లౌడ్ స్టోరేజ్‌లో దాచుకున్న పాటల్ని వినాలంటే? లేదా
ఆన్‌లైన్ మ్యూజిక్ అడ్డాల్లోని ఆల్బమ్స్‌ని బ్రౌజ్ చేసి వినాలంటే?
సిస్టంలో ఇన్‌స్టాల్ చేసిన Winamp ప్లేయర్‌తో అసాధ్యం. మరైతే లోకల్
హార్డ్‌డ్రైవ్‌లు, క్లౌడ్‌స్టోరేజ్, నెట్టింట్లోని ఎంపీ3 ట్రాక్స్‌ని
వినేందుకు అనువైన ప్లేయర్ లేదా? ఎందుకు లేదు... Enjoy Music Player
క్రోమ్ ఆప్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటే సరి. ఓపెన్ చేయగానే Local, Online,
Google Drive ట్యాబ్ ఆప్షన్లతో కనిపిస్తుంది. ఇక సిస్టం
హార్డ్‌డ్రైవ్‌ల్లో భద్రం చేసుకున్న పాటల్ని వినేందుకు 'లోకల్'
విభాగంలోకి వెళ్లాలి. Add Music ఆప్షన్‌తో డ్రైవ్‌ల్లోని మ్యూజిక్
ఫోల్డర్లను జత చేయవచ్చు. ఆన్‌లైన్ స్థావరాల్లోని ట్రాక్స్‌ని వినేందుకు
'ఆన్‌లైన్' విభాగం ఉంది. నెట్టింట్లో ఎక్కువగా ఆదరణ పొందిన వాటిని
Trending Music మెనూలో చూడొచ్చు. సెర్చ్ ద్వారా వినాలనుకునే ట్రాక్స్‌ని
వెతకొచ్చు. ఇక గూగుల్ అందించే క్లౌడ్ స్టోరేజ్ 'గూగుల్ డ్రైవ్'లోని
పాటల్ని వినేందుకు ప్రత్యేక విభాగం ఉంది. జీమెయిల్ ఐడీతో సైన్‌ఇన్ అయితే
చాలు. డ్రైవ్‌లో మీరు అప్‌లోడ్ చేసిన అన్నీ ట్రాక్స్ ప్లేయర్‌లోకి
వచ్చేస్తాయి. ఎప్పుడంటే అప్పుడు వినొచ్చు. అలాగే, ప్లేయర్‌లో వింటున్న
ట్రాక్స్‌ని సోషల్ వాల్స్‌పై షేర్ చేయవచ్చు. మ్యూజిక్ ప్లేయర్ ఆప్
కోసం http://goo.gl/nQbcWJ లింక్‌లోకి వెళ్లండి.
కుంచె పడతారా?
మీకు
చిత్ర లేఖనం అంటే ఇష్టమా? ఇప్పటి వరకూ సిస్టంలో ఏవైనా పెయింటింగ్
టూల్స్‌ని ప్రయత్నించారా? అయితే, ఒకసారి Sketchpad 3.5 ఆప్‌ని
ప్రయత్నించండి. కుంచె చేతపట్టుకుని డెస్క్‌టాప్‌పైనే స్కెచ్‌ప్యాడ్‌ని
క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. ఆప్‌ని రన్ చేస్తే టూల్‌బార్,
కలర్‌ప్యాలెట్స్‌తో ఓపెన్ అవుతుంది. Welcome to sketchpad ద్వారా బొమ్మలు
గీయడానికి ఖాళీ ప్యాడ్‌ని తీసుకోవచ్చు. Streamer మెనూతో బ్రెష్
స్టెల్స్‌ని వివిధ రకాల మార్పులు చేయవచ్చు. Diameter, Opacity లను
కావాల్సిన పరిమాణంగా మార్చుకోవచ్చు. Spraypaint కూడా చేయవచ్చు. గీసిన
బొమ్మలకు అదనంగా ఏవైనా క్లిప్‌ఆర్ట్‌లను పెట్టుకోవాలంటే Clipart మెనూలోకి
వెళ్లొచ్చు. Load your own image ఆప్షన్‌తో సిస్టంలోని ఇమేజ్‌లను కూడా
అప్‌లోడ్ చేసి పెట్టుకోవచ్చు. క్లిప్‌ఆర్ట్‌లను కూడా కావాల్సినంత
'ఒపాసిటీ'తోనే పెట్టుకోవచ్చు. అలాగే, Stamp మెనూలోకి వెళ్లి బొమ్మలు,
గుర్తుల్ని పెట్టుకోవచ్చు. మొత్తం పూర్తయ్యాక డౌన్‌లోడ్ మెనూలోకి వెళ్లి
వివిధ ఫార్మెట్‌లోకి(PNG, Jpeg, PDF... ) డ్రాయింగ్‌ని డౌన్‌లోడ్
చేయవచ్చు.ఒకవేళ మీరు గూగుల్ అందించే క్లౌడ్‌స్టోరేజ్ 'గూగుల్
డ్రైవ్'ని వాడుతున్నట్లయితే Export మెనూలోకి వెళ్లి డ్రాయింగ్‌ని
అప్‌లోడ్ చేవచ్చు. డ్రాయింగ్‌ని షేర్ చేయాలంటే ఫేస్‌బుక్, జీమెయిల్,
ట్విట్టర్, imgur, Tumblr, Pinterest.... లాంటి ఇతర వేదికపైనా
ఎక్స్‌పోర్ట్ చేయవచ్చు. డ్రాయింగ్‌లో ఏదైనా టెక్స్ట్ మేటర్‌ని
ఇన్‌సర్ట్ చేసేందుకు టూల్‌బార్‌లోని Text ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి.
వాడుతున్న సిస్టం లేదా ల్యాపీకి వెబ్ కెమెరా ఉంటే ఫొటోలు తీసుకుని
డ్రాయింగ్‌లో వాడుకోవచ్చు. కావాలంటే మెయిన్ మెనూలోకి వెళ్లి ప్రింట్ కూడా
తీసుకోవచ్చు. గీసిన అన్ని చిత్రాల్ని My Projects ఫోల్డర్ నుంచి
పొందొచ్చు. ఆప్ డౌన్‌లోడ్ కోసం http://goo.gl/CuUU3P లింక్‌ని చూడండి.
ఆడుతూ పాడుతూ...
ఇంట్లో పిల్లలు ఆడుతూ... పాడుతూ ఆంగ్లం నేర్చుకునేందుకు ఏవేవో సిస్టం సాఫ్ట్‌వేర్‌లు వెతకక్కర్లేదు. Action Story క్రోమ్ ఆప్‌ని ఇన్‌స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు. ఆట రూపంలో ఆప్‌ని రూపొందించారు. ఆటలో చెప్పినట్టుగా మౌస్‌తో క్లిక్ చేస్తూ ఇంగ్లిష్ వాక్యాల్ని నేర్చుకోవచ్చు. బాబు... పాప... ఓ కుక్కతో సంభాషణల్ని రాశారు. ఆకట్టుకునే యానిమేషన్ గ్రాఫిక్స్‌తో పిల్లల్ని ఆకట్టుకునేలా ఆప్‌ని తీర్చిదిద్దారు. కావాలంటే http://goo.gl/brK6dH లింక్‌ని చూడండి.
తీరిక లేకుంటే...
వెబ్
బ్రౌజింగ్‌లో ఏవేవో చూస్తుంటాం. కొన్ని చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి.
కానీ, పూర్తిగా చదివేందుకు అప్పుడు తీరికుండదు. అప్పుడు ఏం చేస్తారు?
ఏముందీ... బుక్‌మార్క్ చేస్తారు. ఎప్పుడైనా ఇలా బుక్‌మార్క్ పెట్టుకున్న
వాటిని తీరిగ్గా చదువుదాం అనుకుంటే నెట్‌కి కనెక్ట్ అవ్వాల్సిందే.
ఒక్కోటి బ్రౌజర్‌లో ఓపెన్ చేసి చూడాల్సిందే. ఇవేం లేకుండా ప్రత్యేక
క్రోమ్ ఆప్‌ని వాడుకుని ఆఫ్‌లైన్‌లో చదువుకుంటే?Read Later Fast ఆప్‌తో
సాధ్యమే. ఇన్‌స్టాల్ చేయగానే ఐకాన్ గుర్తు ఆప్ లాంచర్‌లోకి చేరిపోతుంది.
ఓపెన్ చేస్తే బ్రౌజర్‌లోనే కొత్త ట్యాబ్‌లో ఆప్ ఖాళీగా ఓపెన్ అవుతుంది.
ఇక మీ వెబ్ విహారంలో ఆసక్తిగా అనిపించిన వెబ్ పేజీని ఆప్‌లో పెట్టేందుకు
పేజీలో రైట్‌క్లిక్ చేయండి. డ్రాప్‌డౌన్ మెనూలో Read Later మెనూ
కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే చాలు. వెబ్ పేజీ ఆప్‌లో చేరిపోతుంది.
దానిపై క్లిక్ చేసి ఆప్‌లోనే హాయిగా చదువుకోవచ్చు. డౌన్‌లోడ్ కోసం http://goo.gl/b9OAdK లింక్‌లోకి వెళ్లండి.
ఈ-షాపింగ్ కోసం...
ఒకటా...
రెండా... బొల్డన్ని ఆన్‌లైన్ అంగళ్లు. ఏది కొనాలన్నా క్లిక్‌కొట్టి
కొనేస్తున్నారు. ఆఫర్లు, డిస్కౌంట్‌ల విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మరి, ఈ-షాపింగ్‌లో 'ఫ్లిప్‌కార్ట్' ఆన్‌లైన్ అంగడి గురించి తెలుసుగా?
దీంట్లోకి వెళ్లి ఆఫర్లు ఏమున్నాయో చూడాలంటే? సైట్‌లోకి వెళ్లాలి... ఆఫర్ల
జోన్‌లోకి వెళ్లాలి... బ్రౌజ్ చేసి చూడాలి. ఇంత కష్టం లేకుండా ఒకే
క్లిక్కుతో ఫిప్‌కార్ట్‌లో ఆఫర్లు ఏమున్నాయో తెలుసుకుంటే? అందుకు Flipkart
offers ఆప్‌ని నిక్షిప్తం చేసుకుంటే సరి. జాబితాలోని ఆప్‌పై క్లిక్
చేయగానే బ్రౌజర్‌లో ప్రత్యేక వెబ్ వేదికపై ఆఫర్ కూపన్లు అన్నీ వరుసగా
కనిపిస్తాయి. ఒక్కోటి బ్రౌజ్ చేసి చూడొచ్చు. అదే వేదిక నుంచి సరాసరి
ఫ్లిప్‌కార్ట్ అంగట్లోకి వెళ్లొచ్చు. ఆప్‌ని పొందేందుకు http://goo.gl/3o7y6B లింక్‌లోకి వెళ్లండి.
త్రీడీలో చూడొచ్చు
మీరు
రూపొందించినవో... ఇతరులు ఎవరైనా డిజైన్ చేసినవో... త్రీడీలో చూడాలంటే?
ఆన్‌లైన్ సర్వీసులతోనో... అదనపు సాఫ్ట్‌వేర్‌లతోనో పని లేదు. సింపుల్‌గా
3DView ఆప్‌ని నిక్షిప్తం చేసుకుంటే సరి.ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఆప్
లాంచర్‌లోకి వెళ్లి ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయగానే ఆప్ ఓపెన్ అవుతుంది.
అయితే, ఈ ఆప్‌ని రన్ చేయడానికి మరో క్రోమ్ ఎక్స్‌టెన్షన్ అవసరం. అదే
Click to open 3D . దీన్ని బ్రౌజర్‌కి జత చేసిన తర్వాత ఆప్‌ని వాడుకోవచ్చు.
త్రీడీ ప్రింటింగ్ ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఆప్‌ని
వాడుకుని ప్రింట్ తీయడానికి ముందే మోడళ్లను ఎక్స్‌ప్లోర్ చేసి చూడొచ్చు.
సిస్టం హార్డ్‌డ్రైవ్‌ల్లోని ఫైల్స్‌నే కాకుండా గూగుల్ డ్రైవ్‌లో ఉన్న
త్రీడీ ఫైల్స్‌ని కూడా యాక్సెస్ చేయవచ్చు. STL, OBJ, 3DS, PLY, CTM...
లాంటి మరిన్ని ఫార్మెట్‌లను ఆప్ సపోర్ట్ చేస్తుంది. ఆప్ కోసం http://goo. gl/95Ox4p లింక్‌ని చూడండి.
పీడీఎఫ్‌లకు ప్రత్యేకం
కంటికి రక్షణ
ఇలా భద్రం
ఏవైనా ప్లే అవుతాయి!
కుంచె పడతారా?
ఆడుతూ పాడుతూ...
ఇంట్లో పిల్లలు ఆడుతూ... పాడుతూ ఆంగ్లం నేర్చుకునేందుకు ఏవేవో సిస్టం సాఫ్ట్‌వేర్‌లు వెతకక్కర్లేదు. Action Story క్రోమ్ ఆప్‌ని ఇన్‌స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు. ఆట రూపంలో ఆప్‌ని రూపొందించారు. ఆటలో చెప్పినట్టుగా మౌస్‌తో క్లిక్ చేస్తూ ఇంగ్లిష్ వాక్యాల్ని నేర్చుకోవచ్చు. బాబు... పాప... ఓ కుక్కతో సంభాషణల్ని రాశారు. ఆకట్టుకునే యానిమేషన్ గ్రాఫిక్స్‌తో పిల్లల్ని ఆకట్టుకునేలా ఆప్‌ని తీర్చిదిద్దారు. కావాలంటే http://goo.gl/brK6dH లింక్‌ని చూడండి.
తీరిక లేకుంటే...
ఈ-షాపింగ్ కోసం...
త్రీడీలో చూడొచ్చు
BY
tanugula rakesh
thanugularakesh@gmail.com





0 comments:
Post a Comment