Feb 23, 2016

సైలెంట్‌ మోడ్‌లో ఉన్నా...
ముఖ్యమైన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఫోన్‌ని సైలెంట్‌ మోడ్‌లో పెట్టేశారు. ఆ విషయాన్ని మర్చిపోయి ఫోన్‌ని పని చేసే చోటే ఎక్కడో వదిలేశారు. స్నేహితుడి ఫోన్‌ నుంచి కాల్‌ చేస్తే సైలెంట్‌ మోడ్‌లో ఉండడం వల్ల రింగ్‌ వినిపించడం లేదు. అలాంటప్పుడు ఫోన్‌ ఎక్కడుందో తెలుసుకోవడం ఎలాగంటే... ‘ఆండ్రాయిడ్‌ డివైజ్‌ మేనేజర్‌’ సేవల్ని వాడుకుంటే సరి. ఫోన్‌ ఎక్కడుందో తెలుసుకోడమే కాదు. ఇతరులు వాడకుండా తాళం వేయవచ్చు. ముఖ్యమైన డేటా ఏదైనా ఉంటే ఇతరుల కంటపడకుండా చెరిపేయొచ్చు. కేవలం ఫోన్‌ని రింగ్‌ చేసి చూద్దాం అనుకుంటే వెబ్‌ బ్రౌజర్‌ని ఓపెన్‌ చేయండి. అడ్రస్‌బార్‌లో Find my phone కమాండ్‌ని టైప్‌ చేసి ఎంటర్‌ నొక్కండి. తర్వాత మీరు వాడుతున్న జీమెయిల్‌ ఎకౌంట్‌ వివరాలతో లాగిన్‌ అయితే... ఫోన్‌ మోడల్‌, ఉన్న లొకేషన్‌ వివరాలు వచ్చేస్తాయి. ఫోన్‌ని రింగ్‌ అయ్యేలా చేసి ఎక్కడుందో తెలుసుకునేందుకు Ring ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే చాలు. సైలెంట్‌ మోడ్‌లో ఉన్న ఫోన్‌ కూడా రింగ్‌ అవుతుంది. ఒకవేళ ఫోన్‌ని పోగొట్టుకుంటే https://www.google.com/android/devicemanager లింక్‌లోకి వెళ్లి మ్యాప్‌పై లొకేషన్‌ని చూడొచ్చు. ఫోన్‌ని Lock, Erase చేయవచ్చు కూడా.

BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

0 comments:

Post a Comment