బ్లాక్‌బెర్రీ, సింబియన్ ఫోన్లకు 'వాట్సప్' సపోర్ట్ నిలిపివేత...
అన్ని బ్లాక్‌బెర్రీ డివైస్‌లు, సింబియన్ 40, 60 ఆధారిత ఫోన్లు,
ఆండ్రాయిడ్ 2.1, 2.2 డివైస్‌లు, విండోస్ 7.1 డివైస్‌లకు వాట్సప్ తన
సపోర్ట్‌ను నిలిపివేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసింది.
ప్రస్తుతం వాట్సప్‌ను వాడుతున్న యూజర్లలో 99 శాతం మంది ఆండ్రాయిడ్
ఓఎస్‌ను, మిగిలిన వారు ఐఓఎస్, విండోస్ ఫోన్ 8 ఓఎస్‌లను కలిగి ఉన్నారు. ఈ
నేపథ్యంలో పాత తరం డివైస్‌లకు, ఓఎస్‌లకు సపోర్ట్‌ను నిలిపివేయక తప్పడం
లేదని వాట్సప్ ప్రతినిధులు పేర్కొంటున్నారు . ఒకవేళ ఇంకా అలాంటి డివైస్‌లను వాడుతున్నట్టయిత ే దయచేసి వాటిని తీసేసి కొత్త డివైస్‌లకు అప్‌గ్రేడ్ కావాలని వారు కోరుతున్నారు.
తమ యూజర్లకు మరింత నాణ్యమైన సేవలను సులభతరంగా అందజేయాలనే ఉద్దేశంతోనే ఈ
నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పాత విండోస్, సింబియన్ డివైస్‌లను పక్కన
పెడితే బ్లాక్‌బెర్రీ యూజర్లకు ఇది ఒకింత ఇబ్బంది కలిగించే విషయమని,
అయినప్పటికీ సపోర్ట్‌ను నిలిపివేయక తప్పడం లేదని వారు పేర్కొంటున్నారు .
source from internet
BY
tanugula rakesh
thanugularakesh@gmail.com
0 comments:
Post a Comment