Mar 21, 2016

gmail shortcuts


జీమెయిల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారా?  కీబోర్డ్ షార్ట్‌కట్స్  కావాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్ మీ కోసమే. దీంతో జీమెయిల్‌లో అందుబాటులో ఉన్న షార్ట్‌కట్స్ అన్నింటినీ ఒకేసారి స్క్రీన్‌పై తెలుసుకోవచ్చు.

Image result for gmailపీసీలో ఏదైనా ఇంటర్నెట్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి మీ జీమెయిల్ అకౌంట్‌లోకి లాగిన్ అవండి. అనంతరం మెయిల్ బాక్స్‌లో ఏదైనా ఖాళీ ప్రదేశంలో మౌస్‌తో లెఫ్ట్ క్లిక్ చేయండి. తరువాత కీబోర్డ్‌పై ఉండే Shift, ? (షిఫ్ట్ + ?) కీలను ఒకేసారి ప్రెస్ చేయండి. అంతే మీ కంప్యూటర్ స్క్రీన్‌పై జీమెయిల్‌లో వాడే షార్ట్‌కట్స్ అన్నీ ఒక లిస్ట్ రూపంలో కన్పిస్తుంది. వాటిలో మీకు కావల్సిన కీబోర్డ్ షార్ట్‌కట్‌ల గురించి వెంటనే తెలుసుకోవచ్చు. 

BY

tanugula rakesh

thanugularakesh@gmail.com

0 comments:

Post a Comment