Mar 21, 2016

firefox shortcuts

Image result for firefoxCtrl + T : మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో ఉన్నప్పుడు కీబోర్డ్‌పై ఈ బటన్‌లను ప్రెస్ చేస్తే కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది.

Ctrl + Shift + T : అనుకోకుండా ఏదైనా ట్యాబ్‌ను క్లోజ్ చేశారా? అయితే ఈ షార్ట్‌కట్‌ను ట్రై చేయండి. మీరు క్లోజ్ చేసిన ట్యాబ్ వెంటనే ఓపెన్ అవుతుంది.

F6 : ఫైర్‌ఫాక్స్ ట్యాబ్‌లో యూఆర్‌ఎల్ అడ్రస్‌బార్‌కు వెంటనే చేరుకోవాలా? అయితే F6 ను ప్రెస్ చేయండి. ఇది అడ్రస్ బార్‌ను పూర్తిగా సెలక్ట్ చేస్తుంది. దీంతో మీకు కావల్సిన వెబ్‌సైట్ అడ్రస్‌ను సులభంగా టైప్ చేయడమే కాదు, వేగంగా ఆ సైట్‌కు చేరుకునేందుకు అవకాశం ఉంటుంది.

Ctrl + F or / : Ctrl + F లేదా forward slash ( / ) ను ప్రెస్ చేస్తే వెబ్‌పేజీలో మీకు కావల్సిన పదాలను సులభంగా వెదకవచ్చు.

Ctrl + W : ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో మీరు యాక్టివ్‌గా ఉన్న ట్యాబ్‌ను మాత్రమే క్లోజ్ చేయాలంటే Ctrl + W ప్రెస్ చేస్తే సరిపోతుంది.

Ctrl + Tab or Ctrl + Shift + Tab : బ్రౌజర్‌లో ఓపెన్ అయి ఉన్న ట్యాబ్‌ల మధ్య సులువుగా వెళ్లాలంటే ఈ షార్ట్‌కట్ కీ ఉపయోగపడుతుంది.

Ctrl + D : ట్యాబ్‌లో మీరు యాక్టివ్‌గా ఉన్న వెబ్‌సైట్‌ను సులువుగా బుక్‌మార్క్ చేసుకునేందుకు ఈ షార్ట్‌కట్ కీ ఉపయోగపడుతుంది.

Ctrl + + , Ctrl + - , and Ctrl + 0 : వెబ్‌పేజీ ఫాంట్ సైజ్ పెంచుకోవాలంటే Ctrl + +, ఫాంట్ సైజ్‌ను తగ్గించుకోవాలంటే Ctrl + - ను ప్రెస్ చేయాలి. అదే డిఫాల్ట్ సైజ్ కావాలంటే Ctrl + 0 ను ప్రెస్ చేయాలి.

F11 : వెబ్‌పేజీలను ఫుల్ స్క్రీన్ మోడ్‌లో చూడవచ్చు. టూల్‌బార్స్, స్టేటస్ బార్స్ ఏవీ కనిపించవు.

Ctrl + J : డౌన్‌లోడ్ మేనేజర్ విండో ఓపెన్ అవుతుంది.

BY

tanugula rakesh

thanugularakesh@gmail.com

0 comments:

Post a Comment