Jan 29, 2016

చేయాల్సిన పనులో... ఫోన్ నెంబర్లో... ఏదైనా సమాచారాన్ని మర్చిపోకుండా చిన్న స్లిప్పై రాసి కనిపించేలా ఏ ఫ్రిడ్జ్పైనో అంటిస్తుంటాం. వాటినే కాస్త టెక్నాలజీ పరిభాషలో స్టిక్కీనోట్స్ అంటుంటాం. అలాంటి నోట్స్ని పీసీ డెస్క్టాప్పై పెట్టుకోవచ్చు.విండోస్ 7 ఓఎస్లో చిన్న చిట్కా ఉంది. పేరు 'స్టిక్కీనోట్స్'. ఓఎస్లో బిల్ట్గానే ఉండే బుల్లి సర్వీసు. స్టార్ట్ బటన్లోని రన్పైన క్లిక్ చేసి Sticky Notes అని టైప్ చేయండి. డీఫాల్ట్గా పసుపు రంగులో బాక్స్ వస్తుంది. దానిపై టెక్స్ట్ని టైప్ చేసి ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. బాక్స్పై కనిపించే ప్లస్ గుర్తుపై క్లిక్ చేసి కొత్త స్టిక్కీ నోట్స్ని బాక్స్ని పొందొచ్చు. బాక్స్పై రైట్క్లిక్ చేసి రంగుల్ని కూడా మార్చుకునే వీలుంది. సిక్కీబాక్స్లు అక్కర్లేదు అనుకుంటే క్లోజ్ గుర్తుపై క్లిక్ చేస్తే సరి.






BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

0 comments:

Post a Comment