Jan 29, 2016

తెరపై ఉన్న వాటిని స్క్రీన్‌షాట్‌ తీయడానికి ఎక్కువ శాతం కీబోర్డ్‌లోని 'ప్రింట్‌స్క్రీన్‌' బటన్‌ని వాడడం తెలిసిందే. కానీ, మీకు తెలుసా? మరింత క్రియేటివ్‌గా స్క్రీన్‌షాట్‌ తీసుకునేందుకు విండోస్‌ ఓఎస్‌లో Snipping Tool ఉందని? కావాలంటే స్టార్ట్‌పై నొక్కి రన్‌ బాక్స్‌లో టూల్‌ పేరుని టైప్‌ చేస్తే కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే చాలు బుల్లి విండోలో ఓపెన్‌ అవుతుంది. ఇక ఏదైనా స్క్రీన్‌షాట్‌ తీసుకోవాలి అనుకుంటే New ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. తెరపై కావాల్సిన మేర సెలెక్ట్‌ చేయాలి. దీంతో మీరు సెలెక్ట్‌ చేసింది స్క్రీన్‌షాట్‌లా మారి ప్రత్యేక విండోలో ఓపెన్‌ అవుతుంది. అక్కడ కావాలంటే మార్కర్‌తో స్క్రీన్‌షాట్‌పై రాసుకోవచ్చు. కావల్సిన మేరకు హైలైట్‌ చేయవచ్చు. తర్వాత వివిధ ఫార్మెట్‌ల్లో సేవ్‌ చేయవచ్చు. టూల్‌లోని New మెనూ పక్కన కనిపించే బాణం గుర్తుపై క్లిక్‌ చేసి స్క్రీన్‌షాట్‌ తీసుకుని స్టెల్‌ని (Free-form Snip, Rectangular Snip, Window Snip, Full Screen Snip) మార్చుకోవచ్చు.






BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

0 comments:

Post a Comment