Feb 1, 2016

ఇవి వాడితే టైప్‌ చేయక్కర్లేదు!
పుస్తకంలోని పాఠ్యాంశాన్నో... చదువుతున్న నవలలోని కొన్ని పేజీలనో...బ్రౌజింగ్‌లో ఇమేజ్‌ ఫార్మెట్‌లో తారసపడిన సమాచారాన్నో... టెక్ట్స్‌ ఫార్మెట్‌లోకి కాపీ చేసుకోవాలంటే? మొత్తం మేటర్‌ని టెక్ట్స్‌లోకి టైప్‌ చేయడం ఒక్కటే మార్గం కాదు! సులువైన పద్ధతులు చాలానే ఉన్నాయి! కావాలంటే ఇవి ప్రయత్నించండి!
స్కాన్‌ చేసిన డాక్యుమెంట్స్‌నో... పీడీఎఫ్‌ ఫార్మెట్‌ ఫైల్స్‌నో... ఎడిట్‌ చేసుకునేలా టెక్స్ట్‌ మార్చుకోవాల్సిన అవసరం చాలా సార్లు వస్తుంది. ఏమైనా టూల్స్‌ ఉంటే బాగుంటుందని చాలా సందర్భాల్లో అనుకుంటాం. వాటి కోసం వెతుకుతాం. మరి, వీటిని ఎప్పుడైనా ప్రయత్నించారా? ముందుగా Capture2Textటూల్‌ని ప్రయత్నిద్దాం. నెట్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. టూల్‌ని మొత్తం షార్ట్‌కట్‌ మీటల ద్వారానే వాడుకోవాలి. ఇన్‌స్టాల్‌ చేసి తెరపై వచ్చిన ఐకాన్‌ గుర్తుపై డబుల్‌ క్లిక్‌ చేయండి. దీంతో సిస్టం ట్రేలో ఐకాన్‌ గుర్తు కనిపిస్తుంది. ఇప్పుడు షార్ట్‌కట్‌ మీటల కోసం ట్రేలోని ఐకాన్‌ గుర్తుపై రైట్‌క్లిక్‌ చేసి Preferencesకమాండ్‌ని ఎంపిక చేసుకోండి. వచ్చిన విండోలో మొత్తం మీటలు ఉంటాయి. ఉదాహరణకు సిస్టంలోని ఏదైనా స్కాన్‌ కాపీని టెక్స్ట్‌ మేటర్‌గా మార్చుకోవాలనుకుంటే.. స్కాన్‌ కాపీని ఓపెన్‌ చేసి Windows key +Q నొక్కాలి. తర్వాత రైట్‌క్లిక్‌ చేసి కావాల్సిన మేటర్‌ని సెలెక్ట్‌ చేయాలి. అంటే... ప్రత్యేక పాప్‌అప్‌ విండోలో టెక్స్ట్‌ రూపంలో మేటర్‌ కన్వర్ట్‌ అయ్యి వస్తుంది. ఇక మేటర్‌ని కాపీ చేసుకుని ఎక్కడైనా ఎడిట్‌ చేసుకుని వాడుకోవచ్చు
* ఈ సాఫ్ట్‌వేర్‌లు, ఇన్‌స్టలేషన్స్‌, షార్ట్‌కట్‌లు... ఇవన్నీ మా వల్ల కాదు. మరేదైనా సులువైన మార్గం ఉంటే బాగుంటుంది! అని మీకు అనిపిస్తే www.onlineocr.net సైట్‌లోకి వెళ్లండి. ఇదో వెబ్‌ సర్వీసు. సైట్‌లోకి ఇమేజ్‌ ఫైల్‌ని అప్‌లోడ్‌ చేసి టెక్స్ట్‌ని పొందొచ్చు. అందుకు ముందుగా సైట్‌ హోం పేజీలోని Browse ద్వారా సిస్టంలోని ఫైల్‌ని ఎంపిక చేసుకోవాలి. Download Output file పై క్లిక్‌ చేసి కన్వర్ట్‌ చేసి ఫైల్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
* సాఫ్ట్‌వేర్‌ రూపంలో మరో టూల్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడుకోవాలనుకుంటే Free OCR to Word అప్లికేషన్ని ప్రయత్నించొచ్చు. స్కానర్‌ ద్వారా పని చేసేవారికి ఇది మరింత అనువైంది. ఏదైనా స్కాన్‌ చేయాలంటే టూల్‌బార్‌లోని Scanగుర్తుపై క్లిక్‌ చేయాలి. ఒకవేళ సిస్టంలోని ఇమేజ్‌ ఫైల్‌ ఫార్మెట్స్‌ని సెలెక్ట్‌ చేసుకునేందుకు Open ఉంది. ఫైల్‌ని సెలెక్ట్‌ చేసుకున్నాక OCRగుర్తుపై క్లిక్‌ చేస్తే చాలు టెక్స్ట్‌ మేటర్‌ కుడివైపు కనిపిస్తుంది. సేవ్‌ చేయాలనుకుంటే Save Text ఉంది.






BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

0 comments:

Post a Comment