Feb 1, 2016

విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ఏవేవో సందేహాలు. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో సందేహాల సంఖ్య మరింత పెరుగుతుంది. అందుకే మీకు వచ్చిన సందేహాన్ని తీర్చేందుకు ఓ మొబైల్‌ ఆప్‌ బీటా వెర్షన్‌లో సిద్ధంగా ఉంది. గూగుల్‌ ప్లే నుంచి DoubtNut ఆప్‌ని ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఆప్‌లో పోస్ట్‌ చేసిన ప్రశ్నలకు నిపుణులు ఒకటి లేదా రెండు రోజుల్లో సమాధానాన్ని పోస్ట్‌ చేస్తారు. ప్రస్తుతానికి ఆప్‌లో ఐదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ప్రశ్నల్ని స్వీకరించి సమాధానాల్ని అందిస్తున్నారు.
ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేశాక మెయిల్‌ ఐడీ వివరాలతో రిజిస్టర్‌ అవ్వాలి. ఆప్‌ హోం పేజీలోని Select Chapter Name బాక్స్‌లో ప్రశ్న తాలూకు పాఠ్యాంశాన్ని సెలెక్ట్‌ చేయాలి. తర్వాతి బాక్స్‌లో ప్రశ్నని టైప్‌ చేసి Submit Question సెలెక్ట్‌ చేయాలి. ఒకవేళ ఫొటో రూపంలో పంపాల్సివస్తే కెమెరా గుర్తుతో కనిపించే బటన్‌ని సెలెక్ట్‌ చేయాలి. అడిగిన మొత్తం ప్రశ్నల జాబితాని చూసేందుకు ఆప్‌ హోం మెనూలోని My Previous Doubts ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయాలి.



BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

0 comments:

Post a Comment