Jan 29, 2016

చదువులో గణిత శాస్త్రానికి ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. జేబులోని స్మార్ట్‌ మొబైల్‌ కూడా అందుకు బాసటగా నిలుస్తోంది. ఉదాహరణకు Sin 53 విలువ ఎంతో తెలుసుకోవాలంటే? పెన్నుతో నోట్‌ బుక్‌లో రాసినట్టుగానే... తాకే తెరపైన రాస్తే చాలు. వెంటనే ఫలితం కనిపిస్తుంది. ఇదెలా సాధ్యం అంటారా? అయితే, My Script Calculator ఆప్‌ని ప్రయత్నించండి. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా పొందొచ్చు. కూడికలు, తీసివేతలు లాంటి బేసిక్‌ ఆపరేషన్స్‌ని మాత్రమే కాకుండా త్రికోణమితి, Inverse Trigonometry, Logarithms, Constants... లెక్కల్ని పరిష్కరిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదో 'హ్యాండ్‌ రైటింగ్‌ కాలిక్యులేటర్‌' అన్నమాట. అన్నింటినీ నోట్‌బుక్‌పై రాసినట్టుగానే తెరపై రాస్తే సరి. స్త్టెలస్‌ కావాలేమో? అనే సందేహం అక్కర్లేదు. స్మార్ట్‌ మొబైల్‌పై వేళ్లతో రాసేయవచ్చు.
*


BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

0 comments:

Post a Comment