Feb 1, 2016

ఎన్నో రకాల ఫైల్స్‌... ఇంటర్నల్‌... ఎక్స్‌టర్నల్‌ మెమొరీ లొకేషన్లు... ఫోన్‌, ట్యాబ్‌, ల్యాపీ, పీసీ, యూఎస్‌బీ డ్రైవ్‌లు... మైక్రోఎస్‌డీ కార్డులు... డేటాని భద్రం చేస్తుంటారు. తొలగిస్తుంటారు.
ఎప్పుడైనా తొలగించిన ఫైల్స్‌ని తిరిగి పొందాలంటే? Disk Drill రికవరీ టూల్‌ని వాడి తిరిగి పొందొచ్చు. టూల్‌ని రన్‌ చేసి ముందు Quick Scan చేయవచ్చు. మరింత క్షుణ్ణంగా డిలీట్‌ చేసిన ఫైల్స్‌ని పొందేందుకు DeepScan చేయవచ్చు. స్కానింగ్‌ అయ్యేంత వరకూ వేచి చూడాల్సిన పని లేదు. ప్రక్రియ జరుగుతుండగానే స్కాన్‌ ఫలితాల్లో ఫైల్స్‌ని ఓపెన్‌ చేసి చూడొచ్చు. రికవర్‌ చేయవచ్చు. అంతేకాదు... ఈ టూల్‌తో డిలీట్‌ చేసిన ఫైల్స్‌ అన్నీ ప్రత్యేక ఫోల్డర్‌లో (Vault) సేవ్‌ అయ్యేలా చేయవచ్చు. దీంతో ఎప్పుడైనా ఏదైనా ఫైల్‌ని రికవర్‌ చేయడం సులభం అవుతుంది. టూల్‌ని ప్రయత్నిద్దాం అనుకుంటే  చూడండి


BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

0 comments:

Post a Comment