Feb 5, 2016

ఆప్‌తో రాయొచ్చు!
తాకేతెరపై స్త్టెలస్‌తో రాయడం తెలుసు... వేలితో ఎప్పుడైనా రాశారా? అలా రాసింది డిజిటల్‌ టెక్స్ట్‌లా మారితే! అదెలా సాధ్యం అంటారా? అయితే, గూగుల్‌ అందించే ఆప్‌ ఉండాల్సిందే. అందుకు Google Handwriting Input ఆప్‌ అందుబాటులోకి వచ్చింది. రన్‌ చేసిన తర్వాత తెరపై వచ్చే ఆప్షన్స్‌ని ఒక్కొక్కటిగా ఎనేబుల్‌ చేస్తూ వెళ్లొచ్చు. ముందుగా Enabel Google Handwriting Input ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయాలి. దీంతో సెట్టింగ్స్‌ ఓపెన్‌ అవుతాయి. అక్కడ కనిపించే 'గూగుల్‌ హ్యాండ్‌ రైటింగ్‌ ఇన్‌పుట్‌'ని ఎనేబుల్‌ చేయాలి. అవసరమైన యాడ్‌ఆన్‌ ఆప్స్‌ని ఇన్‌స్టాల్‌ చేయాల్సి ఉంటుంది. తర్వాత Choose input method ద్వారా ఇంగ్లిష్‌ భాషని సెలెక్ట్‌ చేయాలి. మొత్తం ప్రక్రియ ముగిశాక అక్కడే వేలితో రాసి సరి చూసుకోవచ్చు. ఇక మీరు ఏది టైప్‌ చేయాలన్నా రాయడమే. ఉదాహరణకు వాట్సప్‌ ఓపెన్‌ చేసి టైప్‌ బాక్స్‌లోకి వెళ్తే అక్కడ ఖాళీగా టైప్‌బోర్డ్‌ వస్తుంది. దానిపై మీరు పంపాలనుకునే మెసేజ్‌ని టైప్‌ చేయడమే. అక్షరం, పదం వేలితో రాయడం ముగియగానే డిజిటల్‌ టెక్స్ట్‌ టైప్‌ బాక్స్‌లో వచ్చేస్తుంది. ఇంకా ఫోన్‌లోని కాంటాక్ట్‌లను రాస్తూనే వెతకొచ్చు. ఎక్కడ టెక్స్ట్‌ ఇన్‌పుట్‌ ఇవ్వాలన్నా ఇక రాయడమే. అంతేకాదు... బోర్డ్‌ పై భాగంలో రాసిన రాతని సరిపడే పదాల్ని జాబితాగా సూచిస్తుంది. సెలెక్ట్‌ చేస్తే రాసిన మేటర్‌లోకి పదం చేరిపోతుంది. టెక్స్ట్‌ ఒక్కటే కాదు. ఎమోటికాన్స్‌ని కూడా గీయవచ్చు. వేలితో రాసి బోర్‌ కొట్టినా... కష్టంగా అనిపించినా ఇన్‌పుట్‌ విధానాన్ని తిరిగి కీబోర్డ్‌లోకి మార్చేయవచ్చు. అందుకు రైటింగ్‌ బోర్డ్‌ కింద కనిపించే గ్లోబ్‌ గుర్తుపై తాకితే చాలు. English Android Keyboard ఆప్షన్‌తో తిరిగి ఆండ్రాయిడ్‌ కీబోర్డ్‌ని ఇన్‌పుట్‌గా పొందొచ్చు. ఆండ్రాయిడ్‌ 4.0.3 వెర్షన్‌ లేదా ఆపై లేటెస్ట్‌ వెర్షన్స్‌తో కూడిన మొబైళ్లు, ట్యాబ్లెట్‌ల్లో ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసి వాడుకోవచ్చు.

BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

0 comments:

Post a Comment