Feb 5, 2016

ఇలా ట్యాబ్‌లోనే!
బోర్‌ అనిపిస్తే చాలు. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుంటాం. ఛానల్స్‌ క్రియేట్‌ చేసుకుంటాం. కొత్త ఛానల్స్‌ బ్రౌజ్‌ చేసి సభ్యత్వం తీసుకుంటాం. ఏది చేసినా అధికారిక యూట్యూబ్‌ వేదికపైనే. కానీ, మీరు వాడుతున్న బ్రౌజర్‌లోని ట్యాబ్‌ విండోని యూట్యూబ్‌ వీడియోల ప్లేయర్‌గా మార్చేస్తే! అదెలా సాధ్యం అంటారా? మీరు క్రోమ్‌ బ్రౌజర్‌ వాడుతున్నట్లయితే ఓ చిట్కా ఉంది. అదే myTab online. క్రోమ్‌ అందించే వెబ్‌ స్టోర్‌లోకి వెళ్లి బ్రౌజర్‌కి ఆప్‌ రూపంలో జత చేయవచ్చు. ఇక ఎప్పుడు యూట్యూబ్‌ వీడియోలు చూడాలనుకున్నా ఆప్‌పై క్లిక్‌ చేస్తే కొత్త ట్యాబ్‌లో సర్వీసు ఓపెన్‌ అవుతుంది. డీఫాల్ట్‌గా కొన్ని వీడియోలు థంబ్‌నెయిల్‌ బాక్సుల్లో కనిపిస్తాయి. చూడాలనుకుంటే క్లిక్‌ చేయండి చాలు. ఒకవేళ మీరు చూడాలనుకునే వీడియోలను వెతకాలనుకుంటే సెర్చ్‌బాక్స్‌ ఉంది. మీరు చూడాలనుకునే ఆల్బమ్‌ పేరుని ఎంటర్‌ చేసి సెర్చ్‌ కొడితే చాలు. వరుసగా ఆల్బమ్‌లోని వీడియోలు వచ్చేస్తాయి. క్లిక్‌ చేసి ఒక్కోటి చూడొచ్చు. హై డిఫినెషన్‌లో వీడియోలు ప్లే అవుతాయి. ఆడియో మాత్రమే విందాం అనుకుంటే వీడియోను మినిమైజ్‌ చేసుకునే వీలుంది. అందుకు వీడియో పైభాగంలోని మైనస్‌ గుర్తుపై క్లిక్‌ చేయాలి. వాల్యూమ్‌ బార్‌ వీడియో ప్లేయర్‌కి ఎడమవైపు చూడొచ్చు. ఆప్‌ సెట్టింగ్స్‌ని కావాల్సినట్టుగా మార్పులు చేయవచ్చు. ప్రయత్నిద్దాం


BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

0 comments:

Post a Comment