
ప్రశాంతంగా
కూర్చుని పజిల్ గేమ్‌లు ఆడితే ఆ కిక్కే వేరు! ఏమంటారు? కావాలంటే Roll the
Ball పజిల్ గేమ్ ఆడేయండి. చాలా సులువైన ఇంటర్ఫేస్‌తో గేమ్‌ని
రూపొందించారు. ఆటని ఇన్‌స్టాల్ చేసి రన్ చేస్తే Beginner, Medium, Hard,
Advanced, Extreme Pack బటన్లతో లెవల్స్ ఓపెన్ అవుతాయి. ఒక్కో దాంట్లో 60
లెవల్స్ ఉన్నాయి. ఇక ఆటలో ఏం చేయాలంటే... బ్లాకుల మధ్యలో ఉన్న బంతికి
తోవని క్రియేట్ చేసి గమ్య స్థానానికి చేరేలా చేయాలి. బ్లాకుల్ని వాడుకుని
బంతికి తోవని క్రియేట్ చేయడమే puzzle. సులువైన లెవల్స్‌లో
'టైం లిమిట్' ఉండదు. లెవల్స్ మారుతున్న కొద్దీ బంతి నిర్ణీత సమయానికి
కదలడం ప్రారంభమవుతుంది. ఇంతలోపే తికమకగా ఉన్న తోవని సరిగా సెట్ చేయాలి.ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్
ప్లే నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
BY
tanugula rakesh
thanugularakesh@gmail.com
0 comments:
Post a Comment