ఇంట్లో నుంచి బయటికి వచ్చాక ఎప్పుడు ఏం జరుగుతుందో వూహించలేం. రోడ్డుపై
ఎన్నో ప్రమాదాలు... చూస్తుంటాం... వెంటనే స్పదించి సాయం చేస్తుంటాం. ఈ
నేపథ్యంలో ప్రమాదంలో గాయపడిన వారి కుంటుంబానికి సమాచారాన్ని అందించేందుకు
బాదితుల ఫోన్‌ని యాక్సెస్ చేయడానికి చూస్తాం. కానీ, ఇప్పుడు అన్నీ
స్మార్ట్ మొబైళ్లు కావడంతో వాటిని ఇతరులు ఆన్‌లాక్ చేయడం అసాధ్యం. ఇలాంటి
సందర్భాల్లో ఫోన్ లాక్ స్క్రీన్‌పైనే కాంటాక్ట్ వివరాలు డిస్‌ప్లే
అయ్యేలా చేయవచ్చు తెలుసా? అదెలాగంటే... ఫోన్ సెట్టింగ్స్‌లోని
‘సెక్యూరిటీ’ విభాగంలోకి వెళ్లండి. అక్కడ కనిపించే Ower Info ఆప్షన్‌ని
సెలెక్ట్ చేసి కాంటాక్ట్ వివరాల్ని ఎంటర్ చేయండి. ఇలా పెట్టుకున్న
సమాచారాన్ని లాక్ స్క్రీన్‌పై కనిపించాలంటే Show owner info on lock
screen ఆప్షన్‌ని చెక్ చేయండి. ఇక ఫోన్ లాక్ స్క్రీన్‌పై కాంటాక్ట్
సమాచారం నిత్యం కనిపిస్తుంది. దీంతో మీ ఫోన్ ఎక్కడైనా మరిచిపోయినా...
దొరికిన వ్యక్తి వెంటనే మీరు పెట్టుకున్న కాంటాక్ట్‌కి ఫోన్ చేసే అవకాశం
ఉంటుంది.
0 comments:
Post a Comment