Apr 22, 2016

కొన్ని వెబ్‌ సైట్‌లను బ్రౌజ్‌ చేసేప్పుడు మౌస్‌ రైట్‌క్లిక్‌ పని చేయకపోవడం ఎప్పుడైనా గమనించారా? ఉదాహరణకు బ్రౌజ్‌ చేస్తున్న వెబ్‌సైట్‌లోని టెక్స్ట్‌ని సెలెక్ట్‌ చేసి కాపీ చేయడానికి ప్రయత్నిస్తే రైట్‌క్లిక్‌ పని చేయదు. ఇలాంటి సందర్భాల్లో రైట్‌క్లిక్‌ని ఎనేబుల్‌ చేయవచ్చు. క్రోమ్‌ బ్రౌజర్‌ని వాడుతున్నట్లయితే మెయిన్‌ మెనూలోకి వెళ్లి 'సెట్టింగ్స్‌'పై క్లిక్‌ చేయండి. వచ్చిన పేజీలో తిరిగి Advanced Settings పై క్లిక్‌ చేసి Content Settings ఆప్షన్ని సెలెక్ట్‌ చేయాలి. తర్వాత జావాస్క్రిప్ట్‌ విభాగంలోకి వెళ్లి Do not allow any site to run javascript ఆప్షన్ని చెక్‌ చేయాలి. తిరిగి బ్రౌజర్‌ని రీస్టార్ట్‌ చేయండి.
* ఫైర్‌ఫాక్స్‌ వాడుతున్నట్లయితే Optionsలోకి వెళ్లి Content ఆప్షన్ని సెలెక్ట్‌ చేయండి. వచ్చిన మెనూల్లోని JavaScript ఎనేబుల్‌ చేయాలి.

0 comments:

Post a Comment