Apr 22, 2016

మీ సిస్టం ఐపీ అడ్రస్‌ తెలుసుకోవాలంటే? అదేం క్లిష్టమైన ప్రక్రియేం కాదు. చాలా సులభంగా తెలుసుకోవచ్చు. మీకు ఇంటర్నల్‌ ఐపీ అడ్రస్‌ కావాలంటే స్టార్ట్‌లోకి వెళ్లి RUN ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేసి CMD టైప్‌ చేసి కమాండ్‌ని రన్‌ చేయండి. వచ్చిన డాస్‌ కమాండ్‌ ప్రాంప్ట్‌ దగ్గర ipconfig అని టైప్‌ చేయాలి. దీంతో జాబితాగా మొత్తం వివరాలు కనిపిస్తాయి.
* ఇక సిస్టం ఎక్స్‌టర్నల్‌ ఐపీ అడ్రస్‌ని తెలుసుకోవాలంటే? ప్రత్యేక వెబ్‌ సర్వీసుతో చిటికెలో సాధ్యం. కావాలంటే www.getip.com సైట్‌లోకి వెళ్లండి. మీరు ఉన్న లొకేషన్ని అదనపు సమాచారంగా పొందొచ్చు.

0 comments:

Post a Comment