అరచేతిలో అమరి
పోయేలా, సరికొత్తగా ఒక మౌస్ వచ్చింది. ఇది కేవలం మౌస్ మాత్రమే అనుకుంటే
పొరపాటు. ఇది సాధారణ మౌస్ కి ఎక్కువ, పూర్తి స్థాయి కంప్యూటర్ కి కొంచెం
తక్కువ. కంప్యూటర్ ద్వారా జరిగే సగం పనులను చక చకా చేయగల ఈ కొత్త మౌస్
పేరు The Mouse Box అన్నమాట. ఇందులోనే ప్రాసెసర్, ర్యామ్, 128 జీబీ
స్టోరింగ్ కెపాసిటి అన్నీ ఉంటాయి. అంటే ఒక సీపీయూ చేయగల పనులన్నీ ఇది కూడా
చేయగలుగుతుంది. అయితే యూఎస్‌బీ పోర్ట్‌తోగాని, వైఫై ద్వారాగానీ దీనిని
ప్రొజెక్టర్‌కి కనెక్ట్ చేయాల్సి వుంటుంది. ఇదంతా అరచేతి పరిమాణంలో
అమరిపోయే ఈ మౌస్ ద్వారానే సాధ్యం.
0 comments:
Post a Comment