ప్రపంచంలోనే అతి సన్నని, నాజూకైన ల్యాప్‌టాప్‌ను హెచ్‌పీ సంస్థ తయారుచేసింది. కేవలం 10.4 మిల్లీమీటర్ల మందం, 13.3
అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఈ ల్యాప్‌టాప్ ప్రపంచంలోనే అత్యంత సన్నదైన
ల్యాప్ టాప్ ను 'స్పెక్టర్' పేరుతో మార్కెట్ లోకి వదలనుంది. ఏప్రిల్ 25న ప్రీ ఆర్డర్స్ ప్రారంభమవనున్నాయని సమాచారం. ఇంటెల్ ఐ5, ఐ7 ప్రాసెసర్, బ్యాక్‌లిట్ కీబోర్డు, గ్లాస్ ట్రాక్‌ప్యాడ్, డ్యుయల్ స్పీకర్స్, గొరిల్లా గ్లాస్ డిస్‌ప్లే తదితర ఫీచర్లు కలిగిన ఈ ల్యాప్‌టాప్ ధర 1,169
అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు. హెచ్‌పీ స్పెక్టర్ పేరుతో ఉన్న ఈ
ల్యాప్‌టాప్‌ను న్యూయార్క్ టైమ్స్ ఇంటర్నేషనల్ లగ్జరీ కాన్ఫరెన్స్ లో
ఆవిష్కరించారు.
0 comments:
Post a Comment