Jun 7, 2016

Swipedge Edge

భిన్నమైన లాంచర్‌లు వాడుతూ ఆప్స్‌ని యాక్సెస్‌ చేసుంటారు. కానీ, తెరపై ఒక ఆప్‌ ఓపెన్‌ చేసి ఉండగానే మీకు అవసరమైన మరో ఆప్‌ని ఓపెన్‌ చేయగలిగారా? ఇలా మల్టిపుల్‌ ఆప్స్‌ని ఓపెన్‌ చేయడం ఎలా అనేగా సందేహం! అయితే, మీరు Swipedge Edge ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందే. బీటా వెర్షన్‌లో దీన్ని అందిస్తున్నారు. ఇన్‌స్టాల్‌ చేయగానే ఫోన్‌కి కుడివైపు ప్రత్యేక సైడ్‌బార్‌ కనిపిస్తుంది. దాంట్లోని మధ్య భాగంలో కనిపించే ‘ఆప్‌ డ్రాయర్‌’లో ఎక్కువగా వాడే ఆప్స్‌ని జాబితాగా పెట్టుకోవాలి. ఇంకేముందీ... ఎడమవైపుకు స్వైప్‌ చేస్తే మూడు విభాగాలుగా పొడుచుకొస్తుంది. ఇక మీదట ఏదైనా ఆప్‌ని ఓపెన్‌ చేసి చూస్తూనే... అవసరం మేరకు మరో ఆప్‌ని చిటికెలో ఓపెన్‌ చేయవచ్చు. సైడ్‌బార్‌ని స్వైప్‌ చేసి మధ్యలోని ‘ఆప్‌ డ్రాయిర్‌’ నుంచి కావాల్సిన ఆప్‌ని తాకితే చాలు. ఓపెన్‌ అవుతుంది. ఇలా ఆప్‌ డ్రాయిర్‌లో ఉన్న అన్ని ఆప్స్‌ని ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్‌ చేయవచ్చు. ఫోన్‌ బ్యాక్‌ బటన్‌ని నొక్కుతూ ఒక్కో దాంట్లోంచి బయటికి రావచ్చు కూడా. అంతేకాదు... ఈ సైడ్‌బార్‌లో మ్యూజిక్‌ వాల్యూమ్‌ని కంట్రోల్‌ చేయవచ్చు. ఫోన్‌ని కూడా దీన్నుంచే తాళం వేసే వెసులుబాటు ఉంది. కావాల్సినట్టుగా సైడ్‌బార్‌ థీమ్‌ని మార్చుకోవచ్చు.

0 comments:

Post a Comment