Jun 7, 2016

ఫేస్‌బుక్‌ నుంచి నోటిఫికేషన్‌ అప్‌డేట్స్‌ వచ్చినట్టుగానే వాట్స్‌ఆప్‌ నుంచి కూడా కొన్ని అప్‌డేట్స్‌కి మెయిల్‌కి పంపుతున్నారట. వాట్స్‌ఆప్‌ కంపెనీనే పంపింది అనుకుని ఆయా మెసేజ్‌ లింక్‌లపై క్లిక్‌ చేస్తే అంతే సంగతులట. సెక్యూరిటీ సంస్థ ‘కొమోడో ల్యాబ్స్‌’ ఈ రకమైన ఎటాక్స్‌ని విశ్లేషించి చెబుతోంది. ఇదో ప్రత్యేక ‘ఫిషింగ్‌ స్క్రీమ్‌’గా సంస్థ నిర్వచిస్తోంది. ఆసక్తికరమైన మెసేజ్‌లు, వాయిస్‌ రికార్డింగ్‌ నోటిఫికేషన్‌ లింక్‌లను వాట్స్‌ఆప్‌ పంపినట్టుగానే హ్యాకర్లు మెయిల్‌ చేస్తారు. నిజమని నమ్మేలా వాట్స్‌ఆప్‌ లోగోని కూడా జత చేస్తారు. ఇంకేముందీ... ఆయా లింక్‌లపై క్లిక్‌ చేస్తే సరాసరి మీరు హ్యాకర్ల చేతికి చిక్కినట్టే. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే... వాట్స్‌ఆప్‌ ఎకౌంట్‌ ఎప్పుడూ ఫోన్‌ నెంబర్‌తోనే ముడిపడి పని చేస్తుంది. ఎందుకంటే మీరు వాట్స్‌ఆప్‌ని వాడేందుకు ఫోన్‌ నెంబర్‌తోనే రిజిస్టర్‌ అవుతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏదైనా అప్‌డేట్‌ కంపెనీ మీకు పంపాల్సివస్తే ఫోన్‌ నెంబర్‌కి పంపుతుందేగానీ... మెయిల్‌కి కాదు. అందుకే మెయిల్‌కి చేరిన ఈ తరహా మెయిల్స్‌ని స్పాం అని గుర్తించి వాటిపై క్లిక్‌ చేయకుండా వెంటనే తొలగించండి.

0 comments:

Post a Comment