వ్యక్తిగతంగా స్నేహితులతోనో... గ్రూపు సభ్యులతోనో మీరు చేసిన టెక్స్ట్
మెసేజింగ్ ఆటోమాటిక్‌గా నిర్ణీత సమయం తర్వాత డిలీట్ అవ్వడం మీకు తెలుసా?
wickr ఆప్‌లో ఆ సౌకర్యం ఉంది. దీన్నే Self-distructing message ఆప్‌గా
పిలుస్తున్నారు. వాల్‌పై మెసెజ్‌ని పోస్ట్ చేయడానికి ముందే ఎంత సమయం
తర్వాత అవి డిలీట్ అవ్వాలనేది ముందే నిర్ణయించొచ్చు. ఉదాహరణకు పోస్ట్
చేసిన వెంటనే కొన్ని సెకన్ల వ్యవధిలో మాయం అయ్యేలా చేయవచ్చు. ఐదు రోజుల
వరకూ టెక్స్ట్ వాల్‌పై ఉండేలా కూడా చేయవచ్చు. నిర్ణీత సమయం కాగానే అవతలి
వ్యక్తి ఫోన్ నుంచి మెసేజ్‌లు మొత్తం డిలీట్ అవుతాయి. టెక్స్ట్ మాత్రమే
కాదు. వాల్‌పై ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేయవచ్చు. ఆప్‌ని ఇన్‌స్టాల్
చేశాక యూజర్‌నేమ్ పాస్‌వర్డ్‌తో ఎకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత
వాడుతున్న ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ ద్వారా స్నేహితులకు వ్యక్తిగతంగా
ఆహ్వానాలు పంపొచ్చు. ఒకవేళ అప్పటికే ఎవరైనా స్నేహితులు ఆప్‌ని
వాడుతున్నట్లయితే స్నేహితుల కాంటాక్ట్ లిస్ట్ వచ్చేస్తుంది.
వాట్స్‌ఆప్‌లో మాదిరిగానే కాంటాక్ట్‌లను వెతుక్కుని ఛాట్ చేయవచ్చు.
టెక్స్ట్ టైప్ చేసి డైలాగ్ బాక్స్‌లో మీరు పెట్టుకున్న
Self-distructing time డీఫాల్ట్‌గా కనిపిస్తుంది. ఛాట్‌లో వీడియోలు,
ఇమేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లను పోస్ట్ చేసేందుకు డైలాగ్ బాక్స్ పక్కన
కనిపించే ఐకాన్ గుర్తుపై తాకితే చాలు. కొత్త మెసేజ్‌లను పంపే ముందు 'లాక్
ఐకాన్' సెలెక్ట్ చేసి Self distruct timer సెట్ చేయవచ్చు. దీంతో
మెసేజ్ పక్కనే లైవ్‌లో కౌంట్‌డౌన్ కనిపిస్తూనే ఉంటుంది. దీంతో మీరు
పోస్ట్ చేసిన మెసేజ్ ఎప్పుడు మాయం అవుతుందనేది కూడా తెలుస్తుంది.
మెసేజ్‌లతో పాటు డేట్, సమయం, లొకేషన్, డివైజ్ ఇన్ఫర్మేషన్... మొత్తం
తొలగిపోతాయి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి Default Destruction సెట్ చేసుకోవడం
ద్వారా ఎప్పుడూ ఒకే సమయానికి వాల్‌పై పోస్ట్ చేసిన మెసేజ్‌లను పోయేలా
చేయవచ్చు. క్లౌడ్ సర్వీసుల్లోని ఫైల్స్‌ని కూడా ఎంపిక చేసుకుని వాల్‌పై
షేర్ చేయవచ్చు. బాక్స్, డ్రాప్‌బాక్స్, గూగుల్ డ్రైవ్... సర్వీసుల్ని
సపోర్ట్ చేస్తుంది. ఇక డేటా సెక్యూరిటీ విషయానికొస్తే ఆప్‌కి 4,096-bit
RSA encryption ఉంది. అంతేకాదు... ఫోటోలను షేర్ చేయడానికి ముందు
ఆకట్టుకునేలా ఎడిట్ చేసే వీలుంది. పది మంది సభ్యులతో గ్రూపు క్రియేట్
చేసుకోవచ్చు. Shredder ఆప్షన్‌తో డిలీట్ చేసిన ఫైల్స్ మూలాల్ని శాశ్వతంగా
డిలీట్ చేయవచ్చు. బుల్లి తెరపైనే కాదు. డెస్క్‌టాప్‌పైనా ఇన్‌స్టాల్
చేసుకుని సిస్టం నుంచే మెసేజింగ్ చేయవచ్చు. విండోస్, లినక్స్
డెస్క్‌టాప్ ఓఎస్‌లను సపోర్ట్ చేస్తుంది.
0 comments:
Post a Comment