welcome to my blog

నా బ్లాగ్ ని visit చేసినందుకు ధన్యవాదాలు.మీకు కావాల్సిన ఆండ్రాయిడ్ apps మరియు latest pctips ని మీరు ఇక్కడ నా బ్లాగ్ లో తెలుసుకోవచ్చు.

hai

follow me on twitter https://twitter.com/rakeshtanugula.

రాకేష్ తనుగుల

contact me:thanugularakesh@gmail.com

hello this is my technical blog

you can view technlology updates and new android apps details in my blog as i know

facebook page

like my facebook page:https://www.facebook.com/pctipsrs/

Don't forgot to share my blog

If you like my blog.Don't forgot to share my blog Thank's you. from రాకేష్ తనుగుల

Jan 29, 2016

చదువులో గణిత శాస్త్రానికి ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. జేబులోని స్మార్ట్‌ మొబైల్‌ కూడా అందుకు బాసటగా నిలుస్తోంది. ఉదాహరణకు Sin 53 విలువ ఎంతో తెలుసుకోవాలంటే? పెన్నుతో నోట్‌ బుక్‌లో రాసినట్టుగానే... తాకే తెరపైన రాస్తే చాలు. వెంటనే ఫలితం కనిపిస్తుంది. ఇదెలా సాధ్యం అంటారా? అయితే, My Script Calculator ఆప్‌ని ప్రయత్నించండి. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా పొందొచ్చు. కూడికలు, తీసివేతలు లాంటి బేసిక్‌ ఆపరేషన్స్‌ని మాత్రమే కాకుండా త్రికోణమితి, Inverse Trigonometry, Logarithms, Constants... లెక్కల్ని పరిష్కరిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదో 'హ్యాండ్‌ రైటింగ్‌ కాలిక్యులేటర్‌' అన్నమాట. అన్నింటినీ నోట్‌బుక్‌పై రాసినట్టుగానే తెరపై రాస్తే సరి. స్త్టెలస్‌ కావాలేమో? అనే సందేహం అక్కర్లేదు. స్మార్ట్‌ మొబైల్‌పై వేళ్లతో రాసేయవచ్చు.
*


BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

పెళ్లి రోజు శుభాకాంక్షలో... ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ ఫైలో... విషయం ఏదైనా మర్చిపోకుండా ముందే ఈమెయిల్‌ చేసేస్తే! ఆ మెయిల్‌ ఎంపిక చేసుకున్న తేదీ, సమయాలకే ఇతరులకు చేరే వీలుంటే? అదేలా సాధ్యమో తెలియాలంటే 'రైట్‌ఇన్‌బాక్స్‌'ని వాడుతున్న బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిందే. ఫైర్‌ఫాక్స్‌, క్రోమ్‌, సఫారి బ్రౌజర్లు వాడుతున్నట్లయితే Install Now పై క్లిక్‌ చేయండి. యాడ్‌ఆన్‌, ఎక్స్‌టెన్షన్‌ మాదిరిగా పని చేస్తుంది. కావాలంటే సైట్‌లోకి వెళ్లండి. www.rightinbox.com







BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

తెరపై ఉన్న వాటిని స్క్రీన్‌షాట్‌ తీయడానికి ఎక్కువ శాతం కీబోర్డ్‌లోని 'ప్రింట్‌స్క్రీన్‌' బటన్‌ని వాడడం తెలిసిందే. కానీ, మీకు తెలుసా? మరింత క్రియేటివ్‌గా స్క్రీన్‌షాట్‌ తీసుకునేందుకు విండోస్‌ ఓఎస్‌లో Snipping Tool ఉందని? కావాలంటే స్టార్ట్‌పై నొక్కి రన్‌ బాక్స్‌లో టూల్‌ పేరుని టైప్‌ చేస్తే కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే చాలు బుల్లి విండోలో ఓపెన్‌ అవుతుంది. ఇక ఏదైనా స్క్రీన్‌షాట్‌ తీసుకోవాలి అనుకుంటే New ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. తెరపై కావాల్సిన మేర సెలెక్ట్‌ చేయాలి. దీంతో మీరు సెలెక్ట్‌ చేసింది స్క్రీన్‌షాట్‌లా మారి ప్రత్యేక విండోలో ఓపెన్‌ అవుతుంది. అక్కడ కావాలంటే మార్కర్‌తో స్క్రీన్‌షాట్‌పై రాసుకోవచ్చు. కావల్సిన మేరకు హైలైట్‌ చేయవచ్చు. తర్వాత వివిధ ఫార్మెట్‌ల్లో సేవ్‌ చేయవచ్చు. టూల్‌లోని New మెనూ పక్కన కనిపించే బాణం గుర్తుపై క్లిక్‌ చేసి స్క్రీన్‌షాట్‌ తీసుకుని స్టెల్‌ని (Free-form Snip, Rectangular Snip, Window Snip, Full Screen Snip) మార్చుకోవచ్చు.






BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

చేయాల్సిన పనులో... ఫోన్ నెంబర్లో... ఏదైనా సమాచారాన్ని మర్చిపోకుండా చిన్న స్లిప్పై రాసి కనిపించేలా ఏ ఫ్రిడ్జ్పైనో అంటిస్తుంటాం. వాటినే కాస్త టెక్నాలజీ పరిభాషలో స్టిక్కీనోట్స్ అంటుంటాం. అలాంటి నోట్స్ని పీసీ డెస్క్టాప్పై పెట్టుకోవచ్చు.విండోస్ 7 ఓఎస్లో చిన్న చిట్కా ఉంది. పేరు 'స్టిక్కీనోట్స్'. ఓఎస్లో బిల్ట్గానే ఉండే బుల్లి సర్వీసు. స్టార్ట్ బటన్లోని రన్పైన క్లిక్ చేసి Sticky Notes అని టైప్ చేయండి. డీఫాల్ట్గా పసుపు రంగులో బాక్స్ వస్తుంది. దానిపై టెక్స్ట్ని టైప్ చేసి ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. బాక్స్పై కనిపించే ప్లస్ గుర్తుపై క్లిక్ చేసి కొత్త స్టిక్కీ నోట్స్ని బాక్స్ని పొందొచ్చు. బాక్స్పై రైట్క్లిక్ చేసి రంగుల్ని కూడా మార్చుకునే వీలుంది. సిక్కీబాక్స్లు అక్కర్లేదు అనుకుంటే క్లోజ్ గుర్తుపై క్లిక్ చేస్తే సరి.






BY
tanugula rakesh
thanugularakesh@gmail.com