Feb 1, 2016

షార్ట్‌కట్‌ కీలతో పని చాలా సులభం అవుతుంది. ఎన్ని విండోలు, సాఫ్ట్‌వేర్‌లు ఓపెన్‌ చేసినా ఒకేసారి మినిమైజ్‌ చేసి డెస్క్‌టాప్‌ని చూడాలనుకుంటే Windows Logo+D నొక్కండి.
* ఓపెన్‌ చేసిన అన్ని విండోలను ఒకేసారి మినిమైజ్‌ చేయాలంటే Windows Logo+M వాడొచ్చు.
* 'మై కంప్యూటర్‌' ని షార్ట్‌కట్‌ కీతో ఓపెన్‌ చేయవచ్చు తెలుసా? అందుకు Windows logo + E నొక్కండి.
* సిస్టంలోని ఫైల్స్‌, ఫోల్డర్లును వెతికేందుకు స్టార్ట్‌ మెనూలోని 'సెర్చ్‌' వాడేస్తాం. దాన్ని షార్ట్‌కట్‌ ద్వారా ఎంచుకోవాలంటే.. Windows + F
* కంప్యూటర్‌ని షడ్‌డౌన్‌, రీస్టార్ట్‌, లాగ్‌ఆఫ్‌ చేయకుండా తాళం వేయాలంటే Windows Logo + L
* స్టార్ట్‌ మెనూలో కనిపించే 'రన్‌' ఆప్షన్‌ని ఓపెన్‌ చేయడానికి Windows Logo + R నొక్కండి.
* కీబోర్డ్‌తో స్టార్‌ మెనూని ఓపెన్‌ చేయాలంటే Ctrl+Esc మీటల్ని నొక్కాలి.
* సాఫ్ట్‌వేర్‌, బ్రౌజర్‌ ఏదైనా కావచ్చు. ప్రొగ్రాంలోని మెనూబార్‌ని యాక్టివేట్‌ చేయడానికి F10 వాడొచ్చు.
* సెలెక్ట్‌ చేసిన ఫైల్‌, ఫోల్డర్‌ ఏదైనా పేరు మార్చాలనుకుంటే F2 నొక్కండి.
* డెస్క్‌టాప్‌పై కనిపించే అన్ని విభాగాల్లోకి (డెస్క్‌టాప్‌, టాస్క్‌బార్‌, సిస్టంట్రే...) కర్సర్‌ని కదిలేలా చేయడానికి F6 వాడొచ్చు.
* మై కంప్యూటర్‌, ఎక్స్‌ప్లోరర్‌ విండోల్లో ఉన్నప్పుడు అడ్రస్‌బార్‌ల్ల
ోకి వెళ్లేందుకు F4 వాడొచ్చు.
* సెలెక్ట్‌ చేసిన వాటికి 'షార్ట్‌కట్‌ మెనూ' కావాలనుకుంటే Shift+F10 నొక్కండి. ఉదాహరణకు మీరు ఎంపిక చేసిన ఫోల్డర్‌ మెనూని ఓపెన్‌ చేయవచ్చు



BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

0 comments:

Post a Comment