Feb 1, 2016

స్నేహితుడితో మెసెంజర్ మాటలు... మంచి జోకు పంపాడు. మీకు బాగా నచ్చింది. పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. మీ స్పందనని స్నేహితుడికి చెప్పాలంటే? టెక్స్ట్ రూపంలోనో లేదా ఎమోటికాన్తో చెప్పాలి. ఏం పంపినా... ఎంత చెప్పినా... మీ స్పందనని లైవ్లో చూస్తేనే కదా! దోస్త్ దిల్ ఖుష్ అయ్యేది. ఇది సాధ్యమేనా?
అందుకే మెసెంజర్ టెక్స్ట్ ఛాటింగ్ చేసేటప్పుడు లైవ్లో మీ వీడియో అవతలివారికి కనిపిస్తే! అదెలా సాధ్యం అంటారా? అయితే, Yahoo Livetext- Video Chat ఆప్ని స్మార్ట్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే సరి. ఇదో ఉచిత 'లైవ్ వీడియో టెక్స్ట్ ఆప్'. ఎలాంటి సౌండ్స్ లేకుండా లైవ్ వీడియోతో టెక్స్ట్ ఛాటింగ్ చేయవచ్చు అన్నమాట. ఉదాహరణకు స్నేహితుడికి పుట్టిన రోజు శుభాకాంక్షల్ని మెసెంజర్లో టెక్స్ట్ రూపంలో పంపుతూనే లైవ్ వీడియోలో స్నేహితుడి ఆనందాన్ని, పుట్టిన రోజు వేడుకని సరాసరి చూడొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే మెసెంజర్లో టెక్స్ట్ ఛాట్ చేసుకుంటూ లైవ్ వీడియో చూడొచ్చు అన్నమాట.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫ్లాట్ఫాంలతో స్మార్ట్ మొబైల్స్ని వాడుతున్నట్లయిత
ే ఆయా ఆప్ స్టోర్ల నుంచి ఉచితంగా పొందొచ్చు. ఇన్స్టాల్ చేశాక వాడుతున్న మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత ప్రొఫైల్ ఐడీ క్రియేట్ చేసుకుని స్నేహితులకు ఆహ్వానాన్ని పంపొచ్చు. లేదంటే...ప్లస్ గుర్తుతో కనిపించే Add Friends ఆప్షన్ని సెలెక్ట్ చేసి ప్రొఫైల్ ఐడీతో ఆహ్వానాన్ని పంపొచ్చు. ఇరువురూ ఆప్లో సభ్యులై ఆహ్వానాల్ని మన్నించుకుంటే చాలు. లైవ్ టెక్స్ట్ వీడియో ఛాట్ని కొనసాగించొచ్చు. కాంటాక్ట్లను సెలెక్ట్ చేయగానే అన్ని మెసెంజర్ల మాదిరిగానే ఓపెన్ అవుతుంది. కాకపోతే మెసెంజర్ బ్యాక్గ్రౌండ్లో లైవ్ వీడియో ఓపెన్ అవుతుంది. వీడియో పైనే మెసెంజర్ టెక్స్ట్ కనిపిస్తుంది.అడ్రస్బుక్ కాంటాక్ట్ల నుంచి కూడా స్నేహితులకు ఆహ్వానాన్ని పంపొచ్చు. సెర్చ్ ద్వారా కావాల్సిన కాంటాక్ట్ని వెతికి ఛాట్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు.



BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

0 comments:

Post a Comment