May 18, 2016

ఈ మధ్యనే వినియోగదారుల ప్రైవసీ కోసం దాదాపు ప్రముఖ మెసేజింగ్ యాప్ లు అన్నీఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ వ్యవస్థను ఏర్పాటు చేయగా... టెలిగ్రామ్ యాప్ మరో అడుగు ముందుకు వేసి... తాము షేర్ చేసిన మెసేజ్ లో ఏవైనా తప్పులు దొర్లితే తిరిగి సరిదిద్దుకునే సదుపాయాన్ని తమ వినియోగదారులకు కల్సించనుంది.
ప్రస్తుత వేగవంతమైన ప్రజల జీవన శైలి ప్రభావం... తాము వుపయోగించే యాప్ ల పైన కూడా పడింది. అంచేత... వేగంగా ఏ మెసేజ్ ని టైపు చేసినా ఏదో ఒక తప్పు దొర్లడం పరిపాటిగా మారింది. దానిని గురించి చెప్పడానికి మరో మెసేజ్ పెట్టాల్సి వస్తుంది. అంచేత ఈ సమస్య పరిష్కార దిశగా ఆలోచించిన టెలిగ్రామ్ సంస్థ... తమ వినియోగదారులు ఆల్రెడీ పోస్టు చేసి మెసేజ్ లను తిరిగి ఎడిటింగ్ చేసుకుని, తప్పులను సరిదిద్దుకో గలిగే ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. కాగా ఇది అటు స్మార్ట్ ఫోన్ ఇటు డెస్క్ టాప్ రెండింటా పని చేస్తుంది.
వాస్తవానికి వాట్సప్ లో స్పెల్ చెకర్ డీఫాల్ట్ గానే వుంది కనుక ఇంగ్లీషులో పెద్దగా అక్షర దోషాలు తలెత్తవు. అదే తెలుగులో ఆ అవకాశం లేదు. కానీ టెలిగ్రామ్ లో స్పెల్ చెకర్ లేకపోయినప్పటికీ ఈ తాజా ఫీచర్ వలన వివిధ భాషలలో టెలిగ్రామ్ యాప్ ను వినియోగించేవారికిది సూపర్ గా నచ్చుతుంది.

0 comments:

Post a Comment