విండోస్ అన్ని వెర్షన్లలోనూ 'కాలిక్యులేటర్' ఉంటుంది. మరి, ఇప్పటి వరకూ
మీరు కేవలం కూడికలు... తీసివేతలు లాంటి ఇతర లెక్కింపులకే వాడి ఉంటారు.
కానీ, విండోస్ 7 వెర్షన్‌లో అదనపు సౌకర్యాల్ని జత చేయవచ్చు. ఉదాహరణకు
మైళ్లని కిలోమీటర్లలోకి, మీటర్లను అడుగుల్లోకి మార్చుకుని చూడాలంటే? అందుకు
కాలిక్యులేటర్‌లో చిట్కా ఉంది. మెనూ బార్‌లోని View మెనూలోకి వెళ్లి Unit
Conversion ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. షార్ట్‌కట్ ద్వారా కావాలంటే Crtl+U
మీటల్ని వాడొచ్చు. అలాగే, రోజువారీ ఖర్చుల్ని లెక్కగట్టేందుకు Worksheets
వాడుకోవచ్చు. తేదీల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకునేందుకు Date
Calculation ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.
0 comments:
Post a Comment