హాలీవుడ్ సినిమాలో రాంబోలా గెటప్... చేతిలో బోల్డన్ని మెషీన్ గన్‌లు...
పడవపై ప్రయాణం... మరోవైపు పేరాషూట్‌లు, హెలీకాప్టర్‌లతో గాల్లో చుట్టూ
శత్రువుల దాడులు... వారిని కాల్చి బూడిద చేస్తూ ముందుకు సాగాలి. అదే
Ramboat వీడియో గేమ్. ఈ సాహస యాత్రలో రాంబో ఎవరో తెలుసా? ‘మాంబో’. ముందుగా
ప్రయాణం మాంబోతోనే మొదలు. తర్వాత రోజ్, విన్సెంట్, ఆర్నాల్డ్ జత
కలుస్తారు. తగిన స్కోర్‌ని సాధించి వీరిని అన్‌లాక్ చేయాలి. వీళ్లందరినీ
శత్రు స్థావరం నుంచి బయటపడేలా చేయాలి. నీళ్లపై పడవని మెరుపు వేగంతో నడపడమే
పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే శత్రువులు గాల్లోనే కాదు. నీటి అడుగు నుంచి కూడా
ఆయుధాల్ని ప్రయోగిస్తారు. పడవని గాల్లో ఎగిరేలా చేసి తప్పించుకోవాలి. పై
నుంచి దూసుకొచ్చే బుల్లెట్‌ల నుంచి తప్పించుకునేందుకు పడవని నీళ్లలోకి
మునిగేలా చేయవచ్చు కూడా. పడవలో వెళ్తూ దార్లో ఎదురయ్యే పవర్ ప్యాక్‌లను
సేకరిస్తూ గన్‌ల సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అప్పుడు శత్రువుల్ని
ఎదుర్కోగలరు. ఏడు భిన్నమైన స్టేజ్‌లను దాటుకుంటూ వెళ్లాలి. ఆట మొత్తంలో పలు
రకాల పడవల్ని మార్చుకుంటూ ముందుకు సాగొచ్చు. శత్రువుల్ని మీరు ఎలా
మట్టుబెట్టింది స్పష్టంగా చూసేందుకు ‘స్లో మోషన్’ ఆప్షన్ ఉంది
0 comments:
Post a Comment