welcome to my blog

నా బ్లాగ్ ని visit చేసినందుకు ధన్యవాదాలు.మీకు కావాల్సిన ఆండ్రాయిడ్ apps మరియు latest pctips ని మీరు ఇక్కడ నా బ్లాగ్ లో తెలుసుకోవచ్చు.

hai

follow me on twitter https://twitter.com/rakeshtanugula.

రాకేష్ తనుగుల

contact me:thanugularakesh@gmail.com

hello this is my technical blog

you can view technlology updates and new android apps details in my blog as i know

facebook page

like my facebook page:https://www.facebook.com/pctipsrs/

Don't forgot to share my blog

If you like my blog.Don't forgot to share my blog Thank's you. from రాకేష్ తనుగుల

Jun 8, 2016

FACE BOOK INVITE ALL

 మీకు  ఫేస్ బుక్ పేజీ వుంటే... దానికి మీ మిత్రులను ఇన్వైట్ చేయాలి అనుకుంటే... మీ అకౌంట్ లో వున్న మిత్రులను ఒక్కొక్కరిని ఇన్వైట్ చేయడం కష్టం అనిపిస్తుందా... అయితే మీ సమస్యకో పరిష్కారం వుంది.
ఒకే సారి మీ ఫ్రెండ్స్ అందరినీ మీ పేజ్ లైక్ చేయడానికి FACE BOOK INVITE ALL అనే క్రోమ్ EXTENSION ని మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో ఇన్ స్టాల్ చేసుకుని.... ఆ బటన్ ప్రేస్ చేస్తే... ఇక అదే మీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తుంది.
నోట్ :"ఇదేదో బాగుందని  ఒకేసారి  మీ పేజీలన్నింటికీ ఇన్విటేషన్లు పంపకండి. ఒకే సారి అన్ని పేజీలకు ఇన్విటేషన్లు పంపితే ఫేస్ బుక్ మీకు ఆ సదుపాయాన్ని తాత్కాలికంగా రద్దు చేయవచ్చు. అందుకని .. ఒక రోజు ఒక పేజీనీ మరొక రోజు మరొక పేజీకి ఈ గూగుల్ ఎక్సెటెన్షన్ ద్వారా ఇన్విటేషన్లు పంపకోవచ్చు".

Jun 7, 2016

WICKR-Top Secret Messenger

వ్యక్తిగతంగా స్నేహితులతోనో... గ్రూపు సభ్యులతోనో మీరు చేసిన టెక్స్ట్‌ మెసేజింగ్‌ ఆటోమాటిక్‌గా నిర్ణీత సమయం తర్వాత డిలీట్‌ అవ్వడం మీకు తెలుసా? wickr ఆప్‌లో ఆ సౌకర్యం ఉంది. దీన్నే Self-distructing message ఆప్‌గా పిలుస్తున్నారు. వాల్‌పై మెసెజ్‌ని పోస్ట్‌ చేయడానికి ముందే ఎంత సమయం తర్వాత అవి డిలీట్‌ అవ్వాలనేది ముందే నిర్ణయించొచ్చు. ఉదాహరణకు పోస్ట్‌ చేసిన వెంటనే కొన్ని సెకన్ల వ్యవధిలో మాయం అయ్యేలా చేయవచ్చు. ఐదు రోజుల వరకూ టెక్స్ట్‌ వాల్‌పై ఉండేలా కూడా చేయవచ్చు. నిర్ణీత సమయం కాగానే అవతలి వ్యక్తి ఫోన్‌ నుంచి మెసేజ్‌లు మొత్తం డిలీట్‌ అవుతాయి. టెక్స్ట్‌ మాత్రమే కాదు. వాల్‌పై ఫోటోలు, వీడియోలను కూడా షేర్‌ చేయవచ్చు. ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేశాక యూజర్‌నేమ్‌ పాస్‌వర్డ్‌తో ఎకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలి. తర్వాత వాడుతున్న ఈమెయిల్‌ ఐడీ, ఫోన్‌ నెంబర్‌ ద్వారా స్నేహితులకు వ్యక్తిగతంగా ఆహ్వానాలు పంపొచ్చు. ఒకవేళ అప్పటికే ఎవరైనా స్నేహితులు ఆప్‌ని వాడుతున్నట్లయితే స్నేహితుల కాంటాక్ట్‌ లిస్ట్‌ వచ్చేస్తుంది. వాట్స్‌ఆప్‌లో మాదిరిగానే కాంటాక్ట్‌లను వెతుక్కుని ఛాట్‌ చేయవచ్చు. టెక్స్ట్‌ టైప్‌ చేసి డైలాగ్‌ బాక్స్‌లో మీరు పెట్టుకున్న Self-distructing time డీఫాల్ట్‌గా కనిపిస్తుంది. ఛాట్‌లో వీడియోలు, ఇమేజ్‌లు, వాయిస్‌ మెసేజ్‌లను పోస్ట్‌ చేసేందుకు డైలాగ్‌ బాక్స్‌ పక్కన కనిపించే ఐకాన్‌ గుర్తుపై తాకితే చాలు. కొత్త మెసేజ్‌లను పంపే ముందు 'లాక్‌ ఐకాన్‌' సెలెక్ట్‌ చేసి Self distruct timer సెట్‌ చేయవచ్చు. దీంతో మెసేజ్‌ పక్కనే లైవ్‌లో కౌంట్‌డౌన్‌ కనిపిస్తూనే ఉంటుంది. దీంతో మీరు పోస్ట్‌ చేసిన మెసేజ్‌ ఎప్పుడు మాయం అవుతుందనేది కూడా తెలుస్తుంది. మెసేజ్‌లతో పాటు డేట్‌, సమయం, లొకేషన్‌, డివైజ్‌ ఇన్ఫర్మేషన్‌... మొత్తం తొలగిపోతాయి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి Default Destruction సెట్‌ చేసుకోవడం ద్వారా ఎప్పుడూ ఒకే సమయానికి వాల్‌పై పోస్ట్‌ చేసిన మెసేజ్‌లను పోయేలా చేయవచ్చు. క్లౌడ్‌ సర్వీసుల్లోని ఫైల్స్‌ని కూడా ఎంపిక చేసుకుని వాల్‌పై షేర్‌ చేయవచ్చు. బాక్స్‌, డ్రాప్‌బాక్స్‌, గూగుల్‌ డ్రైవ్‌... సర్వీసుల్ని సపోర్ట్‌ చేస్తుంది. ఇక డేటా సెక్యూరిటీ విషయానికొస్తే ఆప్‌కి 4,096-bit RSA encryption ఉంది. అంతేకాదు... ఫోటోలను షేర్‌ చేయడానికి ముందు ఆకట్టుకునేలా ఎడిట్‌ చేసే వీలుంది. పది మంది సభ్యులతో గ్రూపు క్రియేట్‌ చేసుకోవచ్చు. Shredder ఆప్షన్‌తో డిలీట్‌ చేసిన ఫైల్స్‌ మూలాల్ని శాశ్వతంగా డిలీట్‌ చేయవచ్చు. బుల్లి తెరపైనే కాదు. డెస్క్‌టాప్‌పైనా ఇన్‌స్టాల్‌ చేసుకుని సిస్టం నుంచే మెసేజింగ్‌ చేయవచ్చు. విండోస్‌, లినక్స్‌ డెస్క్‌టాప్‌ ఓఎస్‌లను సపోర్ట్‌ చేస్తుంది.

ఫేస్‌బుక్‌ నుంచి నోటిఫికేషన్‌ అప్‌డేట్స్‌ వచ్చినట్టుగానే వాట్స్‌ఆప్‌ నుంచి కూడా కొన్ని అప్‌డేట్స్‌కి మెయిల్‌కి పంపుతున్నారట. వాట్స్‌ఆప్‌ కంపెనీనే పంపింది అనుకుని ఆయా మెసేజ్‌ లింక్‌లపై క్లిక్‌ చేస్తే అంతే సంగతులట. సెక్యూరిటీ సంస్థ ‘కొమోడో ల్యాబ్స్‌’ ఈ రకమైన ఎటాక్స్‌ని విశ్లేషించి చెబుతోంది. ఇదో ప్రత్యేక ‘ఫిషింగ్‌ స్క్రీమ్‌’గా సంస్థ నిర్వచిస్తోంది. ఆసక్తికరమైన మెసేజ్‌లు, వాయిస్‌ రికార్డింగ్‌ నోటిఫికేషన్‌ లింక్‌లను వాట్స్‌ఆప్‌ పంపినట్టుగానే హ్యాకర్లు మెయిల్‌ చేస్తారు. నిజమని నమ్మేలా వాట్స్‌ఆప్‌ లోగోని కూడా జత చేస్తారు. ఇంకేముందీ... ఆయా లింక్‌లపై క్లిక్‌ చేస్తే సరాసరి మీరు హ్యాకర్ల చేతికి చిక్కినట్టే. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే... వాట్స్‌ఆప్‌ ఎకౌంట్‌ ఎప్పుడూ ఫోన్‌ నెంబర్‌తోనే ముడిపడి పని చేస్తుంది. ఎందుకంటే మీరు వాట్స్‌ఆప్‌ని వాడేందుకు ఫోన్‌ నెంబర్‌తోనే రిజిస్టర్‌ అవుతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏదైనా అప్‌డేట్‌ కంపెనీ మీకు పంపాల్సివస్తే ఫోన్‌ నెంబర్‌కి పంపుతుందేగానీ... మెయిల్‌కి కాదు. అందుకే మెయిల్‌కి చేరిన ఈ తరహా మెయిల్స్‌ని స్పాం అని గుర్తించి వాటిపై క్లిక్‌ చేయకుండా వెంటనే తొలగించండి.

రోజూ వాల్‌పై ఎన్నో పోస్టింగ్స్‌ చూస్తుంటాం. లైక్‌లు కొడుతుంటాం... కామెంట్‌ చేస్తాం... ఇలా ఎఫ్‌బీలో రోజూ చాలానే చేస్తుంటాం. మరి, మీకు ఎప్పుడైనా మొత్తం ఫేస్‌బుక్‌ యాక్టివిటీని చూద్దాం అనిపించిందా? అయితే, ముందుగా ఫేస్‌బుక్‌లోకి లాగిన్‌ అవ్వండి. తర్వాత www.facebook.com/me/allactivity యూఆర్‌ఎల్‌ లింక్‌ని అడ్రస్‌బార్‌లపై టైప్‌ చేసి ఎంటర్‌ నొక్కండి. మొత్తం సెర్చ్‌ హిస్టరీ అంతా క్షణాల్లో ముందు ప్రత్యక్షమవుతుంది. ఇక మీరు స్క్రోల్‌ చేస్తూ చూడడమే! ఒకవేళ మీరు పోస్ట్‌ చేసినవి మాత్రమే కావాలనుకుంటే? అందుకో సెర్చ్‌వర్డ్‌ ఉంది. ఫేస్‌బుక్‌ హోంలోని సెర్చ్‌లో posts by me టైప్‌ చేసి ఎంటర్‌ నొక్కండి.

Swipedge Edge

భిన్నమైన లాంచర్‌లు వాడుతూ ఆప్స్‌ని యాక్సెస్‌ చేసుంటారు. కానీ, తెరపై ఒక ఆప్‌ ఓపెన్‌ చేసి ఉండగానే మీకు అవసరమైన మరో ఆప్‌ని ఓపెన్‌ చేయగలిగారా? ఇలా మల్టిపుల్‌ ఆప్స్‌ని ఓపెన్‌ చేయడం ఎలా అనేగా సందేహం! అయితే, మీరు Swipedge Edge ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందే. బీటా వెర్షన్‌లో దీన్ని అందిస్తున్నారు. ఇన్‌స్టాల్‌ చేయగానే ఫోన్‌కి కుడివైపు ప్రత్యేక సైడ్‌బార్‌ కనిపిస్తుంది. దాంట్లోని మధ్య భాగంలో కనిపించే ‘ఆప్‌ డ్రాయర్‌’లో ఎక్కువగా వాడే ఆప్స్‌ని జాబితాగా పెట్టుకోవాలి. ఇంకేముందీ... ఎడమవైపుకు స్వైప్‌ చేస్తే మూడు విభాగాలుగా పొడుచుకొస్తుంది. ఇక మీదట ఏదైనా ఆప్‌ని ఓపెన్‌ చేసి చూస్తూనే... అవసరం మేరకు మరో ఆప్‌ని చిటికెలో ఓపెన్‌ చేయవచ్చు. సైడ్‌బార్‌ని స్వైప్‌ చేసి మధ్యలోని ‘ఆప్‌ డ్రాయిర్‌’ నుంచి కావాల్సిన ఆప్‌ని తాకితే చాలు. ఓపెన్‌ అవుతుంది. ఇలా ఆప్‌ డ్రాయిర్‌లో ఉన్న అన్ని ఆప్స్‌ని ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్‌ చేయవచ్చు. ఫోన్‌ బ్యాక్‌ బటన్‌ని నొక్కుతూ ఒక్కో దాంట్లోంచి బయటికి రావచ్చు కూడా. అంతేకాదు... ఈ సైడ్‌బార్‌లో మ్యూజిక్‌ వాల్యూమ్‌ని కంట్రోల్‌ చేయవచ్చు. ఫోన్‌ని కూడా దీన్నుంచే తాళం వేసే వెసులుబాటు ఉంది. కావాల్సినట్టుగా సైడ్‌బార్‌ థీమ్‌ని మార్చుకోవచ్చు.

Tiny Scanner - PDF Scanner

ముఖ్యమైన డాక్యుమెంట్స్‌... బిల్లులు... మెడికల్‌ రిపోర్ట్‌లు... ఏవైనా చిటికెలో స్కాన్‌ చేసి భద్రం చేసుకునేందుకు Tiny Scanner - PDF Scanner ఆప్‌ని వాడొచ్చు. స్కాన్‌ చేసిన వాటిని ఫోన్‌లోనే కాకుండా క్లౌడ్‌ సర్వీసుల్లోనూ సేవ్‌ చేయవచ్చు. డ్రాప్‌బాక్స్‌, గూగుల్‌ డ్రైవ్‌, వన్‌డ్రైవ్‌, బాక్స్‌... సర్వీసుల్ని సపోర్ట్‌ చేస్తుంది. పేజీ సైజ్‌లను కావాల్సినట్టుగా మార్పులు చేసుకునే వీలుంది. స్కాన్‌ చేసిన కాపీలను సెర్చ్‌ ద్వారా వెతకొచ్చు కూడా. ముఖ్యమైన డాక్యుమెంట్స్‌కి పాస్‌వర్డ్‌తో తాళం వేసే వీలుంది.

Ramboat

హాలీవుడ్‌ సినిమాలో రాంబోలా గెటప్‌... చేతిలో బోల్డన్ని మెషీన్‌ గన్‌లు... పడవపై ప్రయాణం... మరోవైపు పేరాషూట్‌లు, హెలీకాప్టర్‌లతో గాల్లో చుట్టూ శత్రువుల దాడులు... వారిని కాల్చి బూడిద చేస్తూ ముందుకు సాగాలి. అదే Ramboat వీడియో గేమ్‌. ఈ సాహస యాత్రలో రాంబో ఎవరో తెలుసా? ‘మాంబో’. ముందుగా ప్రయాణం మాంబోతోనే మొదలు. తర్వాత రోజ్‌, విన్సెంట్‌, ఆర్నాల్డ్‌ జత కలుస్తారు. తగిన స్కోర్‌ని సాధించి వీరిని అన్‌లాక్‌ చేయాలి. వీళ్లందరినీ శత్రు స్థావరం నుంచి బయటపడేలా చేయాలి. నీళ్లపై పడవని మెరుపు వేగంతో నడపడమే పెద్ద ఛాలెంజ్‌. ఎందుకంటే శత్రువులు గాల్లోనే కాదు. నీటి అడుగు నుంచి కూడా ఆయుధాల్ని ప్రయోగిస్తారు. పడవని గాల్లో ఎగిరేలా చేసి తప్పించుకోవాలి. పై నుంచి దూసుకొచ్చే బుల్లెట్‌ల నుంచి తప్పించుకునేందుకు పడవని నీళ్లలోకి మునిగేలా చేయవచ్చు కూడా. పడవలో వెళ్తూ దార్లో ఎదురయ్యే పవర్‌ ప్యాక్‌లను సేకరిస్తూ గన్‌ల సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అప్పుడు శత్రువుల్ని ఎదుర్కోగలరు. ఏడు భిన్నమైన స్టేజ్‌లను దాటుకుంటూ వెళ్లాలి. ఆట మొత్తంలో పలు రకాల పడవల్ని మార్చుకుంటూ ముందుకు సాగొచ్చు. శత్రువుల్ని మీరు ఎలా మట్టుబెట్టింది స్పష్టంగా చూసేందుకు ‘స్లో మోషన్‌’ ఆప్షన్‌ ఉంది