welcome to my blog

నా బ్లాగ్ ని visit చేసినందుకు ధన్యవాదాలు.మీకు కావాల్సిన ఆండ్రాయిడ్ apps మరియు latest pctips ని మీరు ఇక్కడ నా బ్లాగ్ లో తెలుసుకోవచ్చు.

hai

follow me on twitter https://twitter.com/rakeshtanugula.

రాకేష్ తనుగుల

contact me:thanugularakesh@gmail.com

hello this is my technical blog

you can view technlology updates and new android apps details in my blog as i know

facebook page

like my facebook page:https://www.facebook.com/pctipsrs/

Don't forgot to share my blog

If you like my blog.Don't forgot to share my blog Thank's you. from రాకేష్ తనుగుల

Feb 29, 2016

youtube


whats app

బ్లాక్‌బెర్రీ, సింబియన్ ఫోన్లకు 'వాట్సప్' సపోర్ట్ నిలిపివేత...
అన్ని బ్లాక్‌బెర్రీ డివైస్‌లు, సింబియన్ 40, 60 ఆధారిత ఫోన్లు, ఆండ్రాయిడ్ 2.1, 2.2 డివైస్‌లు, విండోస్ 7.1 డివైస్‌లకు వాట్సప్ తన సపోర్ట్‌ను నిలిపివేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసింది.
ప్రస్తుతం వాట్సప్‌ను వాడుతున్న యూజర్లలో 99 శాతం మంది ఆండ్రాయిడ్ ఓఎస్‌ను, మిగిలిన వారు ఐఓఎస్, విండోస్ ఫోన్ 8 ఓఎస్‌లను కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో పాత తరం డివైస్‌లకు, ఓఎస్‌లకు సపోర్ట్‌ను నిలిపివేయక తప్పడం లేదని వాట్సప్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఇంకా అలాంటి డివైస్‌లను వాడుతున్నట్టయితే దయచేసి వాటిని తీసేసి కొత్త డివైస్‌లకు అప్‌గ్రేడ్ కావాలని వారు కోరుతున్నారు.
తమ యూజర్లకు మరింత నాణ్యమైన సేవలను సులభతరంగా అందజేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పాత విండోస్, సింబియన్ డివైస్‌లను పక్కన పెడితే బ్లాక్‌బెర్రీ యూజర్లకు ఇది ఒకింత ఇబ్బంది కలిగించే విషయమని, అయినప్పటికీ సపోర్ట్‌ను నిలిపివేయక తప్పడం లేదని వారు పేర్కొంటున్నారు.

 source from internet

BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

Adobe photoshop7.0 shortcut keys

Adobe photoshop

అందరూ  ఫోటోషాప్ ని ఉపయోగించి  ఫొటోస్ ని ఎడిట్ చేస్తారు . కానీ  అందరికి  ఫోటోషాప్ shortcut keys
తెలియక పోవచ్చు .అలాంటి  వారి కోసం నాకు తెల్సిన  shortcut keys ని తెలియచేస్తున్నాను . వీటిని తప్పక ట్రై  చేయండి.
Adobe photoshop7.0 shortcut keys
  • Ctrl+n                            new
  • Ctrl+v                             paste
  • Shift+ctrl+s                    save as
  • Ctrl+s                              save
  • Ctrl+o                             open
  • Ctrl+W                            close
  • Alt+i+i                             image size menu
  • Alt+i+e                            image rotation
  • V                                     movetool
  • C                                      croptool
  • E                                        eraser
  • P                                        pen tool
  • Z                                       zoom tool
  • Ctrl+-                                 zoom out
  • Ctrl+alt+0                       image orginal size
  • Alt+L+L                        delete layer
  • Alt+L+y+v                     layer style
  • Alt+ctrl+d                        feather selection
  • Ctrl+a                                    all
  • Ctrl+u                               hue/saturation
  • Ctrl+t                                  rotate
  • Ctrl+p                                print with preview
  • Alt+ctrl+p                          direct print  without preview
  • Ctrl+z                                 undo
  • Alt+I+d                              duplicate image
  • Ctrl++                                zoom in



BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

Feb 28, 2016

select files easy in system



ఫోల్డర్‌లో ఒకటి కంటే ఎక్కువ ఫైల్స్‌ ఉన్నప్పుడు వాటిల్లో కావాల్సిన వాటిని సెలక్ట్‌ చేయాలంటే? ఏముందీ... కంట్రోల్‌ మీటని నొక్కి ఉంచి ఒక్కొక్కటిగా సెలెక్ట్‌ చేస్తాం. మరింత సులువుగా సెలెక్ట్‌ చేసేందుకు  , 'పోల్డర్‌ ఆప్షన్స్‌'లోకి వెళ్లి టిప్‌ని తప్పక ప్రయత్నించాల్సిందే. ఫోల్డర్‌ ఆప్షన్స్‌ని ఓపెన్‌ చేసేందుకు రన్‌లోకివెళ్లి Folder Options ఓపెన్‌ చేయవచ్చు. వచ్చిన విండోలోని View ట్యాబ్‌పై క్లిక్‌ చేయండి. దాంట్లో కనిపించే Advanced Settings లోని Use check boxes to select items ఆప్షన్‌ని చెక్‌ చేసి 'అప్లె' చేయాలి. ఇక మీరు ఏదైనా ఫోల్డర్‌లోని ఫైల్‌పై పాయింటర్‌ ఉంచితే చాలు చెక్‌ బాక్స్‌ కనిపిస్తుంది. ఇంకేముందీ... ఫైల్‌ని సెలెక్ట్‌ చేయాలంటే ఫైల్‌ పేరు ముందు కనిపించే చెక్‌బాక్స్‌ని సెలెక్ట్‌ చేస్తే సరిపోతుంది. ఇలా ఎన్ని ఫైల్స్‌ని అయినా చెక్‌బాక్స్‌లతో సులువుగా సెలెక్ట్‌ చేసుకోవచ్చు.

BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

Wire Defuser

Wire Defuser

 ఈ గేమ్ లో మనం bombs  ని defuse చేసి world ని కాపాడాలి. మొత్తం 80 లెవెల్స్ ఉన్నాయ్ . ఇదొక మంచి puzzle గేమ్ .google play store నుంచి గేమ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు .
BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

FEATURES
- Addictive mechanics and nervous gameplay
- Polished graphics
- 80+ levels
- Super challenging Hardcore Mode

Cut the Rope series -game for android

Cut the Rope series  -game for android

BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

vlc media player for android

సాధారణంగా మనం ఆండ్రాయిడ్ మొబైల్స్ ల లో వీడియోస్ play చేయడానికి mxplayer ని వాడుతారు .కానీ system లో వాడినట్లుvlc media pl
ayerని కూడా ఆండ్రాయిడ్ లో వాడవచ్చు కావాలంటే గూగుల్ play store నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు


BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

Feb 27, 2016

వీడియోలు, ఫొటోలు కనిపించవు

వీడియోలు, ఫొటోలు కనిపించవు
మొబైల్‌ మెమొరీలో చాలానే భద్రం చేస్తుంటాం. డాక్యుమెంట్స్‌తో పాటు వీడియోలు, ఫొటోలు కచ్చితంగా ఉంటాయి. మరి, వాటిల్లో ఏవైనా కొన్ని వీడియోలు, ఫొటోలను ఇతరుల కంటపడకుండా చేయాలంటే? ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుకో ఆప్‌ ఉంది. అదే Gallery Vault-Hide Video&Photo ఆప్‌ని ప్రయత్నించండి. తెరపై వచ్చిన గుర్తుపై తాకి ముందుగా పాస్‌వర్డ్‌ని సెట్‌ చేసుకోవాలి. ఇక గ్యాలరీలోని ఏదైనా వీడియోని మాయం చేయాలంటే సెలెక్ట్‌ చేసి Add Video ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయాలి. ఇమేజ్‌ ఫైల్స్‌ని హైడ్‌ చేసేందుకు Add Picture ఉంది. ఇలా మాయం చేసిన అన్నింటినీ పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయడం ద్వారా Gallery Vault లో చూడొచ్చు. సరాసరి ఫోన్‌ కెమెరాతో క్లిక్‌ కొట్టిన వాటిని వెంటనే మాయం చేసేందుకు Capture Picture ఆప్షన్‌ ఉంది. హైడ్‌ చేసిన మొత్తం మీడియా ఫైల్స్‌ అన్నీ ఎన్‌క్రిప్షన్‌ మోడ్‌లో సేవ్‌ అవుతాయి.



BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

Friday app

Friday
వారాంతం వచ్చిందంటే చాలు. రిలాక్స్‌ అవుతాం. ఎప్పుడైనా రిలాక్స్‌ అయినప్పుడు గతం తాలూకు జ్ఞాపకాల్ని ఓసారి నెమరు వేసుకుందాం అనుకుంటే? ఈ ఆప్‌ని ఓపెన్‌ చేయండి చాలు. వారం మొత్తం మీరేం చేశారు? ఎక్కడెక్కడ తిరిగారు? సోషల్‌ నెట్‌వర్క్‌ వాల్స్‌పై మీ అప్‌డేట్స్‌ ఏంటి? ఏం పాటలు విన్నారు?.... లాంటి మొత్తం వివరాల్ని క్షణాల్లో అందిస్తుంది. కావాలంటే ఆయా జ్ఞాపకాల్ని స్నేహితులతో సోషల్‌ మీడియాలో షేర్‌ చేయవచ్చు



BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

new android app

గీస్తూనే ఛాట్‌
మెసెంజర్లు లేని మాటలు నెటిజన్లు వూహించలేరు. కానీ, ఎప్పుడూ ఛాటింగ్‌ టెక్స్ట్‌తోనేనా? కాస్త భిన్నంగా బొమ్మలు గీస్తూ చేస్తే! అదేనండీ... స్నేహితుడిని ఛాయ్‌ తాగడానికి రమ్మని పిలవడానికి ఛాటింగ్‌లో టీ కప్పు బొమ్మ వేసి ఆహ్వానిస్తే! మీ ఆహ్వానానికి ప్రతి స్పందనగా మిత్రుడు ఎన్ని గంటలకు? అని అడిగేందుకు గడియారం బొమ్మతో కూడిన ప్రశ్న గుర్తు వేస్తే? మీరేమో సమయాన్ని 5 పీఎం అని రాసి తిరిగి పోస్ట్‌ చేస్తే! ఇదంతా ఎలా సాధ్యం అంటారా? అయితే, మీరు వాడుతున్న ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో DRAWFT ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. రియల్‌ టైంలోనే బొమ్మలు గీస్తూ ఛాట్‌ చేసేందుకు ఇదో అనువైన వేదిక. దీంట్లో ఎక్కడా కీబోర్డ్‌ కనిపించదు. ఆప్‌ని ఓపెన్‌ చేశాక వాడుతున్న మొబైల్‌ నెంబర్‌తో సభ్యులవ్వాలి. బొమ్మలు గీసేందుకు నచ్చిన రంగుల్ని సెలెక్ట్‌ చేసుకునే వీలుంది. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లేలోకి వెళ్లి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు




BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

Feb 25, 2016

ప్రింట్ ని ఆదా చేయడము ఎలా?

నెట్టింట్లో వెబ్‌ పేజీలను ప్రింట్‌ తీసుకునేటప్పుడు మెనూలు, లోగోలు, వెబ్‌ డిజైనింగ్‌ గ్రాఫిక్స్‌ ఉంటాయి. వాటితో మీకు అవసరం ఉండదు. టెక్స్ట్‌ మాత్రం ప్రింట్‌ తీసుకుంటే చాలు అనుకుంటారు. అదెలా సాధ్యం? క్రోమ్‌ బ్రౌజర్‌ వాడితే చిన్న అదనపు చిట్కాని బ్రౌజర్‌కి జత ప్రింట్‌ ప్రివ్యూలో అక్కర్లేని వాటిని తీసేయవచ్చు. Print Edit వెబ్‌ స్టోర్‌ ఎక్స్‌టెన్షనే ఆ చిట్కా. క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌ని నుంచి బ్రౌజర్‌కి జత చేయాలి. దీంతో అడ్రస్‌బార్‌ పక్కనే ఐకాన్‌ గుర్తు వస్తుంది. ఇక ఏదైనా వెబ్‌ పేజీని ప్రింట్‌ తీసుకునే ముందు అక్కర్లేని వాటిని తొలగించేందుకు పేజీకి కొత్త ట్యాబ్‌లో ఓపెన్‌ చేసి 'ప్రింట్‌ ఎడిట్‌' ఐకాన్‌ గుర్తుపై క్లిక్‌ చేయాలి. దీంతో అదనపు ఆప్షన్లతో కొత్త ట్యాబ్‌లో పేజీ ఓపెన్‌ అవుతుంది. Edit ఆప్షన్‌పై క్లిక్‌ చేసి అక్కర్లేని వాటిని సెలెక్ట్‌ చేసి డిలీట్‌ చేయవచ్చు. బొమ్మలు, ఇతర హెడ్డింగ్స్‌, లింక్స్‌, బాక్స్‌లు... పేజీలో కనిపించే అన్నీ ఒక్కొక్కటిగా సెలెక్ట్‌ అవుతాయి. పొరబాటున డిలీట్‌ చేసి Undo చేయవచ్చు. అసలు డిలీట్‌ చేయడం ఎందుకు అనుకుంటే Hide చేయవచ్చు.పేజీలో సెలెక్ట్‌ చేసినవి కాకుండా మిగతా మొత్తం తొలగిపోవాలంటే Delete Except ఆప్షన్‌ ఉంది.చివరిగా పేజీని ప్రింట్‌ తీసుకుందాం అనుకుంటే Print ఆప్షన్‌ ఉంది.


BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

Feb 23, 2016

ఫేస్బుక్ special option

ఫేస్బుక్ లో ప్రత్యేక ఆప్షన్‌ ఉందన్న విషయమైనా తెలుసా? అయితే, మీరు 'ఎకౌంట్‌ సెట్టింగ్స్‌'లో

కి వెళ్లాల్సిందే. అక్కడి పేజీ కింది భాగంలో Download a copy ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే మరో పేజీలో Start My Archive ఆప్షన్‌ వస్తుంది. క్లిక్‌ చేస్తే ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌ పాస్‌వర్డ్‌ అడుగుతుంది. ఎంటర్‌ చేసి Submitచేస్తే ఫ్రొఫైల్‌కి సంబంధించిన మొత్తం డేటాని చెక్‌ చేసుకుని వాడుతున్న మెయిల్‌ ఐడీకి లింక్‌కి పంపుతారు. అదే 'డౌన్‌లోడ్‌' లింక్‌ అన్నమాట. మీ ఫ్రొఫైల్‌లోని డేటా ఆధారంగా లింక్‌ని మెయిల్‌ చేసేందుకు సమయం తీసుకుంటారు. ఫ్రొఫైల్‌లో డేటా ఎక్కువగా ఉంటే వేచి చూడాల్సిందే. ఒకవేళ తక్కువగా ఉంటే క్షణాల్లోనే రిప్త్లె మెయిల్‌ వస్తుంది. డౌన్‌లోడ్‌ లింక్‌పై క్లిక్‌ చేస్తే Download Archive ఆప్షన్‌తో పేజీ ఓపెన్‌ అవుతుంది. క్లిక్‌ చేస్తే మళ్లీ ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌ పాస్‌వర్డ్‌ అడుగుతుంది. ఎంటర్‌ చేసి Submitచేస్తే జిప్‌ ఫార్మెట్‌లో బ్యాక్‌అప్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. జిప్‌ ఫోల్డర్‌ని ఎక్స్‌ట్రాక్ట్‌ చేసి మొత్తం డేటాని చూడొచ్చు. షేర్‌ చేసిన అన్ని ఫొటోలు ప్రత్యేక ఫోల్డర్‌లో కనిపిస్తాయి. ఫొటోలను ఆల్బమ్‌ల వారీగా షేర్‌ చేస్తే ఒక్కో ఆల్బమ్‌లోని ఫొటోలు ఒక్కో ఫోల్డర్‌లో బ్యాక్‌అప్‌ అవుతాయి. ఇదే మాదిరిగా వీడియోలనూ చూడొచ్చు. ఇక టెక్స్ట్‌ మేటర్‌తో కూడిన అప్‌డేట్స్‌ని 'హెచ్‌టీఎంఎల్‌' ఫోల్డర్‌లో చూడొచ్చు. అన్ని ఛాట్‌ మెసేజ్‌లు Messagesపేజీలో కనిపిస్తాయి. ఫోల్డర్స్‌లోని అన్ని ఐకాన్‌ గుర్తులపై క్లిక్‌ చేస్తే డేటాని బ్రౌజ్‌ చేసి చూడొచ్చు.




BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

android గేమ్స్ new

రైలు నడుపుతారా?
బైక్‌, కారు, బస్‌, లారీ... వీటిని నడిపే గేమ్స్‌ని ఆడడం చాలా వీజీ. ఎప్పుడైనా రైలుని నడిపారా? అయితే, Train Crisis గేమ్‌ని ఆడండి. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో మొబైల్‌ని వాడేవాళ్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఆట విషయానికొస్తే... వివిధ రకాల రైళ్లు, పట్టాలు, స్టేషన్లు, సిగ్నల్స్‌ ఉంటాయి. పట్టాలపైకి వచ్చిన రైళ్లను సురక్షితంగా వాటి స్టేషన్లను చేరుకునేలా చేయాలి. అందుకు పట్టాలపై ఉన్న సిగ్నల్స్‌ని ఫాలో అవ్వాలి. మిగతా రైళ్లను గమనిస్తూ ప్రమాదాలు జరకుండా చూడాలి. మొత్తం 168 లెవల్స్‌ ఉంటాయి



BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

android app

కుటుంబ సభ్యుల రక్షణ నిమిత్తం జీపీఎస్‌ సర్వీసుని వాడుకుని చాలానే చేయవచ్చు. అందుకు తగిన ఆప్స్‌ చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి Life360- Family Locator ఆప్‌. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, విండోస్‌ ఫోన్‌ ఓఎస్‌ ఫ్లాట్‌ఫాంలపై వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఆప్‌ని రన్‌ చేసి గ్రూపుగా క్రియేట్‌ అవ్వాలి. అందుకు Add Circle లోకి వెళ్లి Add a custom Circleద్వారా గ్రూపుని ఏర్పచుకోవచ్చు. తర్వాత ఆటోమాటిక్‌గా ప్రైవేటు మ్యాప్‌పై లొకేషన్‌ షేరింగ్‌ కనిపిస్తుంది. ఎవరెవరు ఏయే లొకేషన్లలో ఉన్నారో స్పష్టంగా తెలుసుకో వచ్చు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఛాటింగ్‌ చేసుకోవచ్చు. ఇంటి నుంచి కుంటుంబ సభ్యుల్లో ఎవరైనా బయటికి వెళ్తే ఎలర్ట్‌ రూపంలో మెసేజ్‌ వస్తుంది. తిరిగి ఇంటికి చేరగానే ఎలర్ట్‌లను పొందొచ్చు.


BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

ఆండ్రాయిడ్‌ వాడితే...
స్మార్ట్‌ ఫోన్‌ అన్నాక చాలానే ఆప్స్‌ని ఇన్‌స్టాల్‌ చేస్తుంటాం. గ్యాలరీలోనూ చాలానే ఉంటాయి. మెస్సెంజర్ల గురించి వేరే చెప్పాలా? ఆ వూసులకు అంతే ఉండదు. మరి, వీటన్నింటినీ ఇతరుల కంట పడకుండా చేసి ఫోన్‌ని చేతిలో పెట్టాలంటే? ప్రత్యేక ఆప్‌ని వాడితే సరి. అదే App Locker with Guest Mode. పేరుకి తగ్గట్టుగానే దీంట్లో Master, Guestమోడ్స్‌ ఉన్నాయి. ప్రత్యేక పాస్‌వర్డ్‌లతో పీసీలో మాదిరిగా రెండు ఎకౌంట్‌లు క్రియేట్‌ చేయవచ్చు. 'మాస్టర్‌' మోడ్‌లో ఫోన్‌ ఉన్నప్పుడు ఫోన్‌ని పూర్తిస్థాయిలో వాడుకోవచ్చు. అంటే ఎలాంటి పరిమితులు ఉండవన్నమాట. అదే ఇతరులకు ఫోన్‌ని ఇవ్వాల్సివస్తే 'గెస్ట్‌' మోడ్‌లో సెట్‌ చేసి ఇవ్వొచ్చు. దీంతో గెస్ట్‌ మోడ్‌లో ఎంపిక చేసుకున్న ఆప్స్‌ని పని చేయకుండా బ్లాక్‌ చేయవచ్చు. ఒక్క ఆప్స్‌ మాత్రమేనా? ఫోన్‌ Phone Dialer, Phonebook, Contactsఆప్షన్స్‌ని కనిపించకుండా చేయవచ్చు. ఇన్‌బాక్స్‌లోని మెసేజ్‌లను మాయం చేసే వీలుంది. వీడియోలు, ఇమేజ్‌లు, సినిమాలు... కంటెంట్‌ ఏదైనా గెస్ట్‌ మోడ్‌లో యాక్సెస్‌ కాకుండా చేయవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే మీ ఫోన్‌కి మీరే మాస్టర్‌ అన్నమాట. ఏది పని చేయాలన్నా... పని చేయకుండా చేయాలన్నా 'మాస్టర్‌ పాస్‌వర్డ్‌'తోనే చేయవచ్చు. ఈ పాస్‌వర్డ్‌ తాళాన్ని రెండు రకాలుగా సెట్‌ చేయవచ్చు. ఒకటి PIN.రెండు Pattern.బ్యాక్‌గ్రౌండ్‌ ఆప్‌ ఎప్పుడూ రన్‌ అవుతూనే ఉంటుంది. ఫోన్ని ఎప్పుడు రీస్టార్ట్‌ చేసినా ఫోన్‌ ఓఎస్‌తో పాటే ఆప్‌ ఆటోమాటిక్‌గా లోడ్‌ అవుతుంది. కావాలంటే ఆప్‌ లాకర్‌ని కనిపించకుండా చేయవచ్చు. పాస్‌వర్డ్‌లను మర్చిపోతే మెయిల్‌ ఐడీ ద్వారా రికవర్‌ చేయవచ్చు. మాస్టర్‌ పాస్‌వర్డ్‌ని మార్చాలనుకుంటే Change Master ఆప్షన్‌ ఉంది




BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

కిక్‌ ఇచ్చేక్రోమ్‌ ఆప్స్‌!
అన్నీ ఆప్స్‌తోనే! ఒక మొబైల్‌లోనేనా? డెస్క్‌టాప్‌పైనా సందడి చేస్తున్నాయి! క్రోమ్‌ వాడితే వాటిపై ఓ కన్నేయండి!
వెబ్‌ సర్వీసు... యుటిలిటీ టూల్‌... గేమ్‌... ఇలా ఏదైనా ఆప్‌గా రూపొందుతున్నాయి. అందుకే ఒక్క మొబైల్‌, ట్యాబ్‌ల్లోనే కాకుండా డెస్క్‌టాప్‌పైనా ఆప్స్‌ తెగ సందడి చేస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌లు ఉన్నాయిగా? ఇంకా ఆప్స్‌ ఏంటి? అనేగా సందేహం. సాఫ్ట్‌వేర్‌లు సిస్టంలో ఇన్‌స్టాల్‌ చేస్తేగానీ రన్‌ అవ్వవు. అదే ఆప్స్‌ అయితే మీరు వాడుతున్న బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్‌ చేస్తే చాలు. ఒక్క క్లిక్కుతో ఓపెన్‌ చేసి వాడుకోవచ్చు. బ్రౌజర్‌ వేదిక అంటున్నారు. అంటే... నెట్‌ కనెక్షన్‌ ఎప్పుడూ ఉండాలేమో? అనుకునేరు. ఏం అక్కర్లేదు. ఫోన్‌లో మాదిరిగానే ఒక్కసారి ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చాలు. ఆఫ్‌లైన్‌లో ఆప్‌ని హాయిగా వాడుకోవచ్చు. మరెందుకు ఆలస్యం... అవేంటో చూద్దాం!
పీడీఎఫ్‌లకు ప్రత్యేకం
ఇంట్లోనో... ఆఫీస్‌లో... సిస్టం వాడుతుంటారు. ఏదో ఒక అవసరం మేరకు పీడీఎఫ్‌ ఫైల్స్‌ని యాక్సెస్‌ చేస్తుంటారు. వాడుతున్న సిస్టంలో అడోబ్‌ రీడర్‌ ఉంటే సరి. లేకుంటే పీడీఎఫ్‌ ఫైల్స్‌ని ఓపెన్‌ చేసి చూడడం ఎలా? అందుకు క్రోమ్‌ ఆప్‌ ఒకటి ఉంది. అదే PDF Viewer. దీన్ని బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్‌ చేస్తే చాలు. సిస్టంలోని క్రోమ్‌ ఆప్స్‌ జాబితాలోకి ఐకాన్‌ రూపంలో చేరిపోతుంది. ఇక ఎప్పుడైనా సిస్టంలోని సాఫ్ట్‌వేర్‌ మాదిరిగానే దీన్ని వాడుకోవచ్చు. ఆప్‌ని సెలెక్ట్‌ చేస్తే చిన్న విండో వస్తుంది. దాంట్లోని ఫోల్డర్‌ గుర్తుపై క్లిక్‌ చేసి సిస్టంలోని పీడీఎఫ్‌ ఫైల్స్‌ని ఓపెన్‌ చేయవచ్చు. విండోలో వచ్చే టూల్‌బార్‌తో పీడీఎఫ్‌ ఫైల్‌ని కావాల్సినట్టుగా చూడొచ్చు. ఆప్‌ని ప్రయత్నిద్దాం అనుకుంటే http://goo.gl/bDkKLG లింక్‌ని చూడండి.
కంటికి రక్షణ
ఎప్పుడూ సిస్టంపైనే పనా? పనిలో నిమగ్నమైపోయి కళ్లు ఒత్తిడి లోనయ్యేలా బ్రేక్‌ తీసుకోకుండా పని చేస్తున్నారా? అయితే, బ్రేక్‌ తీసుకునేందుకు అనువైన Eye Care ఆప్‌ని ప్రయత్నించండి. ఇన్‌స్టాల్‌ చేయగానే ఆప్స్‌ జాబితాలోకి చేరిపోతుంది. క్లిక్‌ చేసి మీరెంత సమయం పని చేయాలి? ఎన్ని నిమిషాలు బ్రేక్‌ తీసుకోవాలనేది నిర్ణయించుకుని సెట్‌అప్‌ చేయాలి. డీఫాల్ట్‌గా కొన్ని ఫార్మెట్‌లు ఉన్నాయి. వాటిల్లో 20 నిమిషాలు పని చేసి ఒక నిమిషం విరామం తీసుకోవచ్చు. లేదంటే... 30 నిమిషాలు పని చేసి మూడు నిమిషాలు విరామం తీసుకోవచ్చు. ఒకవేళ మీరే పని, విరామ సమయాన్ని సెట్‌అప్‌ చేసుకోవాలంటే? Custom మెనూలోకి వెళ్లాలి. మధ్యలో టైమర్‌ని మార్చుకోవాలంటే సెట్టింగ్స్‌ గుర్తుపై క్లిక్‌ చేయాలి. ఆప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు http://goo.gl/ghOizz లింక్‌లోకి వెళ్లండి.
ఇలా భద్రం
నెట్టింట్లో ఏవేవో పనులు. కొన్నింటిని యాక్సెస్‌ చేయాలంటే కచ్చితంగా సభ్యులవ్వాల్సిందే. అలా రిజిస్టరైన వాటికి సంబంధించిన లాగిన్‌ వివరాల్ని గుర్తుంచుకోవాల్సిందే. మరి, ఎన్నని గుర్తుంచుకుంటారు. మర్చిపోయిన ప్రతిసారీ తిరిగి లాగిన్‌ వివరాల్ని పొందడం మరో ప్రక్రియ. దీంతో సమయం వృథా. అందుకే మీరు వాడే అన్ని ఆన్‌లైన్‌ ఎకౌంట్‌ల యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ వివరాల్ని సిస్టంలోనే భద్రం చేసుకుంటే? దానికేం అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ అక్కర్లేదు. సింపుల్‌గా PASSWORDS క్రోమ్‌ని ఆప్‌ని వాడుకోవచ్చు. వాడడం కూడా చాలా సులుభం. ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత రన్‌ చేయగానే Master Password, Master PIN నెంబర్లు అడుగుతుంది. వాటిని క్రియేట్‌ చేసిన తర్వాత Site Name, User Name, Password వివరాలతో డేటాబేస్‌ని క్రియేట్‌ చేసుకోవచ్చు. మొత్తం వెబ్‌ సర్వీసుల లాగిన్‌ తాళాల్ని జాబితాగా పెట్టుకున్నాక Save Data బాక్స్‌పై క్లిక్‌ చేయాలి. ఇక మీరు ఏదైనా సర్వీసు పాస్‌వర్డ్‌ లేదా యూజర్‌నేమ్‌ మర్చిపోతే మాస్టర్‌ పాస్‌వర్డ్‌, పిన్‌ నెంబర్లు ఎంటర్‌ చేసి డేటాబేస్‌ని ఓపెన్‌ చేసి చూడొచ్చు. వాడదాం అనుకుంటే http://goo.gl/qInvoF లింక్‌ని చూడండి.
ఏవైనా ప్లే అవుతాయి!
పాటలు వినేందుకు ఎంపీ3 ప్లేయర్‌ ఏది వాడుతున్నారు? పీసీ యూజర్లు అందరూ Winamp అనే చెబుతారు. సిస్టంలో ఉన్న పాటల్ని ప్లే చేసుకునేందుకు ఇది అనువైనదే. కానీ, మీరు క్లౌడ్‌ స్టోరేజ్‌లో దాచుకున్న పాటల్ని వినాలంటే? లేదా ఆన్‌లైన్‌ మ్యూజిక్‌ అడ్డాల్లోని ఆల్బమ్స్‌ని బ్రౌజ్‌ చేసి వినాలంటే? సిస్టంలో ఇన్‌స్టాల్‌ చేసిన Winamp ప్లేయర్‌తో అసాధ్యం. మరైతే లోకల్‌ హార్డ్‌డ్రైవ్‌లు, క్లౌడ్‌స్టోరేజ్‌, నెట్టింట్లోని ఎంపీ3 ట్రాక్స్‌ని వినేందుకు అనువైన ప్లేయర్‌ లేదా? ఎందుకు లేదు... Enjoy Music Player క్రోమ్‌ ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే సరి. ఓపెన్‌ చేయగానే Local, Online, Google Drive ట్యాబ్‌ ఆప్షన్లతో కనిపిస్తుంది. ఇక సిస్టం హార్డ్‌డ్రైవ్‌ల్లో భద్రం చేసుకున్న పాటల్ని వినేందుకు 'లోకల్‌' విభాగంలోకి వెళ్లాలి. Add Music ఆప్షన్‌తో డ్రైవ్‌ల్లోని మ్యూజిక్‌ ఫోల్డర్లను జత చేయవచ్చు. ఆన్‌లైన్‌ స్థావరాల్లోని ట్రాక్స్‌ని వినేందుకు 'ఆన్‌లైన్‌' విభాగం ఉంది. నెట్టింట్లో ఎక్కువగా ఆదరణ పొందిన వాటిని Trending Music మెనూలో చూడొచ్చు. సెర్చ్‌ ద్వారా వినాలనుకునే ట్రాక్స్‌ని వెతకొచ్చు. ఇక గూగుల్‌ అందించే క్లౌడ్‌ స్టోరేజ్‌ 'గూగుల్‌ డ్రైవ్‌'లోని పాటల్ని వినేందుకు ప్రత్యేక విభాగం ఉంది. జీమెయిల్‌ ఐడీతో సైన్‌ఇన్‌ అయితే చాలు. డ్రైవ్‌లో మీరు అప్‌లోడ్‌ చేసిన అన్నీ ట్రాక్స్‌ ప్లేయర్‌లోకి వచ్చేస్తాయి. ఎప్పుడంటే అప్పుడు వినొచ్చు. అలాగే, ప్లేయర్‌లో వింటున్న ట్రాక్స్‌ని సోషల్‌ వాల్స్‌పై షేర్‌ చేయవచ్చు. మ్యూజిక్‌ ప్లేయర్‌ ఆప్‌ కోసం http://goo.gl/nQbcWJ లింక్‌లోకి వెళ్లండి.
కుంచె పడతారా?
మీకు చిత్ర లేఖనం అంటే ఇష్టమా? ఇప్పటి వరకూ సిస్టంలో ఏవైనా పెయింటింగ్‌ టూల్స్‌ని ప్రయత్నించారా? అయితే, ఒకసారి Sketchpad 3.5 ఆప్‌ని ప్రయత్నించండి. కుంచె చేతపట్టుకుని డెస్క్‌టాప్‌పైనే స్కెచ్‌ప్యాడ్‌ని క్రియేట్‌ చేసి పెట్టుకోవచ్చు. ఆప్‌ని రన్‌ చేస్తే టూల్‌బార్‌, కలర్‌ప్యాలెట్స్‌తో ఓపెన్‌ అవుతుంది. Welcome to sketchpad ద్వారా బొమ్మలు గీయడానికి ఖాళీ ప్యాడ్‌ని తీసుకోవచ్చు. Streamer మెనూతో బ్రెష్‌ స్టెల్స్‌ని వివిధ రకాల మార్పులు చేయవచ్చు. Diameter, Opacity లను కావాల్సిన పరిమాణంగా మార్చుకోవచ్చు. Spraypaint కూడా చేయవచ్చు. గీసిన బొమ్మలకు అదనంగా ఏవైనా క్లిప్‌ఆర్ట్‌లను పెట్టుకోవాలంటే Clipart మెనూలోకి వెళ్లొచ్చు. Load your own image ఆప్షన్‌తో సిస్టంలోని ఇమేజ్‌లను కూడా అప్‌లోడ్‌ చేసి పెట్టుకోవచ్చు. క్లిప్‌ఆర్ట్‌లను కూడా కావాల్సినంత 'ఒపాసిటీ'తోనే పెట్టుకోవచ్చు. అలాగే, Stamp మెనూలోకి వెళ్లి బొమ్మలు, గుర్తుల్ని పెట్టుకోవచ్చు. మొత్తం పూర్తయ్యాక డౌన్‌లోడ్‌ మెనూలోకి వెళ్లి వివిధ ఫార్మెట్‌లోకి(PNG, Jpeg, PDF... ) డ్రాయింగ్‌ని డౌన్‌లోడ్‌ చేయవచ్చు.ఒకవేళ మీరు గూగుల్‌ అందించే క్లౌడ్‌స్టోరేజ్‌ 'గూగుల్‌ డ్రైవ్‌'ని వాడుతున్నట్లయితే Export మెనూలోకి వెళ్లి డ్రాయింగ్‌ని అప్‌లోడ్‌ చేవచ్చు. డ్రాయింగ్‌ని షేర్‌ చేయాలంటే ఫేస్‌బుక్‌, జీమెయిల్‌, ట్విట్టర్‌, imgur, Tumblr, Pinterest.... లాంటి ఇతర వేదికపైనా ఎక్స్‌పోర్ట్‌ చేయవచ్చు. డ్రాయింగ్‌లో ఏదైనా టెక్స్ట్‌ మేటర్‌ని ఇన్‌సర్ట్‌ చేసేందుకు టూల్‌బార్‌లోని Text ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయండి. వాడుతున్న సిస్టం లేదా ల్యాపీకి వెబ్‌ కెమెరా ఉంటే ఫొటోలు తీసుకుని డ్రాయింగ్‌లో వాడుకోవచ్చు. కావాలంటే మెయిన్‌ మెనూలోకి వెళ్లి ప్రింట్‌ కూడా తీసుకోవచ్చు. గీసిన అన్ని చిత్రాల్ని My Projects ఫోల్డర్‌ నుంచి పొందొచ్చు. ఆప్‌ డౌన్‌లోడ్‌ కోసం http://goo.gl/CuUU3P లింక్‌ని చూడండి.
ఆడుతూ పాడుతూ...
ఇంట్లో పిల్లలు ఆడుతూ... పాడుతూ ఆంగ్లం నేర్చుకునేందుకు ఏవేవో సిస్టం సాఫ్ట్‌వేర్‌లు వెతకక్కర్లేదు. Action Story క్రోమ్‌ ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడుకోవచ్చు. ఆట రూపంలో ఆప్‌ని రూపొందించారు. ఆటలో చెప్పినట్టుగా మౌస్‌తో క్లిక్‌ చేస్తూ ఇంగ్లిష్‌ వాక్యాల్ని నేర్చుకోవచ్చు. బాబు... పాప... ఓ కుక్కతో సంభాషణల్ని రాశారు. ఆకట్టుకునే యానిమేషన్‌ గ్రాఫిక్స్‌తో పిల్లల్ని ఆకట్టుకునేలా ఆప్‌ని తీర్చిదిద్దారు. కావాలంటే http://goo.gl/brK6dH లింక్‌ని చూడండి.
తీరిక లేకుంటే...
వెబ్‌ బ్రౌజింగ్‌లో ఏవేవో చూస్తుంటాం. కొన్ని చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. కానీ, పూర్తిగా చదివేందుకు అప్పుడు తీరికుండదు. అప్పుడు ఏం చేస్తారు? ఏముందీ... బుక్‌మార్క్‌ చేస్తారు. ఎప్పుడైనా ఇలా బుక్‌మార్క్‌ పెట్టుకున్న వాటిని తీరిగ్గా చదువుదాం అనుకుంటే నెట్‌కి కనెక్ట్‌ అవ్వాల్సిందే. ఒక్కోటి బ్రౌజర్‌లో ఓపెన్‌ చేసి చూడాల్సిందే. ఇవేం లేకుండా ప్రత్యేక క్రోమ్‌ ఆప్‌ని వాడుకుని ఆఫ్‌లైన్‌లో చదువుకుంటే?Read Later Fast ఆప్‌తో సాధ్యమే. ఇన్‌స్టాల్‌ చేయగానే ఐకాన్‌ గుర్తు ఆప్‌ లాంచర్‌లోకి చేరిపోతుంది. ఓపెన్‌ చేస్తే బ్రౌజర్‌లోనే కొత్త ట్యాబ్‌లో ఆప్‌ ఖాళీగా ఓపెన్‌ అవుతుంది. ఇక మీ వెబ్‌ విహారంలో ఆసక్తిగా అనిపించిన వెబ్‌ పేజీని ఆప్‌లో పెట్టేందుకు పేజీలో రైట్‌క్లిక్‌ చేయండి. డ్రాప్‌డౌన్‌ మెనూలో Read Later మెనూ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే చాలు. వెబ్‌ పేజీ ఆప్‌లో చేరిపోతుంది. దానిపై క్లిక్‌ చేసి ఆప్‌లోనే హాయిగా చదువుకోవచ్చు. డౌన్‌లోడ్‌ కోసం http://goo.gl/b9OAdK లింక్‌లోకి వెళ్లండి.
ఈ-షాపింగ్‌ కోసం...
ఒకటా... రెండా... బొల్డన్ని ఆన్‌లైన్‌ అంగళ్లు. ఏది కొనాలన్నా క్లిక్‌కొట్టి కొనేస్తున్నారు. ఆఫర్లు, డిస్కౌంట్‌ల విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి, ఈ-షాపింగ్‌లో 'ఫ్లిప్‌కార్ట్‌' ఆన్‌లైన్‌ అంగడి గురించి తెలుసుగా? దీంట్లోకి వెళ్లి ఆఫర్లు ఏమున్నాయో చూడాలంటే? సైట్‌లోకి వెళ్లాలి... ఆఫర్ల జోన్‌లోకి వెళ్లాలి... బ్రౌజ్‌ చేసి చూడాలి. ఇంత కష్టం లేకుండా ఒకే క్లిక్కుతో ఫిప్‌కార్ట్‌లో ఆఫర్లు ఏమున్నాయో తెలుసుకుంటే? అందుకు Flipkart offers ఆప్‌ని నిక్షిప్తం చేసుకుంటే సరి. జాబితాలోని ఆప్‌పై క్లిక్‌ చేయగానే బ్రౌజర్‌లో ప్రత్యేక వెబ్‌ వేదికపై ఆఫర్‌ కూపన్లు అన్నీ వరుసగా కనిపిస్తాయి. ఒక్కోటి బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. అదే వేదిక నుంచి సరాసరి ఫ్లిప్‌కార్ట్‌ అంగట్లోకి వెళ్లొచ్చు. ఆప్‌ని పొందేందుకు http://goo.gl/3o7y6B లింక్‌లోకి వెళ్లండి.
త్రీడీలో చూడొచ్చు
మీరు రూపొందించినవో... ఇతరులు ఎవరైనా డిజైన్‌ చేసినవో... త్రీడీలో చూడాలంటే? ఆన్‌లైన్‌ సర్వీసులతోనో... అదనపు సాఫ్ట్‌వేర్‌లతోనో పని లేదు. సింపుల్‌గా 3DView ఆప్‌ని నిక్షిప్తం చేసుకుంటే సరి.ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత ఆప్‌ లాంచర్‌లోకి వెళ్లి ఐకాన్‌ గుర్తుపై క్లిక్‌ చేయగానే ఆప్‌ ఓపెన్‌ అవుతుంది. అయితే, ఈ ఆప్‌ని రన్‌ చేయడానికి మరో క్రోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ అవసరం. అదే Click to open 3D . దీన్ని బ్రౌజర్‌కి జత చేసిన తర్వాత ఆప్‌ని వాడుకోవచ్చు. త్రీడీ ప్రింటింగ్‌ ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఆప్‌ని వాడుకుని ప్రింట్‌ తీయడానికి ముందే మోడళ్లను ఎక్స్‌ప్లోర్‌ చేసి చూడొచ్చు. సిస్టం హార్డ్‌డ్రైవ్‌ల్లోని ఫైల్స్‌నే కాకుండా గూగుల్‌ డ్రైవ్‌లో ఉన్న త్రీడీ ఫైల్స్‌ని కూడా యాక్సెస్‌ చేయవచ్చు. STL, OBJ, 3DS, PLY, CTM... లాంటి మరిన్ని ఫార్మెట్‌లను ఆప్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఆప్‌ కోసం http://goo. gl/95Ox4p లింక్‌ని చూడండి.







BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

ఎన్నయినా...
అవసరం మేరకు ఒకే అప్లికేషన్‌ని ఒకటి కంటే ఎక్కువ సార్లు ఓపెన్‌ చేసి పెట్టుకోవాలంటే? అన్ని సార్లూ ఎంపిక చేసుకున్న అప్లికేషన్‌ని ప్రోగ్రామ్స్‌లోని వెళ్లే ఓపెన్‌ చేయక్కర్లేదు. ఒక్కసారి టూల్‌ని ఓపెన్‌ చేశాక టాస్క్‌బార్‌పై మినిమైజ్‌ చేయాలి. తర్వాత కీబోర్డ్‌లోని Shift మీటని నొక్కి ఉంచి టాస్క్‌బార్‌పై ఉన్న అప్లికేషన్‌పై నొక్కాలి. ఇలా ఎన్నిసార్లు నొక్కితే అన్ని సార్లు అప్లికేషన్‌ ప్రత్యేకంగా ఓపెన్‌ అవుతుంది. ఉదాహరణకు ఒకసారి ఓపెన్‌ చేసిన వర్డ్‌ప్యాడ్‌ని టాస్క్‌బార్‌పై మినిమైజ్‌ చేయండి. తర్వాత Shift మీటని నొక్కి ఉంచి తిరిగి టాస్క్‌బార్‌పై ఉన్న వర్డ్‌ప్యాడ్‌ని క్లిక్‌ చేస్తే చాలు. ఎన్ని సార్లు క్లిక్‌ చేస్తే అన్ని వర్డ్‌ప్యాడ్‌ విండోలు ఓపెన్‌ అవుతాయి.



BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

windows tips

సెలెక్ట్‌లో ఇలా...
ఫోల్డర్‌లో ఒకటి కంటే ఎక్కువ ఫైల్స్‌ ఉన్నప్పుడు వాటిల్లో కావాల్సిన వాటిని సెలక్ట్‌ చేయాలంటే? ఏముందీ... కంట్రోల్‌ మీటని నొక్కి ఉంచి ఒక్కొక్కటిగా సెలెక్ట్‌ చేస్తాం. మరింత సులువుగా సెలెక్ట్‌ చేసేందుకు ఏం చిట్కాలు లేవా? అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా? అయితే, 'పోల్డర్‌ ఆప్షన్స్‌'లోకి వెళ్లి టిప్‌ని తప్పక ప్రయత్నించాల్సిందే. ఫోల్డర్‌ ఆప్షన్స్‌ని ఓపెన్‌ చేసేందుకు రన్‌లోకివెళ్లి Folder Options ఓపెన్‌ చేయవచ్చు. వచ్చిన విండోలోని View ట్యాబ్‌పై క్లిక్‌ చేయండి. దాంట్లో కనిపించే Advanced Settings లోని Use check boxes to select items ఆప్షన్‌ని చెక్‌ చేసి 'అప్లె' చేయాలి. ఇక మీరు ఏదైనా ఫోల్డర్‌లోని ఫైల్‌పై పాయింటర్‌ ఉంచితే చాలు చెక్‌ బాక్స్‌ కనిపిస్తుంది. ఇంకేముందీ... ఫైల్‌ని సెలెక్ట్‌ చేయాలంటే ఫైల్‌ పేరు ముందు కనిపించే చెక్‌బాక్స్‌ని సెలెక్ట్‌ చేస్తే సరిపోతుంది. ఇలా ఎన్ని ఫైల్స్‌ని అయినా చెక్‌బాక్స్‌లతో సులువుగా సెలెక్ట్‌ చేసుకోవచ్చు.








BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

అన్నీ పీసీ నుంచే...
పేరు: Getpushline
ప్రయోజనం: ఫోన్‌కి వచ్చే మెసేజ్‌లు, కాల్స్‌, ఇతర నోటిఫికేషన్స్‌ని పీపీ, ల్యాపీ, మ్యాక్‌ల నుంచే మేనేజ్‌ చేయవచ్చు. సర్వీసుని వాడదాం అనుకుంటే ఫోన్‌, పీసీలో ఇన్‌స్టాల్‌ చేయాలి. పీసీలో ఎక్స్‌టెన్షన్‌ రూపంలో ఒదిగిపోతుంది. క్రోమ్‌ వాడుతున్నట్లయితే క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌ నుంచి బ్రౌజర్‌కి జత చేయవచ్చు. అడ్రస్‌బార్‌ పక్కనే ఐకాన్‌ రూపంలో పుష్‌లైన్‌ కనిపిస్తుంది. ఇక ఆండ్రాయిడ్‌ యూజర్లు ఆప్‌ రూపంలో ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేయవచ్చు. ఆప్‌ని రన్‌ చేస్తే ప్రత్యేక కోడ్‌ వస్తుంది. ఇప్పుడు బ్రౌజర్‌లోని Pair your device బటన్‌పై క్లిక్‌ చేసి వచ్చిన బాక్స్‌లో కోడ్‌ ఎంటర్‌ Go బటన్‌ని నొక్కితే చాలు. ఫోన్‌, పీసీ ఒక్కటే కలిసి పని చేస్తాయి. ఇక మీరు ఫోన్‌కి ఏదైనా మెసేజ్‌ వస్తే బ్రౌజర్‌లోనే నోటిఫికేషన్‌ని చూడొచ్చు. అక్కడ నుంచే ప్రతి స్పందనని తెలపొచ్చు. ఇదే మాదిరిగా కాల్స్‌ కూడా. ఫోన్‌ని ఎక్కడైనా మర్చిపోయినా... ఎవరైనా దొంగిలించినా పుష్‌లైన్‌ సర్వీసు ద్వారా ఎక్కడుందో చూడొచ్చు.
ఫోన్‌లోని మొత్తం కాంటాక్ట్‌లను పీసీలోకి సింక్‌ చేయవచ్చు.
లింక్‌: www.getpushline.com





BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

బ్లాక్‌ చేయవచ్చు
ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నారు. వచ్చే కాల్స్‌, మెసేజ్‌లు మిమ్మల్ని అసహనానికి గురి చేస్తున్నాయి. వాటిని బ్లాక్‌ చేయడం ఆండ్రాయిడ్‌ 5.0 లాలీపాప్‌ ఓఎస్‌ వెర్షన్‌లో అయితే సాధ్యమే. ఆప్షన్‌ ఎక్కడ ఉందబ్బా అనేగా? సెట్టింగ్స్‌లోకి వెళ్లి Sound and Notification మెనూలోకి వెళ్లాలి. అక్కడ కనిపించే Interruptions మెనూని సెలెక్ట్‌ చేసి బ్లాక్‌ చేయవచ్చు.

BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

ఆటోమాటిక్‌గా అన్‌లాక్‌
ఫోన్‌ని ఇతరులు వాడకుండా సెక్యూరిటీ నిమిత్తం PIN, Pattern లాక్‌లు పెట్టుకుంటాం. ఎప్పుడైనా... ఫోన్‌కి ఎలాంటి నోటిఫికేషన్‌ వచ్చినా... పాస్‌వర్డ్‌ని ఎంటర్‌ చేస్తేగానీ ఫోన్‌ని వాడలేని పరిస్థితి. మీకేమో అన్నిసార్లూ ఫోన్‌ని అన్‌లాక్‌ చేయడం ఇబ్బందిగా అనిపిస్తోంది. అందుకే మీ ఫోన్‌ సురక్షితం అనుకున్న చోట ఫోన్‌ ఆటోమాటిక్‌గా అన్‌లాక్‌ అయిపోతే! అదెలా సాధ్యం అంటే... మీరు ఆండ్రాయిడ్‌ 5.0 ఆపై వెర్షన్‌ ఓఎస్‌తో ఫోన్‌ని వాడుతున్నట్లయితే ‘స్మార్ట్‌ లాక్‌’ సదుపాయాన్ని వాడుకోవచ్చు. ఈ సర్వీసుని ఎనేబుల్‌ చేసి ఫోన్‌ సురక్షితం అనుకున్న చోట (ఇల్లు, ఆఫీస్‌) ఫోన్‌ని ఆటోమాటిక్‌గా ఆన్‌లాక్‌ అయ్యేలా చేయవచ్చు. సెట్టింగ్స్‌లోని ‘సెక్యూరిటీ’ మెనూలోకి సర్వీసుని ఎనేబుల్‌ చేయాలి. ఫోన్‌ జీపీఎస్‌ సెన్సర్‌ ద్వారా మీరు ఎంపిక చేసిన లొకేషన్స్‌ని ఫోన్‌ గుర్తించి పని చేస్తుంది.

BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

ఆప్స్‌ చిట్టా...
ఆండ్రాయిడ్‌లో ఏం చేసినా జీమెయిల్‌తోనే. మరి, మీ స్మార్ట్‌ ఫోన్‌ని కొన్నప్పటి నుంచి ఏమేం ఆప్స్‌ని ఇన్‌స్టాల్‌ చేశారో మొత్తం చిట్టాని చూడాలంటే? బ్రౌజర్‌లో అయితే గూగుల్‌ ప్లేలోకి లాగిన్‌ అయ్యాక మెయిన్‌ మెనూలోని My apps ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. మొత్తం థంబ్‌నెయిల్‌ ఐకాన్స్‌తో జాబితాగా కనిపిస్తాయి. ఒకవేళ ఫోన్‌లోనే చూద్దాం అనుకుంటే గూగుల్‌ ప్లే హోం మెనూలోని My apps & games ఆప్షన్‌ని తాకి All విభాగంలోకి వెళ్లి చూడండి. ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసిన ఆప్స్‌ సంగతి సరే! కొనుగోలు చేసి పొందిన వాటిని చూడాలంటే ఎలా? అనే సందేహం అక్కర్లేదు. My Paid Apps ఆప్‌ని ప్రయత్నించొచ్చు. గూగుల్‌ ప్లే నుంచి కొనుగోలు చేసి వాడుతున్న అన్ని విభాగాలకు సంబంధించిన వాటిని బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.glPrD3F


BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

సైలెంట్‌ మోడ్‌లో ఉన్నా...
ముఖ్యమైన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఫోన్‌ని సైలెంట్‌ మోడ్‌లో పెట్టేశారు. ఆ విషయాన్ని మర్చిపోయి ఫోన్‌ని పని చేసే చోటే ఎక్కడో వదిలేశారు. స్నేహితుడి ఫోన్‌ నుంచి కాల్‌ చేస్తే సైలెంట్‌ మోడ్‌లో ఉండడం వల్ల రింగ్‌ వినిపించడం లేదు. అలాంటప్పుడు ఫోన్‌ ఎక్కడుందో తెలుసుకోవడం ఎలాగంటే... ‘ఆండ్రాయిడ్‌ డివైజ్‌ మేనేజర్‌’ సేవల్ని వాడుకుంటే సరి. ఫోన్‌ ఎక్కడుందో తెలుసుకోడమే కాదు. ఇతరులు వాడకుండా తాళం వేయవచ్చు. ముఖ్యమైన డేటా ఏదైనా ఉంటే ఇతరుల కంటపడకుండా చెరిపేయొచ్చు. కేవలం ఫోన్‌ని రింగ్‌ చేసి చూద్దాం అనుకుంటే వెబ్‌ బ్రౌజర్‌ని ఓపెన్‌ చేయండి. అడ్రస్‌బార్‌లో Find my phone కమాండ్‌ని టైప్‌ చేసి ఎంటర్‌ నొక్కండి. తర్వాత మీరు వాడుతున్న జీమెయిల్‌ ఎకౌంట్‌ వివరాలతో లాగిన్‌ అయితే... ఫోన్‌ మోడల్‌, ఉన్న లొకేషన్‌ వివరాలు వచ్చేస్తాయి. ఫోన్‌ని రింగ్‌ అయ్యేలా చేసి ఎక్కడుందో తెలుసుకునేందుకు Ring ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే చాలు. సైలెంట్‌ మోడ్‌లో ఉన్న ఫోన్‌ కూడా రింగ్‌ అవుతుంది. ఒకవేళ ఫోన్‌ని పోగొట్టుకుంటే https://www.google.com/android/devicemanager లింక్‌లోకి వెళ్లి మ్యాప్‌పై లొకేషన్‌ని చూడొచ్చు. ఫోన్‌ని Lock, Erase చేయవచ్చు కూడా.

BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

లాక్‌ తీసినప్పటికీ...
చుట్టూ ఎవరో ఒకరు ఉంటారు. స్మార్ట్‌గా ఫోన్‌ కనిపిస్తే చాలు... ఓ సారి ఇలా ఇమ్మంటారు. తాళం వేసి ఉంటే అన్‌లాక్‌ చేయమంటారు. మీరు పక్కన ఉండగానే అన్నీ చూస్తుంటారు. ముందే ఫోన్‌లోని గ్యాలరీలు, ముఖ్యమైన ఫోల్డర్లను లాక్‌ చేసుండడంతో మీరేం కంగారు పడరు. కానీ, వాట్స్‌ఆప్‌, ఫేస్‌బుక్‌, టెలిగ్రామ్‌... లాంటి మెసెంజర్‌ ఆప్స్‌ నుంచి ఏదైనా ముఖ్యమైన నోటిఫికేషన్‌ అప్పుడే వస్తే! అది వారి కంటపడకుండా ఉండాలంటే? అందుకో చిట్కా ఉంది. సెట్టింగ్స్‌లోని Sound and Notifications మెనూలోకి వెళ్లాలి. అక్కడి మెనూ జాబితాలోని When device is unlocked ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేసి Hide Sensitive notification content లేదా Don't show notifications at all ఆప్షన్స్‌లో ఏదొకటి సెలెక్ట్‌ చేసి కంటపడకుండా చేయవచ్చు.

BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

హార్డ్‌వేర్‌ మాటేంటి?
వాడుతున్న స్మార్ట్‌ ఫోన్‌ ఎలా పని చేస్తోంది? ప్రాసెసింగ్‌ వేగం నెమ్మదించినట్టుగా అనిపిస్తోందా? హార్డ్‌వేర్‌ పని తీరుపై ఓ కన్నేద్దాం అనుకుంటే చిట్కా ఏంటి? ప్రత్యేక ఆప్‌ ఒకటి ఉంది. పేరు Phone Tester. ఇన్‌స్టాల్‌ చేసి రన్‌ చేస్తే చాలు. చిట్టా మొత్తం తెరపై ప్రత్యక్షమవుతుంది. ఫోన్‌ సెన్సర్లు, నెట్‌వర్క్‌, జీపీఎస్‌, బ్యాటరీ, కెమెరా, సిస్టం సమాచారం మొత్తాన్ని చూపిస్తుంది. బ్యాటరీ సామర్థ్యం ఏ మేరకు ఉందో చెక్‌ చేసి చూడొచ్చు. డ్యూయల్‌ కెమెరాల మొత్తం స్పెసిఫికేషన్స్‌ని చూడొచ్చు.


BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

దేంట్లోనైనా ‘జూమ్‌ఇన్‌’
రెండు వేళ్లతో లాగుతూ... రెండు సార్లు తెరపై ట్యాప్‌ చేస్తూ జూమ్‌ఇన్‌ చేస్తుంటారు. అలాగే, బిల్ట్‌ఇన్‌గా ఉన్న జూమ్‌ ఆప్షన్స్‌తో టెక్స్ట్‌ని పరిమాణాన్ని పెంచుకోవచ్చు. కానీ, బ్రౌజింగ్‌ చేస్తున్నప్పుడో లేదా ఏదైనా ఆప్‌ని వాడుతున్నప్పుడో తెరపై ఉన్న వాటిని జూమ్‌ఇన్‌ చేసుకుని చూడాలంటే Magnification Gestures మార్చుకోవచ్చు. అందుకు ఎలాంటి థర్డ్‌పార్టీ అప్లికేషన్స్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్క్రీన్‌షార్ట్‌ తీసుకోవాల్సిన పని లేదు. సింపుల్‌గా ఆండ్రాయిడ్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి చాలు. అక్కడ కనిపించే Accessibility మెనూలోకి వెళ్తే Magnification Gestures ఆప్షన్‌ కనిపిస్తుంది. ఆఫ్‌లో ఉన్న ఆప్షన్‌ని ‘ఆన్‌’ చేస్తే చాలు. మూడు సార్లు వరుసగా తెరపై ట్యాప్‌ చేస్తే కంటెంట్‌ ఏదైనా జూమ్‌ఇన్‌ అవుతుంది. ఇలా జూమ్‌ఇన్‌ అయ్యాక మరింత జూమ్‌ఇన్‌ చేయాలనుకుంటే ఎప్పటిలానే రెండు వేళ్లతో నొక్కి సాగదీయొచ్చు. జూమ్‌ఇన్‌ చేసిన మొత్తాన్ని జరుపుతూ కావాల్సిన భాగాన్ని చూద్దాం అనుకుంటే రెండు వేళ్లతో తెరపై నొక్కి ఉంచి జరిపితే సరి. అవసరం తీరాక ఈ సౌకర్యాన్ని డిసేబుల్‌ చేయాలంటే ‘ఆఫ్‌’ చేస్తే చాలు.


BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

చదివి వినిపిస్తుంది
చేతిలో ఫోన్‌ ఉన్నప్పుడు అన్నీ చూస్తాం... వెంటనే స్పందిస్తాం. కానీ, ప్రయాణాల్లో ఉన్నప్పుడైతే! అంటే... కారు లేదా బైక్‌ నడుపుతున్నప్పుడు మాటేంటి? ఫోన్‌కి వచ్చిన ముఖ్యమైన మెసేజ్‌లు, నోటిఫికేషన్స్‌ చూడాలంటే ఎలా? ఏముందీ... ఫోనే చదివి వినిపిస్తుంది. ఎలా సాధ్యం అంటే... అందుకు తగిన ఆప్స్‌ గూగుల్‌ ప్లేలో సిద్ధంగా ఉన్నాయి. ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చాలు. మీరు ఎంపిక చేసిన వాటి నుంచి వచ్చే మెసేజ్‌లు, నోటిఫికేషన్స్‌ని ఫోనే చదివి వినిపిస్తుంది. ఫోన్‌ రింగ్‌ అవుతున్నప్పుడే ఫోన్‌ చేస్తున్న వ్యక్తి పేరుని పలుకుతుంది. ఎవరైనా మిస్డ్‌కాల్‌ చేస్తే ఆ వ్యక్తి ఎవరో కూడా చెబుతుంది. ఫోన్‌ నెంబర్‌కి వచ్చే టెక్స్ట్‌ మెసేజ్‌లను చదివి వినిపిస్తుంది. కావాలంటే Voice Notification: Shouter ఆప్‌ని ప్రయత్నించండి. ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత ఆప్‌ సేవల్ని ‘ఎనేబుల్‌’ చేయాలి. ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసిన ఏయే ఆప్స్‌ నుంచి వచ్చే నోటిఫికేషన్స్‌ని చదివి వినిపించాలనేది కూడా మీరే నిర్ణయించొచ్చు. అందుకు Select apps విభాగం ఉంది. అన్ని వేళల్లో కాకుండా మీరు నిర్ణయించిన సమయంలోనే చదివి వినిపించేలా షెడ్యూల్‌ చేయవచ్చు. ముఖ్యమైన సర్వీసుల నుంచి వచ్చే నోటిఫికేషన్స్‌ని రెండు సార్లు చదివేలా ఆప్షన్‌ని సెట్‌ చేసుకునే వీలుంది. ఆప్‌ని వాడి చూద్దాం అనుకుంటే https://goo.gl/8RVYNN లింక్‌లోకి వెళ్లండి.
* ఇలాంటిదే మరోటి ప్రయత్నిద్దాం అనుకుంటే ReadItToMe ఉంది. చదివితే వినడం ఒక్కటే కాదు. మాట్లాడుతూనే (వాయిస్‌ రిప్లె) మీ స్పందన తెలపొచ్చు. డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/HHxWix

Feb 22, 2016

ఫొటోలు, వీడియోలు, వాయిస్‌ ఫైల్స్‌... ఇలా చాలానే షేర్‌ చేస్తుంటాం. ఇతరులు షేర్‌ చేసిన వాటిని డౌన్‌లోడ్‌ చేసి చూస్తుంటాం. ఇవన్నీ వివిధ ఫోల్డర్లలో నిక్షిప్తమై ఉంటాయి. వాటన్నింటినీ ఒకేచోట బ్రౌజ్‌ చేసుకుని చూడడం... అక్కర్లేని వాటిని తొలగించడం... లాంటి మరిన్ని పనుల్ని WhatsCleaner థర్డ్‌పార్టీ ఆప్‌తో చేయవచ్చు తెలుసా? దీంతో ఒకేపేరుతో గ్యాలరీలో సేవ్‌ అయిన డూప్లికేట్‌ ఫైల్స్‌ని చిటికెలో వెతికి పట్టుకోవచ్చు. వాట్స్‌ఆప్‌ తీసుకున్న డేటా స్టోరేజ్‌ని గ్రాఫ్‌ రూపంలో చూడొచ్చు.


BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

ఇతరులు ఎవరైనా ఫోన్‌ తీసుకుంటే గతంలో ఇన్‌బాక్స్‌పై కన్నేసేందుకు ఆసక్తి చూపించేవారు. కానీ, ఇప్పుడు అంతా వాట్స్‌ఆప్‌లోనే. మరి, మీ వాట్స్‌ఆప్‌ ఇతరులు ఓపెన్‌ చేయకుండా ఉండేందుకు మీరెలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారు? ఫోన్‌ని పెట్టుకున్నట్టుగానే వాట్స్‌ఆప్‌కి ఏదైనా తాళం పెట్టుకుంటే బాగుంటుంది కదూ! అయితే, whatsapp Lock థర్డ్‌పార్టీ ఆప్‌ని ప్రయత్నించండి. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకుని Password Lock లేదా Pattern Lock ఆప్షన్స్‌తో తాళం వేయవచ్చు. ఆప్‌ డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/6ok4ux

ఫైల్‌ ఫార్మెట్‌లను మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంటుంది. అప్పుడు ఉచిత కన్వర్టర్‌లను వాడొచ్చు. ఏవైనా పీడీఎఫ్‌ ఫైల్స్‌ని వర్డ్‌ ఫైల్స్‌గానో... టెక్ట్స్‌ ఫైల్స్‌గానో మార్చాలనుకుంటే PDFMate PDF Converter Free టూల్‌ని వాడొచ్చు. ఇన్‌స్టాల్‌ చేశాక మార్చాల్సిన ఫైల్‌ని ఎంపిక చేసుకుని అవుట్‌పుట్‌ ఫార్మెట్‌ని సెలెక్ట్‌ చేసుకోవాలి. కన్వర్ట్‌ చేయడమే కాకుండా రెండు పీడీఎఫ్‌ ఫైల్స్‌ని ఒక్కటిగా చేయవచ్చు కూడా. కావాలంటే http://goo.gl/Vr6xKl లింక్‌లోకి వెళ్లండి.
* ఎక్కువ మెమొరీతో కూడిన ఎంపీ3 ఫైల్స్‌ని వాటి నాణ్యత తగ్గకుండా ఫైల్‌ సైజుని తగ్గించొచ్చు. అందుకు Mp3 Quality Modifier టూల్‌ని వాడొచ్చు. http://goo.gl/O3bV6h
* ఏఏసీ, ఎం4బీ, ఎం4ఏ ఫైల్స్‌ని ఎంపీ3 లేదా డబ్ల్యూఏవీ ఫైల్స్‌గా మార్చుకునేందుకు Free M4a to Mp3 Converter సిద్ధంగా ఉంది. http://goo.gl/r0BPtC
* ఆడియో, వీడియో, ఇమేజ్‌ ఫైల్స్‌ని మీకు కావాల్సిన ఫార్మెట్‌లోకి మార్చుకునేందుకు FormatFactory టూల్‌ని వాడొచ్చు. వీడియో, డౌన్‌లోడ్‌ కోసం http://goo.gl/TLr1vd లింక్‌లోకి వెళ్లండి.




BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

మీకు తెలుసా?
సంక్షిప్త పదాలకు పూర్తి రూపం తెలుసుకోవాలా? అయితే, www.acronymfinder.comను చూస్తే సరి. దీంట్లోని సెర్చ్‌బాక్స్‌లో సంక్షిప్త రూపాన్ని టైప్‌ చేసి findపై క్లిక్‌ చేస్తేచాలు. మీరు ఎంచుకున్న పదంతో సంబంధం ఉన్న అన్ని రూపాల్ని చూపిస్తుంది.


BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

తెలివైన గురి!
యుద్ధాలు... ఫైరింగ్‌లు... రేస్‌లు... రక్తపాతాలు... ఇలాంటి గేమ్స్‌ని క్లోజ్‌ చేసి కాసేపు బుర్రకు పదును పెట్టే గేమ్‌ ఆడదామా? పేరు Deepica. గేమ్‌లో కనిపించే ఏవైనా మూడు రంగులు కలిసిన వాటిని గురి చూసి కొట్టాలి. ఆటలో ట్విస్ట్‌ ఏంటంటే బాల్స్‌ గుండ్రంగా తిరుగుతూ కనిపిస్తాయి. ఆ కదులుతున్న వాటిల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ రంగుతో కలిసున్న వాటిని చూస్తూ ఆడాలి. మొత్తం ఆరు లెవల్స్‌ ఉన్నాయి. బాల్స్‌లో ఏర్పాటు చేసిన బాంబుల్ని పేల్చడం ద్వారా మరింత స్కోర్‌ సాధించొచ్చు. ఇది డౌన్‌లోడ్‌ చేసి ఆడుకునే గేమ్‌. తక్కువ మెమొరీతో ఎలాంటి అదనపు అప్లికేషన్లు లేకుండా ప్లే అవుతుంది. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://goo.gl/Hsrnz

సాఫ్ట్‌వేర్‌ అక్కర్లేదు
కొన్నిసార్లు ఫైల్‌ ఫార్మెట్‌ని మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాంటప్పుడు సిస్టంలో సాఫ్ట్‌వేర్‌లనే ఇన్‌స్టాల్‌ చేయక్కర్లేదు. ఉచితంగా ఆన్‌లైన్‌లోనే చేయవచ్చు. కావాలంటే https://cloudconvert.org వెబ్‌ సర్వీసులోకి వెళ్లండి. సుమారు 178 ఫార్మెట్‌లను సైట్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఆడియో, వీడియో, డాక్యుమెంట్‌, ఫొటోలు, స్ప్రెడ్‌షీట్‌లు, ప్రజంటేషన్స్‌, ఈ-బుక్స్‌... ఏదైనా దీంట్లోకి అప్‌లోడ్‌ చేసి కన్వర్ట్‌ చేయవచ్చు. డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ పద్ధతిలో ఫైల్స్‌ని అప్‌లోడ్‌ చేయవచ్చు. కన్వర్ట్‌ చేసిన ఫైల్స్‌ని మెయిల్‌కి వచ్చేలా చేయవచ్చు. అందుకు Mail me when it is finishedఆప్షన్ని సెలెక్ట్‌ చేయండి. ఒకవేళ మీరు క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీసుల్ని వాడుతున్నట్లయితే 'డ్రాప్‌బాక్స్‌', 'గూగుల్‌ డ్రైవ్‌'లను సపోర్ట్‌ చేస్తుంది. అంటే... కన్వర్ట్‌ చేసిన ఫైల్స్‌ని సరాసరి డ్రాప్‌బాక్స్‌, గూగుల్‌ డ్రైవ్‌ల్లోకి చేరేలా చేయవచ్చు. అందుకు Send it into my Dropbox, Google Drive ఆప్షన్ని చెక్‌ చేయాలి.


BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

Hopeless

చిమ్మ చీకట్లో ఆట!
ఒక్కసారి వూహించండి... అదో వీడియో గేమ్‌. కారు చీకట్లో... ఒక్కడే బిక్కు బిక్కుమంటూ చూస్తుంటాడు. ఏవేవో భయంకరమైన అరుపులు. చిత్ర విచిత్రమైన శబ్దాలు. ఎటు వైపు నుంచి ఏం వస్తాయో అని టెన్షన్‌. ఇంతలోపే దయ్యాల గుంపు. సరాసరి అతనిపైకి వచ్చేస్తాయి! దాడి చేస్తాయి! అప్పుడు అతను ఏం చేస్తాడు? మీ సాయం కోరతాడు. అప్పుడు మీరు సింపుల్‌గా అతని చేతిలోని తుపాకీతో ఎదురు దాడికి దిగాలి. కాల్చి బూడిద చేయాలి. దీంతో బోల్డంత స్కోరు. ఇంతకీ ఇది ఏం ఆట అనేగా మీ సందేహం. పేరు Hopeless: The Dark Cave. బుల్లి తెరపై ఆట భలే సరదా ఉంటుంది. ఆకట్టుకునే గ్రాఫిక్స్‌... అమ్మో అనిపించే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌. దయ్యాలపై దాడికి సిద్ధంగా ఉండాలి. మిమ్మల్ని సమీపించే లోపే వాటిని కాల్చి పారేయాలి. ఆటలో రివార్డ్‌ పాయింట్స్‌ కూడా ఉంటాయి. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోండి.
* యాపిల్‌ ఉత్పత్తుల్ని వాడుతున్నట్లయితే ఐట్యూన్స్‌ నుంచి ఆటని పొందొచ్చు


BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

Telugu Calendar

తెలుగులోనే!
ఫలానా పండగ ఎప్పుడు వచ్చింది? ఈ రోజు నక్షత్రం, తిధి ఏంటి? రాహు కాలం ఎప్పుడు?... లాంటి విషయాలు తెలియాలంటే తెలుగు క్యాలెండర్‌ ఎక్కడుందా అని వెతకక్కర్లేదు. సింపుల్‌గా చేతిలోకి స్మార్ట్‌ మొబైల్‌ తీసుకోండి. ఆండ్రాయిడ్‌ స్టోర్‌లోకి వెళ్లి Telugu Calendar ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి. రాహుకాలం, యమగండం ఎప్పుడో తెలుసుకోవచ్చు.


BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

వీడియో... ఆడియో
యూట్యూబ్‌లో కాలక్షేపానికి వీడియోలు చూస్తుంటాం. వాటిల్లో కొన్ని వీడియోలు బాగా నచ్చుతాయి. ఉదాహరణకు పాటలు. మరి, మీకు నచ్చిన పాటని యూట్యూబ్‌ నుంచి సరాసరి డౌన్‌లోడ్‌ చేసుకుంటే? ఏదైనా సాఫ్ట్‌వేర్‌ వాడాలేమో అనుకునేరు. ఏం అక్కర్లేదు. మీరు ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌ వాడుతున్నట్లయితే యాడ్‌ఆన్‌ రూపంలో Youtube Video and Audio Downloader సర్వీసుని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చాలు. ఇక మీరు వీక్షించే వీడియోల కింది భాగంలో Downloadఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి కావాల్సిన ఫార్మెట్‌లో ఆడియో, వీడియో ఫైల్స్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎంపీ4, ఎఫ్‌ఎల్‌వీ, 3జీపీ ఫార్మెట్‌ల్లో వీడియోలను వివిధ పిక్సల్స్‌ క్వాలిటీతో పొందొచ్చు. డౌన్‌లోడ్‌ చేసిన వాటిని ఫార్మెట్‌ని కూడా యాడ్‌ఆన్‌తో మార్చుకోవచ్చు

BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

నచ్చిన పాటలు ఒకే దగ్గర..
యూట్యూబ్‌లో మీకు నచ్చిన పాటలను వెతుక్కోవడం కొంచెం కష్టమే. సెర్చ్‌లోకి వెళ్లి వెతికే అవకాశమున్నప్పటికీ అందులో అన్నీ గంపగుత్తగా వచ్చి చేరుతాయి. పాటలను వినాలనుకునేవారికి సౌలభ్యంగా ఉండటానికి యూట్యూబ్‌ కొత్త ఆప్షన్‌ను తెచ్చి పెట్టింది. అందులోకెళ్తే ప్రపంచ సంగీతంలో పాటలు ఉంటాయి. సినిమా, గాయకుడు, సంగీత దర్శకుడు... ఇలా వివిధ విభాగాలు ప్లే లిస్ట్‌ రూపంలో ఉంటాయి. ఒక్కో ప్లేలిస్ట్‌లో 10 నుంచి 15 పాటలుంటాయి. అలా గంటపాటు నాన్‌స్టాప్‌ పాటలను వినే, చూసే అవకాశం సులభంగా దొరుకుతుంది.


BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

నీళ్లపై దూసుకెళ్లండి
ఎప్పుడూ బైకులు... కార్లు... విమానాలు... ఏం నడుపుతారు. కాసేపు స్పీడ్‌బోట్‌ నడపండి. దాంట్లో ఏముందీ సోలోగానేగా అనుకునేరు. అదో పడవల పోటీ. ఆటేంటో తెలుసా? Boat Racing. ఆకట్టుకునే గ్రాఫిక్స్‌తో నీళ్లపై రేస్‌ని రూపొందించారు. పోటీ పడే కాలువల్ని 8 రకాల నేపథ్యాల్లో రూపొందించారు. ఉదాహరణకు మీకు ద్వీప సముదాయంలో పోటీ పడాలనుకుంటే Islands సెలెక్ట్‌ చేయవచ్చు. ఒకవేళ పర్వతాల మధ్య ప్రవహించే నదిలో పోటీ పడాలనుకుంటే Mountain మోడ్‌ ఉంది. పడవల్ని మీకు నచ్చినట్టుగా మార్పులు చేయవచ్చు. Single Race, Championship, Free మోడ్స్‌ ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం... ఆడేద్దాం అనుకుంటే http://goo.gl/mr9Ww8 లింక్‌లోకి వెళ్లండి.

పెంగ్విన్‌తో పాటు...
సరదాగా కాసేపు మంచు పర్వాతాల్లో విహరిద్దాం అనుకుంటే ఈ పెంగ్విన్‌కి తోడుగా మీరు వెళ్లండి. ఎందుకంటే ఇది మంచు పర్వతాలపై స్కేటింగ్‌ చేస్తుంది. దానికి మీరు సాయం చేయాలన్నమాట. ఆటేంటో తెలుసా? Club Penguin Sled Racer. డిస్నీ సంస్థ ఆటని రూపొందించింది. ఇన్‌స్టాల్‌ చేసి రన్‌ చేయగానే అన్ని హంగులతో పెంగ్విన్‌ సిద్ధంగా ఉంటుంది. మీ సాయంతో పెంగ్విన్‌ ఎంత దూరం ప్రయాణం చేయగలితే అంత స్కోర్‌ మీరు సాధించినట్టు. పెంగ్విన్‌ ఏ దిశగా ప్రయాణించాలనేది తెరపై కంట్రోల్స్‌తో మీరు నిర్దేశించొచ్చు. ఏముందిలే... నిదానమే ప్రధానం అనుకుంటూ వెళ్లొచ్చు అనుకుంటే పోరబాటే. ఎతైన మంచు పర్వతాలపై నుంచి పెంగ్విన్‌ మెరుపు వేగంతో దూసుకుపోతుంది. ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా పెంగ్విన్‌ ప్రాణం పోయినట్టే. దార్లో పవర్‌ ప్యాక్స్‌ని తీసుకుని దూసుకెళ్లొచ్చు. Parachute పవర్‌ ప్యాక్‌తో కాసేపు గాల్లో ఎగురుతూ ప్రయాణించొచ్చు. Tube Wax, Toot Blaster, Revive... లాంటి మరిన్ని పవర్‌ ప్యాక్స్‌ని వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా పొందొచ్చు


BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

అన్నీ ఒకే చోట
నెట్‌ బ్రౌజింగ్‌లో ఏవేవో చూస్తుంటాం. కొన్ని సైట్‌లు ఆసక్తికరంగా అనిపిస్తాయి. అలాంటి వెబ్‌ పేజీలను తీరిగ్గా చదువుదాం అనుకుంటారు. వీడియోలనూ తర్వాత చూద్దాంలే అనుకుంటారు... ఇలా అనుకున్న వాటిని ఓ స్థావరంగా పెట్టుకుని సులువుగా మేనేజ్‌ చేసుకుందాం అనుకుంటే? http://feedly.com సైట్‌లోకి వెళ్లండి. నెట్టింట్లో చదివే అన్ని వార్తాంశాలు, వారపత్రికలు, బ్లాగుల్లోని వ్యాసాల్ని గుత్తగా సైట్‌లో పెట్టుకుని తీరిగ్గా బ్రౌజ్‌ చేయవచ్చు. హోం పేజీలోని 'ఎక్స్‌ప్లోర్‌' ద్వారా వివిధ రంగాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ని బ్రౌజ్‌ చేయవచ్చు. సెర్చ్‌ ద్వారా కావాల్సిన అంశం అప్‌డేట్స్‌ని వెతకొచ్చు. సైట్‌లో సభ్యులై ఇతరుల స్థావరాల్ని యాక్సెస్‌ చేయవచ్చు. నచ్చిన అప్‌డేట్స్‌ని సోషల్‌ నెట్‌వర్క్‌ వాల్స్‌పై పోస్ట్‌ చేసే వీలుంది. కంప్యూటర్‌లోనే కాదు. ఫోన్‌, ట్యాబ్‌, ల్యాపీల్లోకి సింక్‌ చేసుకుని అన్నింటిలోనూ వాడుకోవచ్చు.


BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

తెలుగులోనే...
అన్నీ స్మార్ట్‌ మొబైల్‌ నుంచే. మెసేజ్‌లు, మెయిల్స్‌, ఛాటింగ్‌లు... ఇలా అన్నీ ఇంగ్లిష్‌లోనేనా? తెలుగులోనూ చేస్తే! అదెలా తెలుగులో టైపింగ్‌? అనే సందేహం అక్కర్లేదు. మీరు వాడుతున్న ఆండ్రాయిడ్‌ ఆప్‌లో Just Telugu Keyboard ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత ఆప్‌లోకి వెళ్లి టైపింగ్‌ ఎలా చేయాలో తెలుసుకోవచ్చు. ఆప్‌ని సెట్‌అప్‌ చేసుకునే విధానం, కీబోర్డ్‌ లేఅవుట్‌, టైపింగ్‌ చిట్కాల్ని చూడొచ్చు. తెలుగు కీబోర్డ్‌నే డీఫాల్ట్‌ ఇన్‌పుట్‌ కీబోర్డ్‌గా సెట్‌ చేసుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా తిరిగి ఆండ్రాయిడ్‌ కీబోర్డ్‌ని పొందాలంటే టైపింగ్‌ విండోలోకి వెళ్లగానే తెర పై భాగంలో కీబోర్డ్‌ గుర్తు కనిపిస్తుంది. అదే Choose input method. దాంట్లోని English Google కీబోర్డ్‌ని సెలెక్ట్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు ఆప్‌ని గూగుల్‌ ప్లే నుంచి పొందొచ్చు

BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

ప్లంబర్‌ పనే!
ఎప్పుడూ రేస్‌లు, రైడ్‌లు, ఫైట్‌లేనా? కాసేపు బుర్రకు పదును పెట్టే పజిల్‌ గేమ్‌ ఆడండి. అదీ బుల్లి తెరపై. ఆటేంటో తెలుసా? Plumber 2. పేరుకి తగ్గట్టుగానే తెరపై ముక్కలు ముక్కలుగా పైపులు ఉంటాయి. ఒకవైపు నీళ్లతో నిండిన పెద్ద పైపు ఉంటుంది. మరో వైపు అదే పరిమాణంలో ఖాళీ పైపు ఉంటుంది. ఆ రెండిటికి మధ్య ఉన్న చిన్న చిన్న పైపు ముక్కల్ని కలుపుతూ నీళ్లని మరో పైపులోకి ప్రవహించేలా చేయాలి. మీరు ఏ మాత్రం పైపుల్ని తప్పుగా బిగించినా ఆట అటకెక్కినట్టే. ఆటలో మరో విషయం ఏంటంటే... పైపుల్లో కొన్ని క్రిములు ఉంటాయి. అవి ఉన్న పైపుల్ని అనుసంధానం చేసి నీళ్లు వెళ్లేలా చేస్తే అదనపు స్కోర్‌ వస్తుంది. ఆటలో మొత్తం 1,000 లెవల్స్‌ ఉన్నాయి. లెవల్‌ మారుతున్న కొద్దీ బుర్రకు ఎక్కువ పని పెట్టాల్సి వస్తుంది. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి పొందొచ్చు.



BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

బుల్లెట్‌ దిగాల్సిందే!
మీరో సైనికుడు... సోలోగా పోరాడాలి... గురి తప్పకుండా ఒక్కొక్కర్ని మట్టుబెడుతూ శత్రు స్థావరాల్లోకి గుట్టు చప్పుడు కాకుండా దూసుకెళ్లాలి... అప్పగించిన బాధ్యతని వీరోచితంగా ముగించాలి... ఇంతకీ ఆటేంటో తెలుసా? Kill Shot. పేరుకి తగ్గట్టుగానే చేతి నుండా అత్యాధునిక తుపాకీలు ఉంటాయి. అవసరం మేరకు వాటిని మార్చుకుని గురి చూసి తూటా పేలిస్తే శత్రువు గుండెల్లో దిగాల్సిందే. తూటా వెళ్లి శత్రువు గుండెల్లో దిగిన వైనాన్ని స్లో మోషన్‌లో చూడొచ్చు. ఆటలో మొత్తం 65 రకాల తుపాకీలను సొంతం చేసుకుని వాడొచ్చు. ఒక్కో తుపాకీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. దూరంగా ఉన్న వారిని జూమ్‌ చేసి గురి చూసేందుకు తెరపై స్క్రోల్‌ బార్‌ని ఏర్పాటు చేశారు. కావాల్సినట్టుగా జరుపుతూ గురి పెట్టొచ్చు. ఆకట్టుకునే 3డీ గ్రాఫిక్స్‌తో గేమ్‌ని రూపొందించారు. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.

BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

తూటాలా దూసుకెళ్తాడు!
స్పైడర్‌ మ్యాన్‌... సూపర్‌ మ్యాన్‌... ఐరన్‌ మ్యాన్‌! వీళ్లని సినిమాల్లోనూ... వీడియో గేమ్స్‌లోనూ చూసుంటారు. కానీ, మీరెప్పుడైనా 'బుల్లెట్‌ బాయ్‌'ని చూశారా? అయితే, జేబులోని ఆండ్రాయిడ్‌ మొబైల్‌ తీయండి. గూగుల్‌ ప్లేలోకి వెళ్లి Bullet Boy గేమ్‌ని ఇన్‌స్టాల్‌ చేయండి. ఆట ప్రారంభంలో నెత్తికి తూటా తగిలించుకుని దూసుకొస్తాడు. అక్కడి నుంచి తన ప్రయాణం మీ పూచీనే. సురక్షితంగా ఒక ఫిరంగి నుంచి మరో ఫిరంగిలోకి బుల్లెట్‌ బాయ్‌ని దూసుకెళ్లేలా చేయడమే ఆట. చాలా సింపుల్‌ అనుకుంటే పొరబాటే. ఎందుకంటే... ఫిరంగులు కదలకుండా ఉంటే సరే. కొన్ని మాత్రం కదులుతూనే ఉంటాయి. అంతేకాదు... ఫిరంగుల చుట్టూ ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. వాటికి బుల్లెట్‌ బాయ్‌ తగిలితే అంతే సంగతులు! ఆటలో మొత్తం లెవల్స్‌ 30కి పైనే! 3డీ గ్రాఫిక్స్‌తో ఆకట్టుకునేలా గేమ్‌ని రూపొందించారు. తెలివిగా బుల్లెట్‌బాయ్‌ని ఫైర్‌ చేస్తూ... పవర్‌ అప్స్‌ అందుకుంటూ లక్ష్యాన్ని చేరుకునేలా చేయాలి. మరెందుకు ఆలస్యం... బుల్లెట్‌ బాయ్‌ని బుల్లి తెరపైకి పిలిచేద్దాం అనుకుంటే వెళ్లండి.
* యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి పొందొచ్చు

BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

బుర్రకు మేత!
ఎప్పుడూ యాక్షన్‌ గేమ్‌లే ఆడితే ఏం బాగుంటుంది! అప్పుడప్పుడు ప్రశాంతంగా కూర్చుని పజిల్‌ గేమ్‌లు ఆడితే ఆ కిక్కే వేరు! ఏమంటారు? కావాలంటే Roll the Ball పజిల్‌ గేమ్‌ ఆడేయండి. చాలా సులువైన ఇంటర్ఫేస్‌తో గేమ్‌ని రూపొందించారు. ఆటని ఇన్‌స్టాల్‌ చేసి రన్‌ చేస్తే Beginner, Medium, Hard, Advanced, Extreme Pack బటన్లతో లెవల్స్‌ ఓపెన్‌ అవుతాయి. ఒక్కో దాంట్లో 60 లెవల్స్‌ ఉన్నాయి. మొదట్లో గేమ్‌ని సాధన చేసేందుకు 'బిగినర్‌ ప్యాక్‌'ని సెలెక్ట్‌ చేసుకోండి. ఇక ఆటలో ఏం చేయాలంటే... బ్లాకుల మధ్యలో ఉన్న బంతికి తోవని క్రియేట్‌ చేసి గమ్య స్థానానికి చేరేలా చేయాలి. బ్లాకుల్ని వాడుకుని బంతికి తోవని క్రియేట్‌ చేయడమే బుర్రకు మేత అన్నమాట. సులువైన లెవల్స్‌లో 'టైం లిమిట్‌' ఉండదు. లెవల్స్‌ మారుతున్న కొద్దీ బంతి నిర్ణీత సమయానికి కదలడం ప్రారంభమవుతుంది. ఇంతలోపే తికమకగా ఉన్న తోవని సరిగా సెట్‌ చేయాలి. మీ వేగానికి గేమ్‌లో రేటింగ్‌ ఉంటుంది. అంతేకాదు... మీరు ఎన్ని సార్లు బ్లాకుల్ని కదిపారో కూడా రికార్డ్‌ అవుతుంది. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.

BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

ఎఫ్‌బీలో...
ఫేస్‌బుక్‌లో ఎవరితోనైనా ఛాట్‌ చేయాలంటే? ఫ్రెండ్‌ లిస్ట్‌లో ఉండాల్సిందే. అంటే... ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపి, ఆహ్వానాన్ని మన్నించాకే ఫేస్‌బుక్‌లో ఎవరితోనైనా ఛాట్‌ చేయగలం. మరి, కొత్త వ్యక్తితో ఛాట్‌ చేయాలంటే? ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపకుండా... సరాసరి 'మెసేజ్‌ రిక్వెస్ట్‌' పంపొచ్చు తెలుసా? అందుకు కొత్తగా ఫేస్‌బుక్‌ వెబ్‌ ఫ్లాట్‌ఫాంపై ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఒకసారి బ్రౌజర్‌ ఓపెన్‌ చేసి ఫేస్‌బుక్‌లో లాగిన్‌ అవ్వండి. 'మెసేజ్‌' విభాగంలోకి వెళ్తే... మెసెంజర్‌లోని ఫ్రెండ్‌ లిస్ట్‌ కనిపిస్తుంది. ఒక్కొరిపై క్లిక్‌ చేసి ఛాటింగ్‌ చిట్టా చూడొచ్చు. ఇవన్నీ తెలిసినవే! ఇప్పుడు ఇన్‌బాక్స్‌ పక్కనే Other మెనూపై క్లిక్‌ చేయండి. ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ లేకుండా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మీకు వచ్చిన మెసేజ్‌ల జాబితాని చూడొచ్చు. అవన్నీ మీకు వచ్చిన 'మెసేజ్‌ రిక్వెస్ట్‌'లే అన్నమాట. మేసేజ్‌పై క్లిక్‌ చేస్తే 'ఛాట్‌ రిక్వెస్ట్‌'ని మన్నించినట్టే! మీరు మెసేజ్‌ చూసినట్టుగా, ఆహ్వానాన్ని మన్నించినట్టుగా సెండర్‌కి తెలుస్తుందేమో అనే సందేహం అక్కర్లేదు. మీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. మీకు ఇష్టమైతే సరాసరి సెండర్‌తో ఛాట్‌ చేయవచ్చు. ఫైల్స్‌, ఫొటోలు ఎటాచ్‌చేసి పంపొచ్చు. ఎమోటికాన్స్‌, స్టిక్కర్లతో కబుర్లు చెప్పుకోవచ్చు.



BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

అన్నీ కలిపేయండి
పీసీపై పనంటే కచ్చితంగా పీడీఎఫ్‌ ఫైల్స్‌ని మేనేజ్‌ చేయాల్సిన అవసరం వస్తుంది. ఉదాహరణకు ఏవైనా కొన్ని పీడీఎఫ్‌ ఫైల్స్‌ని ఒక్కటిగా కలిపేసి భద్రం చేయాలనుకుంటే? నెట్టింట్లో ఉన్న ఆన్‌లైన్‌ సర్వీసుల గురించో... ఉచిత టూల్స్‌ కోసమో వెతుకులాట మొదలుపెట్టక్కర్లేదు. వెంటనే PDF Combiner ఉచిత టూల్‌ని రన్‌ చేయండి చాలు. సిస్టంలో ఇన్‌స్టాల్‌ చేయక్కర్లేదు. జిప్‌ ఫార్మెట్‌లో డౌన్‌లోడ్‌ చేసిన ఫైల్‌ని ఎక్స్‌ట్రాక్ట్‌ చేయాలి. వచ్చిన exe ఫైల్‌ని రన్‌ చేసి పీడీఎఫ్‌లను మెర్జ్‌ చేసి ఒకే ఫైల్‌గా మార్చుకోవచ్చు. విడి పేజీలుగా ఉన్న పీడీఎఫ్‌ ఫైల్స్‌ని టూల్‌లోకి అప్‌లోడ్‌ చేసేందుకు Add files ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయాలి. ఒక్కసారి ఫైల్‌ని సెలెక్ట్‌ చేశాక వాటి వరుస క్రమాన్ని (Move up, Move down) కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. అక్కర్లేని ఫైల్స్‌ని తొలగించేందుకు Remove file ఆప్షన్‌ ఉంది. ఫైల్స్‌ ఎంపిక ముగిశాక Combine PDFs ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేసి అన్నింటినీ ఒకే ఫైల్‌గా మార్చేయవచ్చు. కన్వర్ట్‌ అయిన ఫైల్‌ని ఏదొక పేరుతో సేవ్‌ చేయాలి.


BY
tanugula rakesh
thanugularakesh@gmail.com