welcome to my blog

నా బ్లాగ్ ని visit చేసినందుకు ధన్యవాదాలు.మీకు కావాల్సిన ఆండ్రాయిడ్ apps మరియు latest pctips ని మీరు ఇక్కడ నా బ్లాగ్ లో తెలుసుకోవచ్చు.

hai

follow me on twitter https://twitter.com/rakeshtanugula.

రాకేష్ తనుగుల

contact me:thanugularakesh@gmail.com

hello this is my technical blog

you can view technlology updates and new android apps details in my blog as i know

facebook page

like my facebook page:https://www.facebook.com/pctipsrs/

Don't forgot to share my blog

If you like my blog.Don't forgot to share my blog Thank's you. from రాకేష్ తనుగుల

Apr 22, 2016

ప్రపంచంలోనే అతి సన్నని, నాజూకైన ల్యాప్‌టాప్‌ను హెచ్‌పీ సంస్థ తయారుచేసింది. కేవలం 10.4 మిల్లీమీటర్ల మందం, 13.3 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఈ ల్యాప్‌టాప్‌ ప్రపంచంలోనే అత్యంత సన్నదైన ల్యాప్ టాప్ ను 'స్పెక్టర్' పేరుతో మార్కెట్ లోకి వదలనుంది. ఏప్రిల్‌ 25న ప్రీ ఆర్డర్స్ ప్రారంభమవనున్నాయని సమాచారం. ఇంటెల్‌ ఐ5, 7 ప్రాసెసర్‌, బ్యాక్‌లిట్‌ కీబోర్డు, గ్లాస్‌ ట్రాక్‌ప్యాడ్‌, డ్యుయల్‌ స్పీకర్స్‌, గొరిల్లా గ్లాస్‌ డిస్‌ప్లే తదితర ఫీచర్లు కలిగిన ఈ ల్యాప్‌టాప్‌ ధర 1,169 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు. హెచ్‌పీ స్పెక్టర్‌ పేరుతో ఉన్న ఈ ల్యాప్‌టాప్‌ను న్యూయార్క్‌ టైమ్స్‌ ఇంటర్నేషనల్‌ లగ్జరీ కాన్ఫరెన్స్‌ లో ఆవిష్కరించారు.

The Mouse Box

అరచేతిలోనే అన్నీ అందించే సరికొత్త మౌస్‌అరచేతిలో అమరి పోయేలా, సరికొత్తగా ఒక మౌస్‌ వచ్చింది. ఇది కేవలం మౌస్ మాత్రమే అనుకుంటే పొరపాటు. ఇది సాధారణ మౌస్ కి ఎక్కువ, పూర్తి స్థాయి కంప్యూటర్ కి కొంచెం తక్కువ. కంప్యూటర్‌ ద్వారా జరిగే సగం పనులను చక చకా చేయగల ఈ కొత్త మౌస్ పేరు The Mouse Box అన్నమాట. ఇందులోనే ప్రాసెసర్‌, ర్యామ్‌, 128 జీబీ స్టోరింగ్ కెపాసిటి అన్నీ ఉంటాయి‌. అంటే ఒక సీపీయూ చేయగల పనులన్నీ ఇది కూడా చేయగలుగుతుంది. అయితే యూఎస్‌బీ పోర్ట్‌తోగాని, వైఫై ద్వారాగానీ దీనిని ప్రొజెక్టర్‌కి కనెక్ట్‌ చేయాల్సి వుంటుంది.  ఇదంతా అరచేతి పరిమాణంలో అమరిపోయే ఈ మౌస్ ద్వారానే సాధ్యం.

your name as google home page

బ్రౌజర్ ఓపెన్ చేయగానే మీ పేరుతో గూగుల్ సెర్చ్ ఓపెన్ హోం పేజీ ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? అయితే, www.shinysearch.com సైట్‌లోకి వెళ్లి చూడండి. Click to Select Style, Your Name టెక్ట్స్‌బాక్స్‌లు కనిపిస్తాయి.
మొదటి బాక్స్‌లో మీకు నచ్చిన స్త్టెల్ ఎంచుకుని రెండో దాంట్లో మీ పేరు టైప్ చేసి Create Custom Homepage క్లిక్ చేయండి. Google Search, Set as Homepage ద్వారా మీ పేరుతో గూగుల్ సెర్చ్ హోం పేజీ ప్రత్యక్షమవుతుంది. క్రియేట్ చేసుకున్న హోం పేజీని బ్రౌజర్ ఓపెన్ చేయగానే డీఫాల్ట్‌గా వచ్చేలా చేయాలంటే Set As Homepage క్లిక్ చేయండి. తర్వాత వచ్చిన పేజీలో మీరు వాడుతున్న బ్రౌజర్ ఆధారంగా కనిపించే లింక్‌ను కాపీ చేసి Tools->Options->General లోని హోం పేజీ బాక్స్‌లో కాపీ చేసి ఓకే చేయండి. ఇక బ్రౌజర్‌లో మీదే హోం పేజీ.

కీబోర్డ్‌లో వరుసగా అమర్చిన Function Key లకు ఎసైన్ చేసిన షార్ట్‌కట్స్ వరుసగా... F1 ఏదైనా సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన హెల్ప్‌ను చూపిస్తుంది. F2 ఫైల్, ఫోల్డర్‌ను ఎంచుకుని రీనేమ్ చేయవచ్చు. F3 ఏదైనా పోగ్రాంలో సెర్చ్ ఫీచర్‌ను ఓపెన్ చేస్తుంది. F4ఫైండ్ విండో ఓపెన్. F5 విండోస్ రీఫ్రెష్. F6 బ్రౌజర్‌లోని అడ్రస్‌బార్‌లోకి కర్సర్‌ని పంపొచ్చు. F7 ఎంఎస్ వర్డ్‌లో స్పెల్‌చెక్, గ్రామర్ యాక్సెస్ చేయవచ్చు. F8 విండోస్‌ను సేఫ్ మోడ్‌లో ఓపెన్ చేయవచ్చు. F9 క్వార్క్‌లో మెజర్‌మెంట్స్ టూల్స్‌ని పొందొచ్చు. F10 వర్డ్‌లోని మెనూబార్‌ను యాక్టివేట్ చేయవచ్చు. F11 వర్డ్‌లోని సేవ్ విండోను యాక్సెస్ చేయవచ్చు

మీ పీసీలో మీకు తెలియకుండా మార్పులు చేయాలంటే? 'రిజిస్ట్రీ' ని లక్ష్యం చేసుకుంటే చాలు. హ్యాకర్లకు పని సులభం అవుతుంది. మరి, రిమోట్‌ యాక్సెస్‌ ద్వారా రిజిస్ట్రీని ఎడిట్‌ చేయకుండా రక్షణ వలయం ఏర్పాటు చేయాలంటే? Remote Registry స్టేటస్‌ ఏంటో చెక్‌ చేసుకోవాలి. అందుకు స్టార్ట్‌లోని 'రన్‌' లోకి వెళ్లి Service.msc కమాండ్‌ని రన్‌ చేయండి. వచ్చిన 'సర్వీసెస్‌' విండోలోని రిమోట్‌ రిజిస్ట్రీ ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయాలి. రైట్‌ క్లిక్‌ చేసి సర్వీసెస్‌ Stopped మోడ్‌లోనే ఉన్నాయో లేదో చెక్‌ చేసుకోవాలి. Manual, Disable ఉండేలా సెట్‌ చేయాలి.

విండోస్‌ అన్ని వెర్షన్లలోనూ 'కాలిక్యులేటర్‌' ఉంటుంది. మరి, ఇప్పటి వరకూ మీరు కేవలం కూడికలు... తీసివేతలు లాంటి ఇతర లెక్కింపులకే వాడి ఉంటారు. కానీ, విండోస్‌ 7 వెర్షన్‌లో అదనపు సౌకర్యాల్ని జత చేయవచ్చు. ఉదాహరణకు మైళ్లని కిలోమీటర్లలోకి, మీటర్లను అడుగుల్లోకి మార్చుకుని చూడాలంటే? అందుకు కాలిక్యులేటర్‌లో చిట్కా ఉంది. మెనూ బార్‌లోని View మెనూలోకి వెళ్లి Unit Conversion ఆప్షన్ని సెలెక్ట్‌ చేయండి. షార్ట్‌కట్‌ ద్వారా కావాలంటే Crtl+U మీటల్ని వాడొచ్చు. అలాగే, రోజువారీ ఖర్చుల్ని లెక్కగట్టేందుకు Worksheets వాడుకోవచ్చు. తేదీల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకునేందుకు Date Calculation ఆప్షన్ని సెలెక్ట్‌ చేసుకోండి.

మీ సిస్టం ఐపీ అడ్రస్‌ తెలుసుకోవాలంటే? అదేం క్లిష్టమైన ప్రక్రియేం కాదు. చాలా సులభంగా తెలుసుకోవచ్చు. మీకు ఇంటర్నల్‌ ఐపీ అడ్రస్‌ కావాలంటే స్టార్ట్‌లోకి వెళ్లి RUN ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేసి CMD టైప్‌ చేసి కమాండ్‌ని రన్‌ చేయండి. వచ్చిన డాస్‌ కమాండ్‌ ప్రాంప్ట్‌ దగ్గర ipconfig అని టైప్‌ చేయాలి. దీంతో జాబితాగా మొత్తం వివరాలు కనిపిస్తాయి.
* ఇక సిస్టం ఎక్స్‌టర్నల్‌ ఐపీ అడ్రస్‌ని తెలుసుకోవాలంటే? ప్రత్యేక వెబ్‌ సర్వీసుతో చిటికెలో సాధ్యం. కావాలంటే www.getip.com సైట్‌లోకి వెళ్లండి. మీరు ఉన్న లొకేషన్ని అదనపు సమాచారంగా పొందొచ్చు.

కొన్ని వెబ్‌ సైట్‌లను బ్రౌజ్‌ చేసేప్పుడు మౌస్‌ రైట్‌క్లిక్‌ పని చేయకపోవడం ఎప్పుడైనా గమనించారా? ఉదాహరణకు బ్రౌజ్‌ చేస్తున్న వెబ్‌సైట్‌లోని టెక్స్ట్‌ని సెలెక్ట్‌ చేసి కాపీ చేయడానికి ప్రయత్నిస్తే రైట్‌క్లిక్‌ పని చేయదు. ఇలాంటి సందర్భాల్లో రైట్‌క్లిక్‌ని ఎనేబుల్‌ చేయవచ్చు. క్రోమ్‌ బ్రౌజర్‌ని వాడుతున్నట్లయితే మెయిన్‌ మెనూలోకి వెళ్లి 'సెట్టింగ్స్‌'పై క్లిక్‌ చేయండి. వచ్చిన పేజీలో తిరిగి Advanced Settings పై క్లిక్‌ చేసి Content Settings ఆప్షన్ని సెలెక్ట్‌ చేయాలి. తర్వాత జావాస్క్రిప్ట్‌ విభాగంలోకి వెళ్లి Do not allow any site to run javascript ఆప్షన్ని చెక్‌ చేయాలి. తిరిగి బ్రౌజర్‌ని రీస్టార్ట్‌ చేయండి.
* ఫైర్‌ఫాక్స్‌ వాడుతున్నట్లయితే Optionsలోకి వెళ్లి Content ఆప్షన్ని సెలెక్ట్‌ చేయండి. వచ్చిన మెనూల్లోని JavaScript ఎనేబుల్‌ చేయాలి.

windows 8 shortcut keys

windows 8 shortcut  keys
* ఎన్ని విండోస్‌ అప్లికేషన్లు ఓపెన్‌ చేసి ఉన్నప్పటికీ డెస్క్‌టాప్‌పైకి వచ్చేందుకుWin key +B మీటని వాడొచ్చు.
* ఓపెన్‌ చేసిన అన్ని విండోలను మినిమైజ్‌ చేసేందుకు win key+D
* మై కంప్యూటర్‌ని ఓపెన్‌ చేసేందుకు Win Key+E
* ఏవైనా ఫైల్స్‌ వెతికేందుకు Win Key+F
* షేర్‌ సెట్టింగ్స్‌ని ఓపెన్‌ చేసేందుకు Win Key+H
* ఓపెన్‌ చేసి ఉన్న అప్లికేషన్‌ సెట్టింగ్స్‌ని చూసేందుకు Win Key+I
* డెస్క్‌టాప్‌ని లాక్‌ చేసేందుకు Win Key+L
* సెలెక్ట్‌ చేసి ఉన్న విండోని మ్యాక్సిమైజ్‌ చేసేందుకు Win Key+Shift+M మీటల్ని నొక్కొచ్చు.
* విండోస్‌ యాక్సెస్‌ సెంటర్‌ని ఓపెన్‌ చేసేందుకు Win Key+U
* కంట్రోల్‌ ప్యానల్‌లో ఉండే Administrative Settings కావాలంటే Win Key+X
* ప్రొజెక్టర్‌ ఆప్షన్స్‌ కోసం Win Key+P.

ఇంట్లో నుంచి బయటికి వచ్చాక ఎప్పుడు ఏం జరుగుతుందో వూహించలేం. రోడ్డుపై ఎన్నో ప్రమాదాలు... చూస్తుంటాం... వెంటనే స్పదించి సాయం చేస్తుంటాం. ఈ నేపథ్యంలో ప్రమాదంలో గాయపడిన వారి కుంటుంబానికి సమాచారాన్ని అందించేందుకు బాదితుల ఫోన్‌ని యాక్సెస్‌ చేయడానికి చూస్తాం. కానీ, ఇప్పుడు అన్నీ స్మార్ట్‌ మొబైళ్లు కావడంతో వాటిని ఇతరులు ఆన్‌లాక్‌ చేయడం అసాధ్యం. ఇలాంటి సందర్భాల్లో ఫోన్‌ లాక్‌ స్క్రీన్‌పైనే కాంటాక్ట్‌ వివరాలు డిస్‌ప్లే అయ్యేలా చేయవచ్చు తెలుసా? అదెలాగంటే... ఫోన్‌ సెట్టింగ్స్‌లోని ‘సెక్యూరిటీ’ విభాగంలోకి వెళ్లండి. అక్కడ కనిపించే Ower Info ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేసి కాంటాక్ట్‌ వివరాల్ని ఎంటర్‌ చేయండి. ఇలా పెట్టుకున్న సమాచారాన్ని లాక్‌ స్క్రీన్‌పై కనిపించాలంటే Show owner info on lock screen ఆప్షన్‌ని చెక్‌ చేయండి. ఇక ఫోన్‌ లాక్‌ స్క్రీన్‌పై కాంటాక్ట్‌ సమాచారం నిత్యం కనిపిస్తుంది. దీంతో మీ ఫోన్‌ ఎక్కడైనా మరిచిపోయినా... దొరికిన వ్యక్తి వెంటనే మీరు పెట్టుకున్న కాంటాక్ట్‌కి ఫోన్‌ చేసే అవకాశం ఉంటుంది.

Zaggle ఆప్‌

మీరు ఎప్పుడైనా చెల్లించిన బిల్లుని ఆప్‌లోకి అప్‌లోడ్‌ చేసి క్యాష్‌బాక్‌ని పొందారా? అదెలా సాధ్యమో తెలియాలంటే Zaggle ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేయండి. ‘రెస్టారెంట్‌ క్యాష్‌బాక్‌’లను అందించే ఆప్‌ ఉంది. ఎలాగంటే... హోటల్‌కి వెళ్లారు... తిన్నాక బిల్లు చెల్లించారు.  చెల్లించిన అదే బిల్లుని ఆప్‌లోకి అప్‌లోడ్‌ చేస్తే చాలు. ఆప్‌ ద్వారా ఆ హోటల్‌ అందించే డిస్కౌంట్‌ మొత్తాన్ని క్యాష్‌బాక్‌ రూపంలో పొందొచ్చు. ఇలా డిపాజిట్‌ అయిన Earned Points మొత్తాన్ని ఈ-ఓచర్‌గా వాడుకోవచ్చు. అంటే... ఫోన్‌ని రీఛార్జ్‌ చేయవచ్చు. సినిమా టిక్కెట్టు బుక్‌ చేసుకోవచ్చు. ఈ-షాపింగ్‌ చేసిన తర్వాత బిల్లు చెల్లింపులో Redeem చేయవచ్చు. ఆప్‌ స్టోర్‌ నుంచి ఇన్‌స్టాల్‌ చేశాక వాడుతున్న మెయిల్‌ ఐడీతో సభ్యులవ్వాలి. తర్వాత మీరు ఉన్న చోటుకి దగ్గర్లో ఉన్న హోటళ్లు అందించే క్యాష్‌బాక్‌ ఆఫర్లను బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. జాబితాలోని హోటళ్లలో తిన్న తర్వాత హోం స్క్రీన్‌ కింద కనిపించే Upload Bill ఆప్షన్‌తో ఫొటో తీసి అప్‌లోడ్‌ చేయాలి. 24 గంటల్లో క్యాష్‌బ్యాక్‌ మొత్తం ఎకౌంట్‌కి డిపాజిట్‌ అవుతుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లను ఆప్‌ సపోర్ట్‌ చేస్తుంది.

Apr 12, 2016

మొబైల్ రీచార్జ్ చేసుకోవడానికి దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 7308080808కు మొబైల్ నంబర్‌తోపాటు ఖాతా నంబర్‌కు చెందిన చివరి ఐదు నంబర్లు సంక్షిప్త సమాచార రూపంలో పంపించాల్సి ఉంటుంది. వినియోగదారుడు రూ.10 నుంచి రూ.250 లోపు ఎంతైన రీచార్జ్ చేసుకునే అవకాశం కల్పించింది.
ఈ మొత్తం రీచార్జ్‌ ను కస్టమర్‌కు చెందిన బ్యాంక్ ఖాతాలోంచి కట్ చేయనున్నది. ఈ సేవలు పొందాలంటే కస్టమర్ రూ.50తో ముందుగా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు లేక స్నేహితులకు సైతం రీచార్జ్ సదుపాయాన్ని కల్పించనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారులు తెలిపారు.